kakinada government hospital
-
కలకలం రేపిన పసికందుల విక్రయం
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ : పసికందుల విక్రయ వ్యవహారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఉలిక్కిపడేలా చేసింది. అప్పుడే పుట్టిన పిల్లను ఇక్కడ పనిచేసిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేరొకరికి విక్రయించారన్న వ్యవహారం బయటికొచ్చింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. అక్రమ సంబంధాలతో పుట్టిన పసికందులను, ఆర్థిక ఇబ్బందుల వల్ల గర్భిణులు వదిలి వెళ్లిన మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఆడబిడ్డకు ఒక రేటు, మగ బిడ్డకు ఒకరేటు పెట్టి విక్రయాలు సాగిస్తున్నట్టుగా అధికారులకు తెలియడంతో వారు నివ్వెరపోయారు. విశాఖ జిల్లా షిప్‌యార్డ్‌కు చెందిన 30 ఏళ్ల వయస్సు గల మహిళ ఈ ఏడాది జూలై 23వ తేదీ ఉదయం ప్రసవం కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. అదే రోజు ఉదయం 9.37 నిమిషాలకు ప్రసవించింది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు డిశ్చార్జ్ అయ్యింది. తనకెవ్వరూ లేరని, తన ఇష్ట పూర్వకంగా వెళ్లిపోతున్నానని చెప్పి, ఆమేరకు రాసిన పేపరుపై వేలి ముద్ర వేసి వెళ్లిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడామె వ్యవహారం ఆసుపత్రి అధికారుల దృష్టికి వచ్చింది. తన పసి బిడ్డను ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారని, అందుకు ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మహిళ ఇదే ఆసుపత్రిలో మరో విభాగం పనిచేస్తున్న ఆమె భర్త మధ్యవర్తులగా వ్యవహరించి, రూ.60వేలకు పసికందును బేరం పెట్టారని బుధవారం ఓ వ్యక్తి ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమై ఆరా తీశారు. క్రయ, విక్రయాల వ్యవహారం ఆసుపత్రిలో జరగలేదని, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జరిగి ఉండొచ్చని నిర్ధారణ వచ్చిన అధికారులు ఆరోజు ప్రసవమైన మహిళ కేస్ షీట్, ఇతర వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే క్రయవిక్రయాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడిది ఆసుపత్రిలో చర్చనీయాంశమై అన్ని విభాగాల్లో కలకలం రేపింది. ఇప్పటికే అనేక ఘటనలు గతేడాది నవంబర్ 23న గంటా లక్ష్మికి అప్పుడే పుట్టిన బిడ్డకు టీకాలు వేయించాలని పండు రమణ అనే మహిళ మాయమాటలు చెప్పి బయటికి ఉడాయించింది. సీసీ పుటేజీ ఇతరత్రా ఆధారాలతో ఆ మాయలేడీ రమణను పట్టుకున్నారు. అంతకు ముందు 2010 మేనెలలో ఓ బిడ్డ అపహరణకు గురైంది. పుట్టిన బిడ్డ చనిపోవడంతో అదను చూసుకుని ఓ మహిళ జీజీహెచ్‌లో బిడ్డను తీసుకుపోయింది. పిఠాపురం ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించి, ఆమెను పట్టుకుని బిడ్డను వెనక్కి తీసుకుని ఆ తల్లికి అప్పగించారు. 2016లో ఇదే తరహాలో శిశువును తస్కరించగా, అదే రోజు సాయంత్రానికి కల్లా కిర్లంపూడి ప్రాంతంలో గుర్తించి తల్లికి అప్పగించారు. ఇవి తమ ఆసుపత్రికి మాయని మచ్చగా మిగిలిపోయాయని, అటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేందుకు అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో పసికందు విక్రయ వ్యవహారం దృష్టికి రావడంతో అధికారులు మరింత కలవరం చెందుతున్నారు. -
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఆడశిశువు అదృశ్యం
-
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే...కాకినాడ పూసలవారివీధి బుడంపేటకు చెందిన పెంకే అమ్మాజీ (44)కి మెడకింద భాగంలో కాయ ఏర్పడటంతో గత కొంతకాలంగా నొప్పితో బాధపడుతోంది. ఈ నెల 22వ తేదీన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చి ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరారు. ఈమెకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించగా ధైరాయిడ్ గ్రాండ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్రాండ్‌ని ఆపరేషన్ ద్వారా తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. మంగళవారం ఈమెకు ఆపరేషన్ చేసి గ్రాండ్‌ని తొలగించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకి తరలించారు. కొంత సమయానికి తీవ్ర ఆయాసం, ఎగ ఊపిరి సంభవించడంతో వైద్యులు ఈమెకు ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన ఆయాసం తగ్గకపోవడంతో వైద్యులు ఊపిరితీసుకునేటట్లు చికిత్స అందించారు. అనంతరం మృతి చెందింది. వెంటనే బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. ఆరోగ్యంగా ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చిన మా అమ్మ అమ్మాజీ వైద్యుల నిర్లక్ష్యం కారణగానే మృతి చెందిందని కుమారుడు ఆనందరావు ఆరోపించాడు. సకాలంలో వైద్యులు చికిత్స అందించి ఉంటే బతికేదన్నారు. ఆపరేషన్, వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని బంధువులతో ఆందోళనకు దిగారు. కేస్ షీట్ ఇవ్వాల్సిందిగా కోరినా వైద్యులు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పోస్ట్‌మార్టమ్ చేయించుకోవాలని, అందులో వాస్తవాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారని వాపోయాడు. బం«ధువులు పోస్ట్‌మార్టమ్‌కి అంగీకరించకపోవడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలిపాడు. ఈ విషయమ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై 3వ యూనిట్ చీఫ్ డీఎస్‌వీఎల్ నరసింహంను వివరణ కోరగా పేషెంట్ ధైరాయిడ్ గోయ్ట్రీ సమస్యతో ఆసుపత్రికి రాగా, సర్జరీ చేసి ధైరాయిడ్ గ్రాండ్‌ని తొలగించినట్లు తెలిపారు. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ పూర్తి ఫిట్‌గా ఉందన్నారు. బీపీ లెవెల్స్ పెరిగి, గుండెపోటుకి గురై మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. వైద్యుల తప్పిదం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. -
ఈ అభాగ్యురాలెవరో?
► దిక్కుతోచని స్థితిలో గర్భిణి కాకినాడ క్రైం : ఓ అమాయక గిరిజన యువతి తనకు ఎవరూ లేరంటూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెగర్భిణికావడం, సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. తన పేరు పార్వతి అని, తమది కొత్తపల్లి అని మాత్రమే ఆ యువతి చెబుతోంది. మరే ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో ఆమె వివరాలు తెలియరాలేదు. వైద్యులు ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకోకపోవడంతో అధికారులకు విలేకరులు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు స్పందించి ఆమెను ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు. ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరనే విషయాలు తెలియకపోవడంతో సిబ్బంది సందిగ్ధంలో పడ్డారు. గర్భవతి అయిన ఆ యువతి షాక్‌కు గురై ఉంటుందని, ఎవరో ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. ఆమె గిరిజన యువతి కావడంతో ఐటీడీఏ అధికారులు స్పందించి ఆమెను చేరదీయాలని కోరుతున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో కామినేని తనిఖీలు
-
షాహిర్ ట్రీట్ మెంట్ ప్రతాపానికి రోగి మృతి
కాకినాడ: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎన్ఓ షాహిర్ మద్యం మత్తులో చేసిన ట్రీట్మెంట్ ఫలితంగా రోగి వీరబాబు మృతి చెందాడు. దాంతో వీరబాబు బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. షాహిర్ను వెంటనే అరెస్ట్ చేయాలని రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఆసుపత్రి ఉన్నతాధికారులతోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. రోగి బంధువులను శాంతింప చేసేందుకు వారు సమయాత్తమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో షాహిర్ ఎంఎన్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే షాహిర్ మద్యం సేవించి గురువారం ఆసుపత్రికి వచ్చాడు. ఆ క్రమంలో ఇసీయూలో చికిత్స పొందుతున్న రోగి వీరబాబుకు అమర్చిన అక్సిజన్ లెవెల్స్ పెంచాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. ఆ విషయం తెలుసుకున్న వీరబాబు బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఎంఎన్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోగి బంధువులు... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. దాంతో ఎంఎన్‌వోను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెట్ వెంకట బుద్ధ ప్రకటించారు. అంతేకాకుండా షాహీర్పై పోలీస్ స్టేషన్లో సెక్షన్ 307 కింద కేసు నమోదు అయిన సంగత తెలిసిందే. -
వీరంగం వేసిన షాహీర్పై సస్పెన్షన్ వేటు
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మద్యం సేవించి విధులు నిర్వహించిన ఎంఎన్‌వో షాహీర్పై సస్పెన్షన్ వేటు పడింది. షాహీర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకట బుద్ధ తెలిపారు. ఆస్పత్రిలో ఎవరైనా మద్యం సేవించి విధులు నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన గురువారమిక్కడ విజ్ఞప్తి చేశారు. షాహీర్పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 307 కింద కేసు నమోదు అయ్యింది. కాగా షాహీద్ ఈరోజు ఉదయం మద్యం మత్తులో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చిన అక్సిజన్ అతడు తొలగించాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. దీంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. రోగి బంధువులు ఎంఎన్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఎంఎన్‌వోను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెట్‌ను డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి వీరంగం
-
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగి వీరంగం
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో ఎంఎన్‌వో గురువారం వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చిన అక్సిజన్ తొలగించాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. దీంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. రోగి బంధువులు ఎంఎన్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. ఎంఎన్‌వోను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆసుపత్రి సూపరింటెండెట్‌ను డిమాండ్ చేశారు. -
జూనియర్ వైద్యుల మందు పార్టీపై... స్పందించిన డా. బుద్దా
కాకినాడ: జూనియర్ వైద్యుల మందు పార్టీపై... ఆస్పత్రి సూపరిండెంట్ డా. బుద్దా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు మద్యసేవనం చేయడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులలో నైతిక విలువలు దిగజారుతున్నాయని అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసామని చెప్పారు. పార్టీలో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని డా. బుద్దా తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోని గైనిక్ వార్డు సమీపంలో మద్యం తాగుతూ దాదాపు 20 మంది జూనియర్ వైద్యులు మీడియాకు చిక్కిన ఘటన తెలిసిందే. వీరంతా మద్యం మత్తులో చిందులు వేయడంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్లు మద్యం తాగుతున్న ప్రాంతంలో మద్యం బాటిళ్లతో పాటు గుట్కా ప్యాకెట్లు, మత్తు ఇంజెక్షన్లు కూడా లభ్యమయ్యాయి. కానీ, జూనియర్ వైద్యుల ఈ తతంగాన్ని చిత్రీకరించినందుకు గాను మీడియాపై వాళ్లు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ తీవ్రంగా దూషించారు. -
కేస్ షీట్లు మారటం వాస్తవమే: డాక్టర్ బుద్ధ
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేసు షీట్లు మారిన ఘటనపై సూపరింటిండెంట్ డాక్టర్ బుద్ద స్పందించారు. కేస్ షీట్లు మారిడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సత్యవతికి సరైన వైద్యమే అందించామని.... అనుమానాలు ఉంటే పోస్ట్‌మార్టం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూపరింటిండెంట్ అన్నారు. కాగా వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్... మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించక పోవడంతో... రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారని... ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని... తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. -
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి
-
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అని ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళలు అనారోగ్యం పాలై ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఇద్దరు మహిళల కేస్ షీట్లు తారుమారు అయ్యాయి. దాంతో ఒకరికి చేయాల్సిన వైద్యం మరో మహిళకు చేశారు. దీంతో వైద్యం వికటించి సత్యవతి అనే మహిళ మృతి చెందింది. దాంతో సత్యవతి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సత్యవతి మరణించిందని ఆమె తరఫు బంధువులు బుధవారం ఉదయం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.