యశోద మూవీ నటుడు, మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకించ్చింది. లైంగిక వేధింపులు కేసులో అతడికి స్టే ఆర్డర్‌ను విత్ డ్రా చేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్ని ముకుందన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి 2018లో ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంఓ ఉన్ని ముకుందన్ తరపు న్యాయవాది ఈ కేసులో బాధిత యువతి సంతకం చేసినట్లు తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించడంతో హైకోర్టు ఆమె ఫిర్యాదును కొట్టిపారేసింది.
చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ
అంతేకాదు ఈ కేసులో ఉన్ని ముకుందన్‌కు స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో తాను ఎలాంటి పత్రాలపై సంతకం చేయలేదని బాధిత యువతి కోర్టుకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో ఉన్ని ముకుందన్‌కు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను తాజాగా హైకోర్ట్ విత్ డ్రా చేసుకుంది. అంతేకాదు కోర్టుకు తప్పుడు పత్రాలను చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని చూసిన వివాదాస్పద లాయర్ సాయిబీ జోస్ కిడంగూర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన చర్య అని, ఈ ఆరోపణలపై సమాధానాలు చెప్పాలని న్యాయవాదిని ఆదేశించింది.
చదవండి: ఆ కామెంట్ నన్ను తీవ్రంగా బాధిస్తోంది: జాన్వీ కపూర్ ఆవేదన
ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్‌ను ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా ఈ కేసును కోర్టు బయటే పరిష్కరించేందుకు సదరు బాధిత యువతి అంగీకరిస్తున్నట్లుగా ఆమె సంతకం చేసిన పత్రాన్ని న్యాయవాది సాయిబీ జోస్ కోర్టు ఫేక్ డాక్యూమెంట్స్ సమర్పించినట్లు సమాచారం. దీంతో కోర్టు ఉన్ని కృష్ణన్‌కు ఈ కేసులో స్టే ఆర్టర్ ఇచ్చింది. అయితే తాను ఎలాంటి పత్రాలపై సంతకం చేయలేదని, అవి తప్పుడు పత్రాలని సదరు యువతి కోర్టుకు వాంగ్మూలంతో ఇవ్వడంతో కేరళ హైకోర్టు ఉన్ని కృష్ణన్, సదరు న్యాయవాదిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment