ముంబై: ఇటీవలే జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం తాజాగా అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను కూడా ప్రకటించింది. 2021కి గాను 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను శనివారం ముంబైలో ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్‌ఖాన్ ( ఆంగ్రేజీ మీడియం)ను ఎంపిక చేశారు. అంతే కాకుండా ఇర్ఫాన్ ఖాన్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు. కాగా గత ఏడాది ఏప్రిల్ 29 న ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే.
తాప్సీ నటించిన థప్పడ్ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. తాప్సీ పణ్ణును ఉత్తమ నటిగా ప్రకటించారు. ఈ 'థప్పడ్' చిత్రం మొత్తం ఏడు అవార్డులను గెలుచుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరో వైపు అయుష్మాన్ ఖురానా, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన 'గులాబో సితాబో' చిత్రం ఆరు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ డైరెక్టర్ గా ఓం రావత్ నిలిచారు. ఆయన డైరెక్ట్ చేసిన హిస్టారికల్ మూవీ 'తానాజీ: ది అన్సంగ్ వారియర్' బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
2021 ఫిల్మ్ ఫేర్ అవార్డు విజేతలు:
ఉత్తమ చిత్రం- థప్పడ్
ఉత్తమ దర్శకుడు- ఓం రావత్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ చిత్రం(క్రిటిక్స్ ఛాయిస్)-ప్రతీక్ వాట్స్ (ఈబ్ అల్లే ఓహ్!)
ఉత్తమ నటుడు-ఇర్ఫాన్ ఖాన్ (ఆంగ్రేజీ మీడియం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్)-అమితాబ్ బచ్చన్ (గులాబో సితాబో)
ఉత్తమ నటి-తాప్సీ పన్నూ (థప్పడ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్)-తిలోత్తమా షోమ్ ( సర్)
ఉత్తమ సహాయ నటుడు-సైఫ్ అలీ ఖాన్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ సహాయ నటి- ఫరోఖ్ జాఫర్(గులాబో సితాబో)
ఉత్తమ కథ- అనుభవ్ సిన్హా , మృన్మయి లగూ వైకుల్ (థప్పడ్)
ఉత్తమ స్క్రీన్ ప్లే-రోహేనా గెరా (సర్)
ఉత్తమ సంభాషణ-జుహి చతుర్వేది (గులాబో సితాబో)
ఉత్తమ తొలి దర్శకుడు-రాజేష్ కృష్ణన్ (లూట్‌కేస్)
ఉత్తమ సంగీతం-ప్రీతమ్(లూడో)
ఉత్తమ సాహిత్యం-గుల్జార్ (చప్పక్)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- ఇర్ఫాన్ ఖాన్
బెస్ట్ యాక్షన్-రంజాన్ బులుట్, ఆర్పి యాదవ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ నేపథ్య స్కోరు-మంగేష్ ఉర్మిలా ధక్డే (థప్పడ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ-అవిక్ ముఖోపాధ్యాయ్ (గులాబో సితాబో)
ఉత్తమ కొరియోగ్రఫీ-ఫరా ఖాన్ (దిల్ బెచారా)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్-వీర కపూర్ ఈ (గులాబో సితాబో)
ఉత్తమ ఎడిటింగ్-యషా పుష్ప రామ్‌చందాని (థప్పడ్)
Comments
Please login to add a commentAdd a comment