అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్స్ చేసింది. అయితే సస్పెన్షన్ విషయంలో తుది నిర్ణయాన్ని సభకే వదిలిపెట్టినట్టు ప్రివిలేజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గురువారం ప్రివిలేజ్ కమిటీ 62 పేజీల నివేదిక అందజేసింది. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా అనుచితంగా ప్రవర్తించారంటూ గతంలో ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు స్పీకర్ సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్ డిసెంబర్‌లోనే ముగిసింది.
తుదినిర్ణయం సభకే వదిలేసిన ప్రివిలేజ్ కమిటీ
Published Thu, Mar 16 2017 1:04 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement