బహిరంగ చుంబనం..! | Taapsee Pannu Kissed By Amit Sadh In Public | Sakshi
Sakshi News home page

బహిరంగ చుంబనం..!

Published Wed, Feb 26 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

బహిరంగ చుంబనం..!

బహిరంగ చుంబనం..!

అమిత్ సాద్, తాప్సీ.. ప్రస్తుతం ముంబయ్‌లో ఎక్కడ చూసినా ఈ జంటే. కలిసి ప్రేమికుల దినోత్సవం జరుపుకున్నారు. అది కూడా ముంబయ్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో. అక్కడి విద్యార్థులతో కలిసి ఈ ఇద్దరూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక, ఇటీవల ఈ ఇద్దరూ ఓ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం పూర్తవగానే అమిత్, తాప్సీ ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు కావల్సినన్ని పోజులిచ్చారు. కానీ, అడగని పోజు కూడా ఒకటిచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్న సమయంలో తాప్సీ బుగ్గ మీద అమిత్ ఓ ముద్దిచ్చుకున్నారు. ఇలాంటి సీన్లను కెమెరా కన్నులు అస్సలు మిస్ కావు. చకచకా తమ కెమెరాలకు పని చెప్పారు.
 
  పబ్లిక్‌లో ఇలా చేస్తావా? అని అమిత్ చెంప చెళ్లుమనిపించకుండా తాప్సీ హాయిగా నవ్వేసుకున్నారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ ఉందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ‘రన్నింగ్ షాదీ.కామ్’ అనే హిందీ చిత్రంలో ఇద్దరూ జంటగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాలేజీ స్టూడెంట్స్‌ని ప్రేమికుల దినోత్సవం నాడు కలిశారు. అలాగే, ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఇవాళా రేపూ ఓ సినిమాకి కావల్సినంత ప్రచారం రావాలంటే రకరకాల జిమ్మిక్కులు చేయాలి. అందుకే, అమిత్ ఈ బహిరంగ చుంబన కేళీకి రెడీ అయ్యుంటారేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement