వీరంగం వేసిన షాహీర్పై సస్పెన్షన్ వేటు
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మద్యం సేవించి విధులు నిర్వహించిన ఎంఎన్వో షాహీర్పై సస్పెన్షన్ వేటు పడింది. షాహీర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకట బుద్ధ తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైనా మద్యం సేవించి విధులు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన గురువారమిక్కడ విజ్ఞప్తి చేశారు. షాహీర్పై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 307 కింద కేసు నమోదు అయ్యింది.
కాగా షాహీద్ ఈరోజు ఉదయం మద్యం మత్తులో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చిన అక్సిజన్ అతడు తొలగించాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. దీంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. రోగి బంధువులు ఎంఎన్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఎంఎన్వోను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెట్ను డిమాండ్ చేశారు.