
జూన్ 1 నుంచి కొత్త సేవా పన్ను రేటు అమల్లోకి
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో కొత్తగా 14 శాతం మేర ప్రతిపాదించిన సర్వీస్ ట్యాక్స్ రేటు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఇది విద్యా సుంకం సహా 12.36 శాతంగా ఉంది. తాజా రేటుతో రెస్టారెంట్లలో తినడం, బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి. అడ్వర్టైజింగ్, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్టుల సేవలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటన్నింటిపైనా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది.