
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. సత్యవతి అని ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళలు అనారోగ్యం పాలై ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఇద్దరు మహిళల కేస్ షీట్లు తారుమారు అయ్యాయి. దాంతో ఒకరికి చేయాల్సిన వైద్యం మరో మహిళకు చేశారు. దీంతో వైద్యం వికటించి సత్యవతి అనే మహిళ మృతి చెందింది.
దాంతో సత్యవతి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సత్యవతి మరణించిందని ఆమె తరఫు బంధువులు బుధవారం ఉదయం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.