షాహిర్ ట్రీట్ మెంట్ ప్రతాపానికి రోగి మృతి
కాకినాడ: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎన్ఓ షాహిర్ మద్యం మత్తులో చేసిన ట్రీట్మెంట్ ఫలితంగా రోగి వీరబాబు మృతి చెందాడు. దాంతో వీరబాబు బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. షాహిర్ను వెంటనే అరెస్ట్ చేయాలని రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఆసుపత్రి ఉన్నతాధికారులతోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. రోగి బంధువులను శాంతింప చేసేందుకు వారు సమయాత్తమయ్యారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో షాహిర్ ఎంఎన్వోగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే షాహిర్ మద్యం సేవించి గురువారం ఆసుపత్రికి వచ్చాడు. ఆ క్రమంలో ఇసీయూలో చికిత్స పొందుతున్న రోగి వీరబాబుకు అమర్చిన అక్సిజన్ లెవెల్స్ పెంచాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. ఆ విషయం తెలుసుకున్న వీరబాబు బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.
ఎంఎన్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోగి బంధువులు... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. దాంతో ఎంఎన్వోను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెట్ వెంకట బుద్ధ ప్రకటించారు. అంతేకాకుండా షాహీర్పై పోలీస్ స్టేషన్లో సెక్షన్ 307 కింద కేసు నమోదు అయిన సంగత తెలిసిందే.