హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు | Ameesha Patel Dragged to Court for Refusing to Perform at Wedding | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు

Published Sun, Feb 17 2019 8:25 AM | Last Updated on Sun, Feb 17 2019 9:04 AM

Ameesha Patel Dragged to Court for Refusing to Perform at Wedding - Sakshi

సినిమాలకు దూరమైన సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్‌. బద్రి, నాని లాంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ భామ చిక్కుల్లో ఇరుక్కుంది. ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న అమీషా, ఆ వేడుకకు హాజరు కాకపోవటంతో ఆమె పై చీటింగ్ కేసు నమోదైంది.

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదబాద్‌లో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్‌ కంపెనీ నిర్వాహకుడు పవన్‌ శర్మ ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేసేందుకు అమీషాతో ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా 11 లక్షల రూపాయలు చెల్లించారు. కానీ అమీషా ఆ వేడుకకు హాజరు కాకుండా మరో రెండు లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేస్తున్నారు.

2016లో జరిగిన ఈ సంఘటన కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు పవన్‌ శర్మ. డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా అమీషాను కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. హీరోయిన్ అమీషా పటేల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు... మార్చి 12లోగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement