కాలేజీలో పరీక్ష గదిలోనే మహిళా లెక్చరర్పై లా స్టూడెంట్ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడటంతో పాటు ఏకంగా దాడి చేశాడు.
కాలేజీలో పరీక్ష గదిలోనే మహిళా లెక్చరర్పై లా స్టూడెంట్ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడటంతో పాటు ఏకంగా దాడి చేశాడు. పరీక్ష రాసేందుకు ఆలస్యంగా వచ్చినందుకు అనుమతించకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గుర్గావ్లోని లా కాలేజీలో ఈ సంఘటన జరిగింది.
శనివారం ఉదయం 9:30 గంటలకు లా ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఆరంభమయ్యాయి. అజయ్ చౌదరి అనే విద్యార్థి అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రలోకి వచ్చాడు. అక్క్డడ విధులు నిర్వహిస్తున్న మహిళా లెక్చరర్ అతన్ని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అయితే అతను లెక్చరర్పై దాడి చేసి ఆన్సర్ షీట్ తీసుకున్నాడు. పరీక్ష ముగిసిన అనంతరం నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.