తాప్సీ తళ తళ! | Taapsee on LFW ramp | Sakshi
Sakshi News home page

తాప్సీ తళ తళ!

Published Sun, Aug 24 2014 8:41 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

చీర కట్టులో తాప్సీ - Sakshi

చీర కట్టులో తాప్సీ

 ముంబాయి లాక్మే ఫ్యాషన్‌ వీక్(ఎల్ఎఫ్ డబ్ల్యూ) షోలో హైదరాబాద్‌ డిజైనర్లు ఇరగదీశారు. ఎప్పుడూ మోడరన్ దుస్తులతో ఇరగదీసే తాప్సీ ఎకంగా చీర కట్టి అందాలు చిందించి చూపరుల మతిపోగొట్టింది. ఆధుని దుస్తులలోనే కాదు చీరలో కూడా తాప్సీ చాలా అందంగా ఉంది.  ఎర్ర అంచు పసుపు పచ్చ చీర, మొఖాన ఆకుపచ్చ రంగులో పెద్ద  బొట్టు పెట్టి ర్యాంప్‌ మీద నడుస్తుంటే చూడవలసిందే. చీరకట్టి సింగారించి చింపి తలకు చిక్కూ తీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటీ చిన్నదానిలా తయారైంది.

ఈ  ఫ్యాషన్‌ షో మూడో రోజు గౌరంగ్‌, నాలుగో రోజు  అనుశ్రీ రెడ్డి డిజైన్‌ చేసిన దుస్తులకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా మూడో రోజు గౌరంగ్‌ డిజైన్‌ చేసిన చిత్రసేన్‌ కలెక్షన్‌ను డేజ్లింగ్‌ హీరోయిన్‌ తాప్సీ ధరించి ర్యాంప్‌ మీద నడిసి అదరగొట్టింది. చీర కట్టుతో  తళ తళలాడుతున్న తాప్సీని మోడరన్ దుస్తులలో ఉన్న ఆడపిల్లలు తమ సెల్ఫోన్తో ఫొటోలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement