విశాఖపట్నం: దేవాదాయ శాఖ టౌన్ ఇన్ స్పెక్టర్ రాజకుమారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు...కోర్టుకు సంబంధించిన రిపోర్టులను పట్టించుకోకపోవడంతో పాటు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల విచారణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ వెల్లడించారు.