4 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటుడు | Amit Sadh Said Attempted Suicide Four Times | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 23 2020 8:30 PM | Last Updated on Mon, Nov 23 2020 8:35 PM

Amit Sadh Said Attempted Suicide Four Times - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత డిప్రెషన్‌, మానసిక అనారోగ్య సమస్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమ జీవితంలో డిప్రెషన్‌కు గురైన సందర్భాలను, సూసైడ్‌ చేసుకోవాలని భావించిన సందర్భాల గురించి వెల్లడించారు. తాజాగా ‘కాయ్‌ పో చే’ నటుడు అమిత్‌ సాధ్‌ జాబితాలో చేరారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని తెలిపారు. అమిత్‌ మాట్లాడుతూ.. ‘16 నుంచి 18 ఏళ్ల వయసులో నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. ఆత్మహత్య ఆలోచనలు ఉండేవి కావు. కానీ సూసైడ్‌ చేసుకోవాలని భావించేవాడిని. ఇందుకు గాను ఓ ప్రాణాళిక అంటూ ఉండేది కాదు. ఏదో ఓ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడిని.. అలా చేస్తూ ఉండేవాడిని’ అన్నారు. అమిత్‌ మాట్లాడుతూ.. ‘నాలుగోసారి ఆత్మహత్యాయత్నం చేస్తున్నప్పుడు నా ఆలోచన విధానం మారింది. ఎందుకు చనిపోవడం.. గివ్‌ అప్‌ చేయడం ఎందుకు అనుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది’ అన్నారు. (చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి)

‘అయితే ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత జీవితాన్ని ఇలా ముగించడం కరెక్ట్‌ కాదు. ఈ లైఫ్‌ ఒక బహుమతి అని నాకు అర్థం అయ్యింది. ఆ రోజు నుంచి.. నేను జీవించడం ప్రారంభించాను. నేను ఎంతో అదృష్టవంతుడిని అనిపించింది. జీవితం చూపిన వేలుగులో నేను పయణించాను. బలహీనుల పట్ల ఇప్పుడు నాకు చాలా కరుణ, ప్రేమ, తాదాత్మ్యం ఉన్నాయి’ అన్నాడు. ఇక సినిమాల విషాయనికి వస్తే ప్రస్తుతం అమిత్ సాధ్ నటించిన వెబ్‌ సిరీస్‌ 'బ్రీత్: ఇంటు ది షాడోస్' ఘన విజయం సాధించింది. ఇక  అతను 'కై పో చే!' చిత్రంలో సుశాంత్‌ సింగ్‌తో కలిసి నటించాడు. దీంతో పాటు అతడు 'సుల్తాన్', 'గోల్డ్', 'శకుంతల దేవి' సినిమాల్లో నటించారు. అతని రాబోయే ప్రాజెక్ట్ 'జిడ్'.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement