Amit Sadh
-
సోనూసూద్ వల్లే నేడు ఈ స్థాయిలో..
లాక్డౌన్లో ఎంతోమంది వలస కార్మికులకు సేవలు అందించి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ విలన్ సోనూసూద్ తనకు కెరీర్లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడని దబాంగ్ నటుడు అమిత్ సాధ్ తెలిపాడు. సాయం చేసే గుణం సోనూసూద్‌లో ఇప్పుడే కాదని ఎప్పటి నుంచో ఉందని కొనియాడాడు. ఈ సందర్భంగా సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విటర్లో ట్వీట్ చేశారు. కాగా ‘నేం ఆపద్భాందవుడిని కాను’(IAmNoMessiah) అనే పేరుతో సోనూసూద్ ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఇది తన జీవిత కథ అని పేర్కొన్న ఈ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. సోనూసూద్ రాసిన పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో అమిత్ సాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: 4 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటుడు Not many know that my first break was given to me by Sonu bhai. It's because of him where I am today. This goodness that he is doing now that people are talking about is not something that is just activated. I think he has been doing this from many many years. https://t.co/B7vBz67T3J — Amit Sadh (@TheAmitSadh) December 27, 2020 ‘సినిమాల్లో నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సోనూసూదే. ఇది చాలా మందికి తెలియదు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సోనూ భాయ్ వల్లే. ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్న సోనూ సూద్ మంచితనం ఇప్పుడే ప్రారంభించినది కారు. అతను చాలా సంవత్సరాల నుంచే ఇలా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు మాకు తిరిగివ్వడానికి ఓ మార్గాన్ని బోధిస్తున్నారు. మీ పుస్తకానికి అభినందనలు’ అని ట్వీట్ చేస్తూ పుస్తకాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా అమిత్ సాధ్ ప్రశంసలకు సోనూసూద్ స్పందించారు. ప్రజలకు సహాయం చేసే అదృష్టం తనకు ఉందని సోను సూద్ అన్నారు. ‘భాయ్ మీరు పాలించటానికి పుట్టారు. మీరు మీ స్వంత విధిని రాశారు. మీ అద్భుతమైన ప్రయాణంలో నేను ఉండటం చాలా అదృష్టం. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను బ్రదర్. అని రిప్లై ఇచ్చారు. చదవండి: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్.. నటుడు అమిత్ సాధ్ కాగా టీనేజర్‌గా ఉన్నప్పుడు నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇటీవల అమిత్ సాధ్ వెల్లడించిన విషయం తెలిసిందే. 16-18 ఏళ్ల వయసులో నాలుగుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని, అలాంటి ఆలోచనలు లేకపోయినా.. ప్రాణం తీసుకోవాలనిపించిందన్నారు.. అలా కొన్నాళ్ల తర్వాత దేవుడి దయవల్ల ఆ ఆలోచనల నుంచి బయటపడ్డానని వెల్లడించారు. అనంతరం తను చేసే పనుల్లో, ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందని, అప్పటి నుంచి తనలో పట్టుదల పెరిగిందన్నారు. అలాంటి ఆలోచనల నుంచి బయట పడటం కేవలం ఒక్కరోజులో జరగిపోలేదని అమిత్ అన్నాడు. దాదాపు 20 ఏళ్లు పోరాడిన తర్వాత, జీవితం ఇంతటితో ఆగిపోకూడని తెలిసిందని చెప్పాడు. జీవితం విలువ తెలుసుకున్న తర్వాత ఆస్వాదించడం మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తు తనకంటూ ఓ గుర్తింపు లభించిందని, ఇప్పుడు అలాంటి బలహీనతతో బాధపడుతున్న వారిని చూస్తే జాలి కలుగుతుందని అమిత్ అన్నాడు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'బ్రీత్: ఇన్‌టూ ద షాడోస్' సిరీస్‌తో ఆకట్టుకున్నాడు అమిత్. -
4 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను: నటుడు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డిప్రెషన్, మానసిక అనారోగ్య సమస్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు నటీనటులు తమ జీవితంలో డిప్రెషన్‌కు గురైన సందర్భాలను, సూసైడ్ చేసుకోవాలని భావించిన సందర్భాల గురించి వెల్లడించారు. తాజాగా ‘కాయ్ పో చే’ నటుడు అమిత్ సాధ్ జాబితాలో చేరారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని తెలిపారు. అమిత్ మాట్లాడుతూ.. ‘16 నుంచి 18 ఏళ్ల వయసులో నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. ఆత్మహత్య ఆలోచనలు ఉండేవి కావు. కానీ సూసైడ్ చేసుకోవాలని భావించేవాడిని. ఇందుకు గాను ఓ ప్రాణాళిక అంటూ ఉండేది కాదు. ఏదో ఓ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడిని.. అలా చేస్తూ ఉండేవాడిని’ అన్నారు. అమిత్ మాట్లాడుతూ.. ‘నాలుగోసారి ఆత్మహత్యాయత్నం చేస్తున్నప్పుడు నా ఆలోచన విధానం మారింది. ఎందుకు చనిపోవడం.. గివ్ అప్ చేయడం ఎందుకు అనుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది’ అన్నారు. (చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) ‘అయితే ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. దాదాపు 20 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత జీవితాన్ని ఇలా ముగించడం కరెక్ట్ కాదు. ఈ లైఫ్ ఒక బహుమతి అని నాకు అర్థం అయ్యింది. ఆ రోజు నుంచి.. నేను జీవించడం ప్రారంభించాను. నేను ఎంతో అదృష్టవంతుడిని అనిపించింది. జీవితం చూపిన వేలుగులో నేను పయణించాను. బలహీనుల పట్ల ఇప్పుడు నాకు చాలా కరుణ, ప్రేమ, తాదాత్మ్యం ఉన్నాయి’ అన్నాడు. ఇక సినిమాల విషాయనికి వస్తే ప్రస్తుతం అమిత్ సాధ్ నటించిన వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇంటు ది షాడోస్' ఘన విజయం సాధించింది. ఇక అతను 'కై పో చే!' చిత్రంలో సుశాంత్ సింగ్‌తో కలిసి నటించాడు. దీంతో పాటు అతడు 'సుల్తాన్', 'గోల్డ్', 'శకుంతల దేవి' సినిమాల్లో నటించారు. అతని రాబోయే ప్రాజెక్ట్ 'జిడ్'. -
అభిషేక్.. గట్టి హగ్ ఇవ్వాలనుంది
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో పాటు ఆయన తండ్రి అమితాబ్ బచ్చన్, భార్య ఐశ్వర్యారాయ్, కూతురు ఆరాధ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరు త్వరగా కోలుకోవాలంటూ "బ్రీత్" నటుడు అమిత్ సాధ్ ఆకాంక్షించారు. ఈమేరకు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. "అన్నయ్య(అబిషేక్).. మిమ్మల్ని గురు, యువ, బంటీ, బబ్లీ.. ఇలా ఎన్నో సినిమాల నుంచి దగ్గరగా చూస్తున్నాను. ముందుగా నాకు సీనియర్‌గా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నన్ను మీతో సమానంగా చూశారు. మీరు ఎక్కువ, నేను తక్కువ అనే భావన నాకు రాకుండా చేశారు. మీరు లేకపోయుంటే బ్రీత్‌లో నా పాత్ర కబీర్ సావంత్ అసంపూర్తిగా మిగిలిపోయేది. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా బ్రీత్ విజయ వేడుకకు ఆరంభం, ముగింపు ఏదీ ఉండదు. నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండే మీతో కలిసి పనిచేసేందుకు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను". (రణ్‌బీర్ జిరాక్స్ ఇక లేరు) మీరు, మీ కుటుంబం ఎంతో త్వరగా కరోనాను జయించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎంచక్కా మిమ్మల్ని కలుసుకోవచ్చు, మీకు గట్టిగా ఒక హగ్ కూడా ఇవ్వొచ్చు. అలా ఐతే నన్ను 2 వారాలు క్వారంటైన్లో ఉండమంటారేమో? రెండు వారాలేంటి, నెల రోజులైనా ఉంటాను. అంత ప్రేమ నాకు మీమీద! మిమ్మల్ని చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటా" అని రాసుకొచ్చారు. కాగా అభిషేక్ బచ్చన్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ "బ్రీత్: ఇన్‌టూ ది షాడోస్". ఇందులో నటుడు అమీర్ సాధి కబీర్‌గా, అభిషేక్ అవినాష్‌గా నటించారు. (‘బిగ్‌బి, అభిషేక్‌లకు చికిత్స అవసరం లేదు’) -
బహిరంగ చుంబనం..!
అమిత్ సాద్, తాప్సీ.. ప్రస్తుతం ముంబయ్‌లో ఎక్కడ చూసినా ఈ జంటే. కలిసి ప్రేమికుల దినోత్సవం జరుపుకున్నారు. అది కూడా ముంబయ్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో. అక్కడి విద్యార్థులతో కలిసి ఈ ఇద్దరూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక, ఇటీవల ఈ ఇద్దరూ ఓ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం పూర్తవగానే అమిత్, తాప్సీ ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు కావల్సినన్ని పోజులిచ్చారు. కానీ, అడగని పోజు కూడా ఒకటిచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్న సమయంలో తాప్సీ బుగ్గ మీద అమిత్ ఓ ముద్దిచ్చుకున్నారు. ఇలాంటి సీన్లను కెమెరా కన్నులు అస్సలు మిస్ కావు. చకచకా తమ కెమెరాలకు పని చెప్పారు. పబ్లిక్‌లో ఇలా చేస్తావా? అని అమిత్ చెంప చెళ్లుమనిపించకుండా తాప్సీ హాయిగా నవ్వేసుకున్నారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ ఉందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ‘రన్నింగ్ షాదీ.కామ్’ అనే హిందీ చిత్రంలో ఇద్దరూ జంటగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాలేజీ స్టూడెంట్స్‌ని ప్రేమికుల దినోత్సవం నాడు కలిశారు. అలాగే, ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఇవాళా రేపూ ఓ సినిమాకి కావల్సినంత ప్రచారం రావాలంటే రకరకాల జిమ్మిక్కులు చేయాలి. అందుకే, అమిత్ ఈ బహిరంగ చుంబన కేళీకి రెడీ అయ్యుంటారేమో.