Service tax rate
-
స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వివిధ సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సును విధించే అంశాన్ని తర్వాత నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, జూన్ 1 నుంచి 14 శాతం సేవల పన్ను అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సెస్సు ద్వారా వసూలైన మొత్తాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. సర్వీస్ ట్యాక్స్‌ను 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడంతో పాటు అన్ని లేదా కొన్ని ఎంపిక చేసిన సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్త సర్వీస్ ట్యాక్స్ రేటుతో రెస్టారెంట్లలో తినడం మొదలుకుని బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు, విమాన ప్రయాణాల దాకా చాలా మటుకు సేవలు మరింత భారంగా మారనున్నాయి. -
జూన్ 1 నుంచి కొత్త సేవా పన్ను రేటు అమల్లోకి
న్యూఢిల్లీ: బడ్జెట్లో కొత్తగా 14 శాతం మేర ప్రతిపాదించిన సర్వీస్ ట్యాక్స్ రేటు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఇది విద్యా సుంకం సహా 12.36 శాతంగా ఉంది. తాజా రేటుతో రెస్టారెంట్లలో తినడం, బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి. అడ్వర్టైజింగ్, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్టుల సేవలు, ఈవెంట్ మేనేజ్మెంట్ మొదలైన వాటన్నింటిపైనా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది.