క్యాన్సర్కూ చికిత్స | treatment for cancer in sangareddy hospital soon | Sakshi
Sakshi News home page

క్యాన్సర్కూ చికిత్స

Published Thu, Jul 7 2016 2:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

క్యాన్సర్కూ చికిత్స - Sakshi

క్యాన్సర్కూ చికిత్స

త్వరలో సంగారెడ్డి ఆసుపత్రిలో..
స్థానికంగానే కీమో థెరపీ అందుబాటులోకి..
ఈ ఆసుపత్రి అభివృద్ధికి రూ.కోటి నిధులు
త్వరలో డయాలసిస్ యూనిట్ ప్రారంభం
మెడికల్ కాలేజీ ఏర్పాటును పరిశీలిస్తాం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

సాక్షి, సంగారెడ్డి : స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో క్యాన్సర్ వైద్య చికిత్స కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన  పరిషత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తేనున్నటు ్టచెప్పారు. క్యాన్సర్ బాధితులకు అవసరమైన కీమో థెరపీ సేవలు స్థానికంగానే లభిస్తాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న రెండువేల పోస్టుల ను త్వరలో భర్తీ చేస్తామన్నారు. సంగారెడ్డిలో వైద్య కళాశా ల ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మం జూరయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ఆసుపత్రి అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐసీయూలో బెడ్‌ల సంఖ్యను ఇరవైకి పెంచుతామన్నారు. వారం రోజుల్లో ఐదు వెంటిలేటర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు త్వరలో డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 150పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్‌ను రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. మరింత మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతమున్న స్కానింగ్ యంత్రం సరిపోనందున మరో స్కానింగ్ మెషిన్‌ను సమకూరుస్తామన్నారు. కొత్తగా క్యాంటిన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

 వార్డుల్లో కలియదిరిగిన మంత్రి...
మంత్రి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి పలు వార్డుల్లో కలియదిరిగారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. బ్లడ్‌బ్యాంక్, మహిళల వార్డు, ఐసీయూ, ఎర్లి ఇట్రవెన్షనల్ సెంటర్, మెటర్నిటీ వార్డు, నియోనాటల్ కేర్ సెంటర్లను పరిశీలించారు. ఆసుపత్రి కారిడార్‌లో ఉన్న ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు జన్నబాయితో  మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగాలేనందున వైద్యం కోసం వచ్చినట్టు తెలపడంతో వెంటనే ఆమెను వార్డుకు తరలించాలని సూపరింటెండెంట్ రాజాగౌడ్‌ను ఆదేశించారు. సంగారెడ్డికి చెందిన వాజిద్ మంత్రిని కలిసి తన ఇద్దరు పిల్లలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారికి సరైన చికిత్స, మందులు అందడం లేదన్నారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అక్కడి అధికారులకు సూచించారు.

ఐసీయూ, మెటర్నిటీ వార్డుల్లోనూ రోగులు, బాధితులతో మంత్రి మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఖాళీ ప్రదేశంలో ల్యాండ్‌స్కేపింగ్ చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ... సంగారెడ్డి ఆసుపత్రికి నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొండాపూర్, సదాశివపేట ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డి.సంగారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజాగౌడ్, డీఎంహెచ్‌ఓ అమర్‌సింగ్, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఓ జగన్నాథ్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి వస్తున్నట్టు ముందే తెలియడంతో ఆసుపత్రి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం రోగులతో కిటకిటలాడే ఓపీ విభాగం మంత్రి వచ్చే వరకు ఖాళీగా కన్పించడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement