న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మెడికల్ బోర్డ్ స్పష్టతనిచ్చింది. ఆయన ఉరివేసుకోవడం వల్లే మరణిం చారని, హత్య కాదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం ధృవీకరించింది. సుశాంత్ మృతికి విషప్రయోగం, లేదా గొంతు నులిమి చంపడం కారణమన్న వాదనని, ఆరుగురు సభ్యుల ఫోరెన్సిక్ వైద్యుల బృందం తోసిపుచ్చింది.
ఇది కచ్చితంగా ఆత్మహత్యేనంటూ తమ నివేదికను సీబీఐకి అందజేసినట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు. ఇదే తమ బృందం ఇచ్చే చివరి నివేదిక అని పేర్కొన్నారు. ఉరివేసుకోవడం వల్ల గొంతు దగ్గర రాపిడి తప్ప, సుశాంత్ శరీరంపై గాయాలు లేవని, పెనుగులాటకు సంబంధించిన గుర్తులు లేవని ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ గుప్తా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment