స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వివిధ సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సును విధించే అంశాన్ని తర్వాత నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, జూన్ 1 నుంచి 14 శాతం సేవల పన్ను అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సెస్సు ద్వారా వసూలైన మొత్తాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.
సర్వీస్ ట్యాక్స్‌ను 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడంతో పాటు అన్ని లేదా కొన్ని ఎంపిక చేసిన సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్త సర్వీస్ ట్యాక్స్ రేటుతో రెస్టారెంట్లలో తినడం మొదలుకుని బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు, విమాన ప్రయాణాల దాకా చాలా మటుకు సేవలు మరింత భారంగా మారనున్నాయి.