సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. విశాఖలో దారుణం జరిగింది. విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.
రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షితో విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఈ కేసులో బాధితురాలికి నిందితులలో ఒకరికి రెండు నెలల నుంచి పరిచయం ఉందని.. విచారణ జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment