హీరోయిన్కూ తప్పని ఈవ్ టీజింగ్ | Taapsee Pannu shares the lesson she learnt on being eve-teased recently | Sakshi
Sakshi News home page

హీరోయిన్కూ తప్పని ఈవ్ టీజింగ్

Published Fri, Sep 16 2016 6:07 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

హీరోయిన్కూ తప్పని ఈవ్ టీజింగ్ - Sakshi

హీరోయిన్కూ తప్పని ఈవ్ టీజింగ్

అందరు అమ్మాయిల మాదిరిగానే హీరోయిన్ తాప్సీ కూడా కాలేజీ రోజుల్లో ఈవ్ టీజింగ్కు గురైందట. అయితే ఇది సాధారణమైన విషయమే అంటుంది. కానీ ఇటీవల ముంబైలో తను ఫేస్ చేసిన ఓ సంఘటన మాత్రం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంటోంది.

ముంబైలో ఓ సాయంత్రం వేళ తన ఫ్రెండ్ని కలిసేందుకు బయలుదేరింది తాప్సీ.  ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తుండగా.. తనకు దగ్గరగా వచ్చి మరీ ఇద్దరు కుర్రాళ్లు నోటి దురుసును ప్రదర్శించారట. బైక్ని తాప్సీకి దగ్గరగా పోనిచ్చి ఆమెపై కామెంట్స్ చేసి వెకిలిగా నవ్వడం ప్రారంభించారు. గమనించిన తాప్సీ ఏమాత్రం తొణకకుండా వారినే సీరియస్గా చూడటం ప్రారంభించింది.

కొన్ని సెకన్ల అనంతరం ఆ యువకుల ముఖాల్లో భయం మొదలవ్వడం స్పష్టంగా కనిపించిందని చెప్తుంది తాప్సీ. 'అప్పుడే తొలిసారి నాకర్థమయింది.. వాళ్ల కామెంట్లకి మనం సీరియస్గా స్పందించడం మొదలుపెడితే.. మగవాళ్లు మనతో సమానంగా భయపడతారని' అంటూ ఇటీవల తనకెదురైన సంఘటనను వివరించింది 'పింక్' స్టార్ తాప్సీ.

లైంగిక వేధింపుల బాధితురాలిగా తాప్సి నటించిన 'పింక్' చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.  తాప్సీ ఈ సినిమాలో తాను చేసిన పాత్ర.. ప్రస్తుత సమాజంలో లైంగిక దాడులకు బలైపోయిన చాలామంది యువతుల మానసిక సంఘర్షణను చూపిస్తుందని చెబుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం తప్పకుండా తనకు సక్సెస్ తెచ్చిపెడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement