అమరావతి ఆర్భాటం-సీమకు మరో విద్రోహం
ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నంబర్ వన్ కావాలని చంద్రబాబు తరచూ అంటున్నారు. శంకు స్థాపన పని అంతా ఈవెంట్‌మేనేజ్‌మెంట్‌కు ఇచ్చి చేయిస్తున్నామని ప్రభు త్వం ప్రకటించుకుంది. ఇది చాలదని ప్రతి ఊరి నుంచి నీరు, మట్టి తీసుకురావాలని ప్రజలకు పిలుపు ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని భూములన్నీ రాజ దాని కిందికి లాగేసుకుంటే వ్యవసాయం మాటే మిటని? ప్రశ్నిస్తే... చంద్రబాబు దాపరికం లేకుండా రాజధానిలో వ్యాపారం చేసి సంపద పెంచుతాం... అన్నారు. మనం ఉత్పత్తి గురించి మాట్లాడితే వాళ్లు కార్పొరేట్ల వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు.
అమరావతి ప్రపంచంలోనే నంబర్ వన్ విధ్వం సక నిర్మాణం. దాని చుట్టూ లక్షల ఎకరాల భూదం దా ఉంది. దేశ విదేశాల్లోని కార్పొరేట్లన్నీ రాజధాని చుట్టూ మోహరించాయి. అగ్రకుల సంపన్న వర్గాలు, కార్పొరేట్‌శక్తులు మన రైతుల, ప్రజల రక్తమాంసాలు పీల్చేసుకొని లాభాలు ఎలా పొందవచ్చునో చంద్ర బాబు పథకం తయారు చేసి ఇచ్చాడు. ఆ ప్రకారమే అమరావతి నిర్మాణమవు తుంది.
ఇదంతా ఒక ఎత్తయితే రాయలసీమకు మరో సారి జరుగుతున్న విద్రోహం ఇంకో ఎత్తు. రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒప్పందం ఉల్లంఘించడం దగ్గరి నుంచి పదేపదే సీమకు అన్యాయం జరుగు తోంది. అమరావతితో శ్రీబాగ్ తాజాగా వంచనకు గురైంది. దీనికి పట్టిసీమ మంచి ఉదాహరణ. నదుల అనుసంధానమనే భావన సంపన్నుల, కార్పొరేట్ల ప్రయోజనానికి బలైపోయింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో కూడా ఇంతకంటే భారీ అన్యాయం రాయలసీమకు జరగబోతోంది. ఆంధ్రరాష్ట్ర హయాం నుంచి ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ దాకా పాలకులు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అన్ని పథకాలు రాయలసీమకు ద్రోహం చేసినవే. అమరావతిగాని, పోలవరంగాని అలాంటి అన్యాయాలకు పరాకాష్ట. సీమ ప్రాజెక్టులకు చిల్లి గవ్వలు విదిల్చి, కోటానుకోట్లతో అమరావతి నిర్మి స్తున్నారు.
పోలవరం నిర్మిస్తున్నారు. రాయలసీమలో నిర్మించాల్సిన రాజధానిని సంపన్న వర్గాల ప్రయో జనం కోసం, కార్పొరేట్ల ధనదాహం, భూదాహం తీర్చడం కోసం అమరావతిలో నిర్మించడం రాయల సీమ ప్రేమికుల కడుపు రగుల్చు తుంది. రాయల సీమలాగే వెనుకబడిన కళింగాంధ్ర ప్రజల అభివృద్ధికి కూడా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకం. సంపన్నుల ప్రయోజనాల కోసం పని చేస్తున్న చంద్ర బాబు విధానాలు కళింగాంధ్ర ప్రజలకు తీరని అన్యా యం చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఉరి తాళ్లకు విద్యార్థులు చచ్చిపోతున్నారు. రాయలసీమ లో ఈ ఖరీఫ్ కరువుతో కనీవినీ ఎరుగని స్థాయిలో జనాలు వలస వెళుతున్నారు.
అమరావతికి శంకుస్థాపన అంటే రాయలసీమ ప్రజాప్రయోజనాలను భూస్థాపితం చేయడమే. సీమ ప్రజలను ఘోరంగా వంచించడమే. అందుకే అక్టో బర్ 22 రాయలసీమ విద్రోహ దినం. ఆంధ్రప్రదేశ్‌లో సీమకు చీకటి రోజు. కోస్తా ప్రాంత ప్రజల, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా కాలరాచే కుట్ర, దుర్మార్గం ఇందులో ఉన్నాయి. సంపన్న వర్గాల కోసం, కార్పొరేట్ల దోపిడీ కోసం నిర్మిస్తున్న రాజధాని మనకొద్దని అందరూ ఉద్యమించాలి.
ప్రత్యేక హోదా పేరిట వచ్చే రాయితీలు, నిధులు అన్నీ సంపన్న వర్గాల బొక్కసాలకే వెళతాయని ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. ప్యాకేజీలు కాదు... ప్రత్యేక రాష్ట్రమే రాయలసీమ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఈ స్ఫూర్తితో రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని బహి ష్కరిద్దాం. మీ రాజధానీ మాకొద్దు, మీ రాష్ట్రమూ మాకొద్దు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వా ల్సిందే అని ఉద్యమిద్దాం.
(అక్టోబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టరేట్ వద్ద రాజధాని శంకుస్థాపనను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళన సందర్భంగా)
వ్యాసకర్త కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక, కర్నూలు యూనిట్, 94402 94462
- అరుణ్