జూనియర్‌ వైద్యుల మందు పార్టీపై... స్పందించిన డా. బుద్దా | Dr Buddha reacts on junior doctors take liquor in kakinada government hospital | Sakshi
Sakshi News home page

జూనియర్‌ వైద్యుల మందు పార్టీపై.. స్పందించిన డా. బుద్దా

Published Tue, Dec 24 2013 2:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

జూనియర్‌ వైద్యుల మందు పార్టీపై... స్పందించిన డా. బుద్దా

జూనియర్‌ వైద్యుల మందు పార్టీపై... స్పందించిన డా. బుద్దా

కాకినాడ: జూనియర్‌ వైద్యుల మందు పార్టీపై... ఆస్పత్రి సూపరిండెంట్‌ డా. బుద్దా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో జూనియర్‌ డాక్టర్లు మద్యసేవనం చేయడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులలో నైతిక విలువలు దిగజారుతున్నాయని అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసామని చెప్పారు. పార్టీలో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని డా. బుద్దా తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోని  గైనిక్ వార్డు సమీపంలో మద్యం తాగుతూ దాదాపు 20 మంది జూనియర్ వైద్యులు మీడియాకు చిక్కిన ఘటన తెలిసిందే. వీరంతా మద్యం మత్తులో చిందులు వేయడంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్లు మద్యం తాగుతున్న ప్రాంతంలో మద్యం బాటిళ్లతో పాటు గుట్కా ప్యాకెట్లు, మత్తు ఇంజెక్షన్లు కూడా లభ్యమయ్యాయి. కానీ, జూనియర్ వైద్యుల ఈ తతంగాన్ని చిత్రీకరించినందుకు గాను మీడియాపై వాళ్లు దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ తీవ్రంగా దూషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement