Patient dies
-
యూపీలో ‘కప్పా’ వేరియంట్ కలకలం, ఒకరు మృతి
సాక్షి, లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్ కలకలం రేపుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళన రేపిన ఆందోళన ఇంకా సమసిపోకముందే యూపీలో కరోనా కొత్త వేరియంట్ ‘కప్పా’ పాజిటివ్ నిర్ణారణ అయిన 66 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇతడిని సంత్ కబీర్ నగర్ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు. జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో దీన్ని గుర్తించారు. అనంతరం వీటి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కి పంపించారు. మే 27 న కోవిడ్ -19 కు పాజిటివ్ నిర్ధారణ కాగా, జూన్ 12 న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీకి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న కన్నుమూశాడని కాలేజీ మైక్రోబయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధ్రువీకరించారు. అంతకుముందు యూపీలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా రాష్ట్రంలో గురువారం (జూలై 8) నాటి గణాంకాల ప్రకారం 112 కొత్త కేసులతో మొత్తం సంఖ్య 17,07,044 కి చేరింది. 10 మరణాలతో ఈ సంఖ్య 22,676 కు చేరుకుంది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌ను ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 50కిపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇపుడిక కప్పా వేరియంట్ ఉనికి ఆందోళన రేపుతోంది. -
కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి
ఇస్లామాబాద్: అప్పుడప్పుడు ఆర్ఎంపీలు, కాంపౌండర్లు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు చికిత్స చేయడమే కాక ఏకంగా ఆపరేషన్లు కూడా చేస్తూ.. బాధితుల ప్రాణాలతో ఆడుకుంటున్న సంఘటనలను అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. మాజీ సెక్యూరిటీ గార్డు ఒకరు తానే వైద్యుడినని చెప్పి ఓ వృద్ధురాలికి ఆపరేషన్ చేశాడు. దురదృష్టం కొద్ది సర్జరీ వికటించి సదరు మహిళ చనిపోయింది. ఆ వివరాలు.. పాకిస్తాన్ లాహోర్‌కు చెందిన షమీమా బేగం(80) వెన్నులో ఏదో సమస్య తలెత్తింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షమీమా కుటుంబ సభ్యులకు మాజీ సెక్యూరిటీ గార్డ్ మహ్మాద్ వహీద్ బట్ తారసడ్డాడు. తాను ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్నాని నమ్మ బలికి వారి సమస్య ఏంటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత షమీమాకు వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అని చెప్పాడు. తనకు కొంత డబ్బు ఇస్తే.. వెంటనే సర్జరీ చేస్తానని వారికి తెలిపాడు. దాంతో షమీమా కుటుంబ సభ్యులు అతడికి కొంత డబ్బు ఇచ్చారు. బట్ మరో టెక్నిషియన్‌ను తీసుకెళ్లి షమీమాకు ఆపరేషన్ చేశాడు. రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించాడు. ఆ తర్వాత బట్ రెండు సార్లు షమీమా ఇంటికి వెళ్లి డ్రెస్సింగ్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు షమీమా ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఆపరేషన్ చేసిన దగ్గర తీవ్ర రక్తస్రావం కాసాగింది. దాంతో షమీమాకు గతంలో ఆపరేషన్ చేసిన ఆస్పత్రికే తీసుకెళ్లి పరిస్థితి వివరించగా.. ఆ ఆస్పత్రిలో బట్ అనే డాక్టర్ ఎవరు లేరని తెలిసింది. అప్పటికే షమీమా మృతి చెందింది. ఇక బట్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. అతడిని విధుల నుంచి తొలగించినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. చదవండి: వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు -
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్‌లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది. కర్ణాటకలో నలుగురు మృతి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్‌గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఐదుగురు కరోనా బాధితులు మృతి డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది. తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది రూపాయలను ఫీజుల రూపంలో తీసుకుంటూనే, ప్రాణాలకు గ్యారంటీని ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు జిల్లా ప్రజల్లో కలవరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం అంటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం... వీరికి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బాధితుల పక్షన నిలబడి ఆందోళనలు చేయడం... కుటుంబానికి న్యాయం చేయాలని లక్షల్లో డిమాండ్ చేయడం, చివరికి బాధితులకు ఎంతో కొంత ఇప్పించడం వైద్యులు సైతం ఈ గొడువలెందుకులే అని లక్షల్లో ముట్టజెప్పడం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.... ఈ నెల 17 మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం డోర్‌పెల్లి గ్రామానికి చెందిన డోంగ్రీ సాయినాథ్ – తిరుమల కూతురు సంకీర్తణ (8) జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం డెంగీ జ్వరం అని, ప్లేట్లేట్స్ 43వేలే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొదుతూ ఈ నెల 18న సాయంత్రం మృతి చెండడంతో వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రూ. 2లక్షలకు ఒప్పందం... విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు. జోక్యం చేసుకుని ఇరువార్గాలతో మాట్లాడి ఆందోళన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరే ఉండడంతో మృత దేహాన్ని తీసుకెళ్లడానికి విముకత చూపించారు. తమ గ్రామం నుంచి తమకు చెందిన బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోదిస్తూ ఉండిపోయారు. గురువారం సాయినాథ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మరోసారి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రూ. 15లక్షలు పరిహారం అందజేయాలని డి మాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం 3గంటల పాటు చర్చల అనంతరం రూ.2లక్షల ఇచ్చేదుకు అంగీకరించడంతో వివాదం సర్దుమనిగింది. 16గంటల పాటు పోలీస్ పహారా.... ఆసుపత్రి ఎదుట ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుండా ఉండేందుకు ఈ నెల 18న రాత్రి 8గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఈ నెల19న ఉదయం11 గంటల వరకు అంటే 16గంటల పాటు పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
‘నన్ను కూడా చంపండి’
పట్నా : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తనను కూడా చంపాలంటూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగాడో వ్యక్తి. ఈ ఘటన బిహార్‌లోని ముజాఫర్పూర్ నగరంలో జరిగింది. ముజాఫర్‌పూర్‌కు చెందిన ఓవ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో రెండు నెలల క్రితం నగరంలోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన సోదరుడు మృతి చెందాడిని మృతుడి తమ్ముడు ఆరోపించారు. మెరుగైన చికిత్స అందించాలని కోరినా.. డాక్టర్లు స్పందించలేదని వాపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తన సోదరుడిని డాక్టర్లు పొట్టనపెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి సోకి చాలా మంది చనిపోతున్నారు. దీంతో మా సోదరుడికి మంచి చికిత్స అందించాలని డాక్టర్లను వేడుకున్నాం. అయినా స్పందించలేదు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ మంచి చికిత్స అందించకపోవడంతో నా సోదరుడు మృతి చెందాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నన్ను కూడా చంపండి. నాకు బతకాలని లేదు. డాక్టర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయనాయకులు వచ్చివెళ్లారు కానీ.. ఎవరూ సమస్యలపై ఆరా తీయలేదని’ మృతుడి సోదరుడు ఆరోపించారు. కాగా బీహార్ లో మెదడువాపు వ్యాధి మరణ మృదంగం మోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 97కు చేరారు. ఒక్క ముజఫర్ పూర్ లోనే మృతుల సంఖ్య 84గా ఉంది. -
రుయా ఆస్పత్రిలో దారుణం
సాక్షి, తిరుపతి : సిబ్బంది నిర్లక్ష్యం, సదుపాయాల లేమి కారణంగా ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగింది. తిరుపతికి చెందిన బాబు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని జనరల్ వార్డులో చేర్చారు. అనంతరం అక్కడి సిబ్బంది, డాక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత బాబుకి ఫిట్స్ వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మానవత్వంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడి స్టెచర్ లేదంటూ దాదాపు అరగంట పాటు అతన్ని ఆపారు. తర్వాత వైద్యులు వచ్చి బాబుని పరీక్షించి మృతి చెందారని తెలిపారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతపెద్ద ఆస్పత్రిలో కనీసం రోగులను తీసుకెళ్లడానికి స్టెచర్ లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సందర్శించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. -
ప్రాణం ఖరీదు రూ.50 !
-
రూ. 150 లంచం ఇవ్వలేక భర్త ప్రాణాలను..
-
రోడ్డున పడ్డ కృష్ణ కుటుంబం
హైదరాబాద్: ఊర్లో ఇల్లు లేదు.. భూమి లేదు.. మృతదేహాన్ని తమ గూడేనికి తరలించేందుకు చేతిలో పైసా లేదు.. దహన సంస్కారాలకు దిక్కులేదు.. ఇదీ రూ. 150 లంచం ఇవ్వలేక నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త ప్రాణాలను పోగొట్టకున్న కృష్ణనాయక్ భార్య కవిత దీనస్థితి. భర్త మృతి చెందడంతో కవిత దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. స్వగ్రామానికి వెళ్లలేక నలు గురు చిన్నారులతో హైదరాబాద్‌లోని తట్టి అన్నారం అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని చెట్ల కిందనే భర్త అంత్యక్రియలను జరిపించింది. ప్రాణం ఖరీదు రూ. 150! మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారానికి చెందిన కృష్ణనాయక్ కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలతో కలసి అల్వాల్ శివనగర్‌లో ఉంటున్నాడు. మొదటి భార్య చనిపోయింది. ఆమెకిద్దరు ఆడపిల్లలు. రెండో భార్య కవితకు ఒక బాబు, ఒక పాప. కృష్ణనాయక్ చనిపోవడంతో నలుగురు చిన్నపిల్లల భారం కవితపై పడింది. ఏడాది కూడా నిండని చంటిపిల్లని విడిచి పనికి వెళ్లే పరిస్థితి లేదు. అలా అని పనిచేయకుంటే గడిచే స్థితి కనిపించడం లేదు. భర్త ప్రాణం పోయేందుకు కారణమైన ఆసుపత్రి సిబ్బంది కనికరించడం లేదు. ఈ స్థితిలో ఉన్న కవిత కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుని సహాయాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రాణం ఖరీదు రూ. 150!
- ఆక్సిజన్ కోసం లంచమడిగిన అటెండర్ - పైసల్లేక పోవడంతో ఆగిన ఊపిరి - ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో దారుణం హైదరాబాద్ సోమవారం అర్ధరాత్రి.. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి.. తీవ్రమైన ఆస్తమాతో అక్కడ చికిత్సపొందుతున్న కృష్ణనాయక్ అస్వస్థతకు గురయ్యాడు.. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నాడు.. అది గమనించిన అతని భార్య డ్యూటీలోని సిబ్బంది వద్దకు వెళ్లింది.. వెంటనే ఆక్సిజన్ పెట్టాలన్న సిబ్బంది అందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. తన దగ్గర డబ్బు లేదని, ఆక్సిజన్ పెట్టాలని ఆమె కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. దీంతో కొద్దిసేపటికే కృష్ణ మృతి చెందాడు. ప్రాణాలు నిలబెట్టాల్సిన ప్రభుత్వాస్పత్రుల సిబ్బంది లంచాల దురాశతో ప్రాణాలు తోడేసిన వైనమిది. దీనిపై పలువురు రోగులు, వారి బంధువులు మంగళవారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో.. ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలోకి వచ్చినప్పటి నుంచీ.. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయారం గ్రామానికి చెందిన వడ్త్యా కృష్ణనాయక్‌కు భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న కృష్ణను కవిత సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగం వద్దకు కూడా వెళ్లలేని స్థితిలో కృష్ణ ఉండటంతో కవిత వెళ్లి స్లిప్ (చీటీ) రాయాలని కోరింది. కానీ రోగిని తీసుకొస్తే తప్ప ఓపీ చీటీ ఇవ్వబోమనడంతో.. అతికష్టంగా ఓపీ కౌంటర్ వద్దకు తీసుకెళ్లింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఊపిరి సరిగా తీసుకోలేకపోతుండటంతో ఆక్సిజన్ పెట్టారు. రాత్రి విధులకు వచ్చిన నళిని అనే వైద్యురాలు కూడా కృష్ణనాయక్‌ను పరీక్షించి.. ఆక్సిజన్ అందుతూనే ఉండేలా చూడాలని డ్యూటీ నర్స్ రీటాకు, అటెండర్లకు సూచించారు. కానీ కొద్దిసేపటి తర్వాత అంతా బాగానే ఉందంటూ నర్సు, అటెండర్ ఆక్సిజన్ సరఫరాను తీసేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఊపిరి అందక కృష్ణనాయక్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇది చూసిన కవిత పరిగెత్తుకుంటూ నర్సు రీటా వద్దకు వెళ్లి చెప్పింది. కానీ ఆమె రాలేదు. మళ్లీ వెళ్లి అడగడంతో పదే పదే రావద్దంటూ బెదిరించి, వెళ్లగొట్టింది. కాళ్లావేళ్లా పడినా.. నర్సు రాకపోవడంతో ఆందోళనగా ఉన్న కవిత వద్దకు అటెండర్ నయీమ్ వచ్చాడు. డబ్బులు ఇస్తే ఆక్సిజన్ అందజేస్తానని చెప్పాడు. ఆలస్యమైతే కృష్ణ చనిపోతాడనీ బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరైన కవిత.. తన భర్తను కాపాడాలని వేడుకుంది. అయినా నర్సుగానీ, అటెండర్‌గానీ స్పందించలేదు. తన భర్త పరిస్థితిని చూసి ఆందోళనకు గురైన కవిత మరోసారి వెళ్లి కాళ్లావేళ్లా పడింది. అయినా వారు కవితను తిట్టి పంపించేశారు. దీం ఏడుస్తూ ఆమె బెడ్ వద్దకు వచ్చే సరికి కృష్ణనాయక్ ప్రాణాలు విడిచాడు. ఆందోళన చేయడంతో.. భర్త మరణించడాన్ని చూసిన కవిత పెద్ద పెట్టున రోదించింది. ఇదంతా గమనిస్తున్న పక్క బెడ్ల మీద ఉన్న రోగులు, వారి బంధువులు నర్సును, అటెండర్‌ను నిలదీశారు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో కృష్ణకు ఆక్సిజన్ అందించలేదని, నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో నర్సు, అటెండర్ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి డ్యూటీ డాక్టర్, ఇతర సిబ్బంది వచ్చి ఉదయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రోగులు, బంధువులు వెనక్కి తగ్గారు. మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మృతుడి బంధువులు ఛాతీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. కృష్ణ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా.. ఆక్సిజన్ అందించక కృష్ణ మృతిచెందిన విషయం తెలిసినా ఆస్పత్రి సూపరింటెండెంట్ మంగళవారం ఉదయం వరకు అక్కడికి రాలేదు. పైగా ఆస్పత్రిలో రోగులు ఆందోళన చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బంధువులు కృష్ణ మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఇద్దరు ఉద్యోగులపై వేటు కృష్ణనాయక్ భార్యను లంచం డిమాండ్ చేసిన నయీమ్ అనే అటెండర్‌ను, ఔట్‌పేషెంట్ బ్లాక్ వద్ద దురుసుగా ప్రవర్తించిన ధన్‌రాజ్ అనే మరో ఉద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్ఎంవో డాక్టర్ నరేందర్ తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు రీటాపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. -
ఆపరేషన్ వికటించి రోగి మృతి!
మహబూబాబాద్: వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందాడు. ఆపరేషన్ వికటించడం వల్లే మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపిస్తుండగా, గుండెపోటుతో మృతి చెందినట్టు చికిత్స అందించిన వైద్యుడు చెప్పుతున్నారు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల శివారు కొల్లగుంట తండాకు చెందిన భూక్యా సక్రు (60) శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికు వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. శస్త్రచికిత్స చేసేందుకు ముందు ముక్కుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అది వికటించి మృతి చెందినట్టు సక్రు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, వైద్యుడు మాత్రం... ఆపరేషన్ సమయంలో ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని, తమ వంతు ప్రయత్నం చేసిన తర్వాత ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా రోగి మృతి చెందినట్టు తెలిపారు. -
అర్ధరాత్రి మృతదేహాన్ని దహనం చేస్తూ దొరికిపోయాడు
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అర్ధరాత్రి సమయంలో రహస్యంగా మృతదేహాన్ని దహనం చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం రామాలయం వద్ద సబ్‌రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి నిప్పంటించాడు. చెత్త తగులబడుతుందని స్థానికులు అనుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో అటువైపు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడని, వైద్యం వికటించి మృతి చెందిన రోగి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన బైక్ పై ఎక్కించుకుని శంషాబాద్‌లో దహనం చేస్తున్నాడని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రిలో రోగి మృతి : బంధువుల ఆందోళన
నల్లగొండ : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలొదిలింది. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మునుగోడు మండల కేంద్రానికి చెందిన జయమ్మ(30) సోమవారం రాత్రి కడుపునొప్పితో నల్లగొండలోని సురక్ష ఆస్పత్రిలో చేరింది. కాగా అక్కడ చికిత్స తీసుకుంటూ మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాధితురాలు మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు మోహరించాయి. -
షాహిర్ ట్రీట్ మెంట్ ప్రతాపానికి రోగి మృతి
కాకినాడ: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎన్ఓ షాహిర్ మద్యం మత్తులో చేసిన ట్రీట్మెంట్ ఫలితంగా రోగి వీరబాబు మృతి చెందాడు. దాంతో వీరబాబు బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. షాహిర్ను వెంటనే అరెస్ట్ చేయాలని రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఆసుపత్రి ఉన్నతాధికారులతోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. రోగి బంధువులను శాంతింప చేసేందుకు వారు సమయాత్తమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో షాహిర్ ఎంఎన్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే షాహిర్ మద్యం సేవించి గురువారం ఆసుపత్రికి వచ్చాడు. ఆ క్రమంలో ఇసీయూలో చికిత్స పొందుతున్న రోగి వీరబాబుకు అమర్చిన అక్సిజన్ లెవెల్స్ పెంచాడు. దాంతో సదరు రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మరింది. ఆ విషయం తెలుసుకున్న వీరబాబు బంధువులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఎంఎన్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోగి బంధువులు... ఆసుపత్రి గేటు వద్ద ఆందోళనకు దిగారు. దాంతో ఎంఎన్‌వోను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెట్ వెంకట బుద్ధ ప్రకటించారు. అంతేకాకుండా షాహీర్పై పోలీస్ స్టేషన్లో సెక్షన్ 307 కింద కేసు నమోదు అయిన సంగత తెలిసిందే. -
కేస్ షీట్లు మారటం వాస్తవమే: డాక్టర్ బుద్ధ
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కేసు షీట్లు మారిన ఘటనపై సూపరింటిండెంట్ డాక్టర్ బుద్ద స్పందించారు. కేస్ షీట్లు మారిడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సత్యవతికి సరైన వైద్యమే అందించామని.... అనుమానాలు ఉంటే పోస్ట్‌మార్టం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూపరింటిండెంట్ అన్నారు. కాగా వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్... మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించక పోవడంతో... రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారని... ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని... తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.