Amala Paul Files Complaint Against Her Ex Boyfriend Bhavninder Singh, Deets Inside - Sakshi
Sakshi News home page

Amala Paul: ఆ వీడియోలను విడుదల చేస్తా.. అమలాపాల్ కు వేధింపులు!

Published Tue, Aug 30 2022 5:40 PM | Last Updated on Sat, Sep 3 2022 12:42 PM

Amala Paul Files Cheating Complaint Against  Her Ex Boyfriend - Sakshi

హీరోయిన్‌ అమలాపాల్‌ విల్లుపురం(తమిళనాడు) పోలీసులను ఆశ్రయించారు.మాజీ ప్రియుడు పవీందర్‌ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పవీందర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్‌ చేశారు. మిగతా 11 మంది కోసం గాలింపు చేపట్టారు.

(చదవండి: ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్‌ హీరోయిన్ల డిమాండ్‌)

2018లో అమలాపాల్‌, పవీందర్‌ సింగ్‌ సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ నిర్మాణ సంస్థ లావాదేవీల్లో విబేధాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. డబ్బులు అడిగితే ప్రైవేట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెరదిస్తున్నాడని అమలాపాల్‌ ఫిర్యాదులో పేర్కొంది. పవీంధర్ సింగ్ స్నేహితులు కూడా తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement