సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశాడు! | Actress files rape case against owner of event management firm | Sakshi

సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశాడు!

Jan 9 2015 10:05 AM | Updated on Apr 3 2019 8:58 PM

సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశాడు! - Sakshi

సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశాడు!

సినిమా పేరుతో మోసం చేసిన మరో ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

ముంబై: సినిమా పేరుతో మోసం చేసిన మరో ఉదంతం తాజాగా వెలుగు చూసింది. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సినిమా ఇండస్టీలో నిలదొక్కుంటున్న ఓ నటి అత్యాచారానికి గురైన ఘటన ముంబైలో  కలకలం రేపింది.  సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తాను సుబర్బన్ చార్ కోప్ నిర్వహిస్తున్నఈవెంట్ ప్రోగ్రామ్స్ కు వెళ్లిన క్రమంలో అక్కడికి వచ్చిన ముఫ్దాల్ ఘడియాలి అనే వ్యక్తి  నమ్మించి మోసం చేశాడని ఆ నటి తెలిపింది.

 

ముఫ్దాల్ తనను సుబర్బన్ ద్వారా తనను పరిచయం చేసుకున్నాడని..  త్వరలో ఓ సినిమా తీయబోతున్నట్లు నమ్మబలికి అత్యాచారం చేసినట్లు ఆమె తెలిపింది. కొన్ని రోజుల క్రితం సినిమాలో ఛాన్స్ లో భాగంగా అతని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది.  సినిమాకు సంబంధించిన కాంటాక్ట్ పై సంతంకం చేయాల్సి ఉందని చెప్పడంతో తాను అతని ఇంటికి వెళ్లానని..  ఆ క్రమంలోనే ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడని పేర్కొంది. అటు తరువాత తాను సృహ కోల్పోయానని.. చాలా సేపటికి తిరిగి మేల్కోన్న అనంతరం అత్యాచారానికి గురైనట్లు గ్రహించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ ఈవెంట్ మేనేజర్ సుబర్బన్ చార్ కోప్ ను  అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement