నిందితుడు రామారావు
చిలకలగూడ : లా కాలేజీ విద్యార్థినిపై ఓ న్యాయవాది లైంగికదాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పద్మారావునగర్ వెంకటాపురంకాలనీకి చెందిన ఇమ్మినేని రామారావు న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎల్‌ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఛాదర్‌ఘాట్‌కు చెందిన చదువులో భాగంగా సిటీ సివిల్‌కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఈ నేపథ్యవలో ఆమెకు అదే కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావుతో పరిచయం ఏర్పడింది.
ఈ సదర్భంగా ఆమెకు తన విజిటింగ్ కార్డు ఇచ్చిన రామారావు ఏమైనా సందేహాలు ఉంటే సహాయం చేస్తానని చెప్పి ఆమె ఫోన్ నంబరు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న సదరు యువతికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించిన అతను ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషచయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఈనెల 25న రాత్రి మరోమారు ఆమెకు ఫోన్ చేసి తన వద్ద నగ్నచిత్రాలు, వీడియోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో బాధితురాలు అతడి ఇంటికి వచ్చి గొడవ చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామారావు భార్య సుప్రజ బాధితురాలిపై దాడికి దిగడంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది.
ఆత్మహత్యాయత్నం డ్రామా
చిలకలగూడ పోలీసులు అక్కడికి రావడంతో తనను అరెస్టు చేస్తారనే భయంతో రామారావు బాత్‌రూంలోకి వెళ్లి హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించాడు. అయితే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించగా, అతడికి ఎలాంటి ప్రాణాపాయంలేదని వైద్యులు ధృవీకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రామారావుతోపాటు అతడి భార్య సుప్రజపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రామారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అతడి భార్య సుప్రజ కోసం గాలిస్తున్నారు. చిలకలగూడ ఠాణాలో రామారావుపై 2016లోనే రౌడీషీట్ నమోదైఉందని, 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment