University of Hyderabad
-
కీమోథెరపీ ఇక సేఫ్
సాక్షి, హైదరాబాద్: కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడం..వ్యాధికణాలకు మాత్రమే మందు అందించేలా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. కేన్సర్ సోకిందంటే మరణం తప్పదనేది ఒకప్పటిమాట. కానీ ఇప్పుడు జీవితాన్ని మరింతగా పొడిగించేందుకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో కీమోథెరపీ కూడా ఒకటి. అయితే ప్రత్యేక రసాయనాలతో అందించే ఈ చికిత్సలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర కణాలు కూడా నాశనమయ్యేవి. రోగనిరోధక శక్తి తగ్గి వెంట్రుకలు రాలిపోవడం, ఒళ్లంతా దద్దుర్లు, నోట్లో పుండ్లు లాంటి దుష్ప్రభావాలు అనేకం ఉండేవి. ఒకవేళ వీటన్నింటిని తట్టుకున్నా, కీమో రసాయనాల నుంచి తప్పించుకున్న కొన్ని కణాలతో మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడంతోపాటు, ఇచ్చే మందు నేరుగా కేన్సర్ కణాలకు మాత్రమే చేరేలా చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. నానో కణాలు తయారు చేసి..పేటెంట్ పొంది.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగపు అధ్యాపకుడు కొండపి ఆనంద్ తన పరిశోధనల ద్వారా నానో కణాలను తయారు చేశారు. అంతేకాకుండా తయారీ పద్ధతిని కూడా ఆవిష్కరించారు. పేటెంట్ హక్కులు కూడా పొందారు. ప్రస్తుతం ఇలా... కేన్సర్ చికిత్సలో భాగంగా కీమో రసాయనా లతో పాటు కణాలకు అవసరమైన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను కలిపి అందిస్తున్నారు. కానీ దీంతో ఫలితాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ సేంద్రియ పదార్థాలకు ఏది కేన్సర్ కణమో, ఏది సాధారణమైందో తెలియదు. అందువల్ల ప్రభావం తక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించేందుకు మాత్రమే ఈ సేంద్రియ పదార్థాలు ఉపయోగపడతాయి. రెండూ కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే... కీమో రసాయనాలు, సేంద్రియ పదార్థాలు రెండింటినీ కలిపి కేన్సర్ కణాలకు మోసుకెళ్లగలిగితే చాలా లాభాలుంటాయని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ గుర్తించారు. ఈ పని సాధించే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. కేన్సర్ కణాలకు చక్కెరలన్నా, ఇనుము అన్నా చాలా ఇష్టమని చాలాకాలంగా తెలుసు. ఈ కారణంగానే ఏమో కేన్సర్ కణాల్లో ఈ రెండు పదార్థాలను ఒడిసిపట్టుకోగల రిసెప్టర్లు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ విషయాలను అనుకూలంగా మార్చుకొని కేన్సర్‌పై పట్టు సాధించేందుకు కొండపి ఆనంద్ నేతృత్వంలో డాక్టర్ సొనాలి ఖన్రా, డాక్టర్ ఎస్ఎల్.బాలకృష్ణ, డాక్టర్ జగదీశ్ సేనాపతి, డాక్టర్ చుఖూ ముజ్, డాక్టర్ నేహాతోమర్, అంతం సోనీలతో కూడిన శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. పాలలోఉండే లాక్టోఫెర్రిన్, రక్తంలోని ప్రొటీన్లతో వీరి పరిశోధనలు సాగాయి. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటి సేంద్రియ పదార్థాలను, కీమో రసాయనాన్ని నానోస్థాయి అపోట్రాన్స్‌ఫెరిన్ ప్రొటీన్‌లోకి చేర్చడంలో విజయం సాధించారు. నోటితోనూ వేసుకోవచ్చు... కీమోథెరపీకి నరాల్లోకి ఎక్కించే పద్ధతి ఒక్కటే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన లాక్టోఫెర్రిన్, అపోట్రాన్స్ఫెరిన్లతో తయారైన నానోస్థాయి కణాలను మాత్రం నేరుగా నోటిద్వారా కూడా అందించవచ్చని ప్రొఫెసర్ కొండపి ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ పద్ధతిలో వాడిన ప్రొటీన్లన్నీ సహజసిద్ధమైనవి కాబట్టి ఆరోగ్యకరమైన కణాలకు హాని జరగదని చెప్పారు. ఈ నానోస్థాయి కణాలు కేన్సర్ కణాల్లోని రిసెప్టర్లకు అతుక్కుపోవడం వల్ల అపోట్రాన్స్‌ఫెరిన్ విడిపోయి అందులోని కీమో రసాయనం బయటపడుతుందని, కేన్సర్ కణాన్ని నాశనం చేస్తుందని వివరించారు. సాధారణ కణాల్లో అపోట్రాన్స్‌ఫెరిన్, లాక్టోఫెర్రిన్లు ఉంటాయి కాబట్టి ప్రమాదమేమీ ఉండదన్నారు. ఈ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి 2017లో తాము భారతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ నెల 20వ తేదీన లభించిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని ముందుకొస్తే అతితక్కువ దుష్ప్రభావాలు ఉండే కీమోథెరపీకి నాంది పలకవచ్చని చెప్పారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ జన్యుచికిత్సలకూ ఉపయోగపడుతుందన్నారు. -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
హెచ్‌సీయూ అప్పీల్‌పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తమకు చట్టబద్ధమైన భూకేటాయింపులు లేవంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్లను ఆదేశించింది. తమకు కేటాయించిన భూమిలోని 18.30 ఎకరాల్లో నిర్మిస్తున్న రహదారిని నిలిపివేయాలంటూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టేస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ భూమిపై వర్సిటీకి హక్కులు లేవని, హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. -
మౌనిక ఆత్మహత్య కేసు: ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఎంటెక్ నానోసైన్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్.మౌనిక(27) గత నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏంటనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. హాస్టల్లోని ఆమె గదిలోంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపిన పోలీసులకు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె సెల్‌ఫోన్ నుంచి బట్టబయలైన పర్సనల్ చాటింగ్‌తో పాటు పలువురు సన్నిహిత స్నేహితులను విచారించిన పోలీసులు.. మౌనిక ఆత్మహత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో మృతురాలి తల్లిదండ్రులతో నిర్ధారించుకున్న తర్వాత.. పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. చదవండి: మ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..! -
HCU: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీగా బీజే రావు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్‌గా డాక్టర్ బసూత్కర్ జగదీశ్వర్ రావు నియమితులయ్యారు. ఆయన్ను వీసీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజే రావు ప్రస్తుతం తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు పలు ఉన్నత పదవులు చేపట్టిన బసూత్కర్ జగదీశ్వర్ రావు.. అమెరికాలోని యేల్ స్కూల్ నుంచి బయోలాజికల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరేట్ పట్టా పొందారు. ఈయన ఐదేళ్లపాటు హెచ్‌సీయూ వీసీగా కొనసాగనున్నారు. ఇక మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వీసీగా సయ్యద్ ఐనుల్ హుస్సేన్ నియమితులయ్యారు. డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్‌గా ప్రొఫెసర్ హుస్సేన్ పనిచేస్తున్నారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణకు అవకాశం దక్కింది. -
University of Hyderabad: పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ..యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఉన్నత ప్రమాణాలతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయం. అనేక విభాగాల్లో విద్య, పరిశోధనలు కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా.. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. హెచ్‌సీయూ అందిస్తున్న కోర్సుల వివరాలు.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ, హెల్త్ సైకాలజీ స్పెషలైజేషన్స్‌తో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది. అలాగే ఆరేళ్ల వ్యవధితో మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రి కోర్సును సైతం ఈ యూనివర్సిటీ అందిస్తోంది. అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్: హిందీ, తెలుగు, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ. సోషల్ సైన్సెస్: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు అందుబాటులో ఉంది. అర్హత: ఏదైనా గ్రూపులో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. పరీక్ష విధానం ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఎమ్మెస్సీ హెల్త్ సైకాలజీ కోర్సు ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్ స్థాయి సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉండే ప్రశ్నపత్రంలో అభ్యర్థి ఎంచుకున్న లాంగ్వేజ్‌పై 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 35 ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌పై 25 ప్రశ్నలు అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సోషల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. పీజీ స్థాయి కోర్సులు మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎమ్మెస్సీ) మ్యాథ్స్/అప్లయిడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలను ఆర్సీబీ ఫరీదాబాద్ నిర్వహించే గాట్–బి ద్వారా ఖరారు చేస్తారు. ఎంసీఏ: నిమ్‌సెట్–2021 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ: హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్,ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. క్యాట్ ర్యాంకు ఆధారంగా ఎంబీఏలో ప్రవేశాలను ఖరారు చేస్తారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ) ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, కమ్యూనికేషన్(మీడియా ప్రాక్టీస్) తదితరాలు. ఎంఈడీ, ఎంపీఏ(డ్యాన్స్), ఎంపీఏ(థియేటర్ ఆర్ట్స్), ఎంపీఏ మ్యూజిక్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్పచర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్). ఎంపిక విధానం: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బయోఇన్ఫర్మాటిక్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి గేట్ స్కోర్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్:ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌లో జేఈఈ సీఎస్ఏబీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్డీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేచర్, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, ఫోక్ కల్చర్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ సైన్సెస్, ఫిజియాలజీ, మెటీరియల్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్డీ: బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20,2021 వెబ్సైట్: https://uohyd.ac.in -
హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
రాయదుర్గం (హైదరాబాద్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు/సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్డీ కోర్సుల్లో మొత్తం 2,328 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్), ఎంపీఏ(మ్యూజిక్), పబ్లిషింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే ఎంసీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో నిమ్‌సెట్, గేట్, జేఈఈ, క్యాట్, జీఏటీ–బీ తదితర పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్) కోర్సులో గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. చదవండి: తెలంగాణ పోలీస్ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు -
తెలంగాణ పోలీస్ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు
తెలంగాణ ప్రభుత్వ పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్.. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వరంగల్: పోస్టుల సంఖ్య 01 ► పోస్టు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ► అర్హత: ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. ► వయసు: 35–55ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.22,000 చెల్లిస్తారు. వికారాబాద్: పోస్టుల సంఖ్య 02 ► పోస్టులు: సపోర్ట్ పర్సన్, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్. ► అర్హత: ఎంఏ సైకాలజీ/ఎంఎస్‌డబ్ల్యూ, టాలీతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: సపోర్ట్ పర్సన్ 22–35ఏళ్ల మధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ 20–35ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం సపోర్ట్ పర్సన్–నెలకి రూ.18,000, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్–నెలకు రూ.15,000 చెల్లిస్తారు. సూర్యాపేట్: పోస్టుల సంఖ్య 06 ► పోస్టులు: సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్. ► అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ(నర్సింగ్), ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం, ఎంఎస్/ఎంఎస్‌డబ్ల్యూ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంగారెడ్డి: పోస్టుల సంఖ్య 01 ► పోస్టులు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్. ► అర్హత: ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35–55 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.22,000 చెల్లిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021 ► వెబ్సైట్: https://womensafetywing.telangana.gov.in/ యూఓహెచ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు హైదరాబాద్(గచ్చిబౌలి)లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 04 ► పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ మేనేజర్లు–03, ఆఫీస్ అటెండెంట్–01. ► ప్రోగ్రామ్ మేనేజర్లు: అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ విభాగాల్లో పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ఆఫీస్ అటెండెంట్: అర్హత: సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతోపాటు ఆఫీస్ అటెండెంట్‌గా పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్, ఐఓఈ డైరెక్టరేట్, డా.జాకీర్ హుస్సేన్ యూపీఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సీఆర్‌రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్–500046 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021 ► వెబ్సైట్: https://uohyd.ac.in -
హైదరాబాద్ వర్సిటీకి అరుదైన గౌరవం
సాక్షి హైదరాబాద్, రాయదుర్గం: ప్రసవ సమయంలో ఆచితూచి సిజేరియన్ ఆపరేషన్లు (సీ సెక్షన్) చేసే అంశంపై ప్రతిష్టాత్మక బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ రీసెర్చి గ్రాంట్ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్ ఫౌండేషన్‌ను భాగస్వాములుగా గుర్తించారు. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ (యూసీలాన్) ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొ. సూ డౌనీ ఈ రెండు సంస్థలను ఎంపికచేశారు. గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా బ్రెజిల్, కెనడాలలో రీ–జెడ్జ్ అనే వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వోతో కలిసి హైదరాబాద్ వర్సిటీ పనిచేస్తోంది. ‘రెడ్యూసింగ్ రేట్స్ ఆఫ్ నాన్–మెడికల్లీ ఇండికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్ త్రూ ఓపెన్ యాక్సెస్ మల్టీ ఎవిడెన్స్ అండ్ బిహేవియర్ చేంజ్ ప్రోగ్రాం ఫర్ లాయర్స్ అండ్ జడ్జెస్’ వంటి అంశాలపై ఈ ప్రాజెక్ట్ దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ఐదు ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్ట్ కాగా, వాటిలో 120 దరఖాస్తులకు 80 వేల డాలర్ల విలువైన బిల్, మెలిండా గేట్స్ రీసెర్చి గ్రాంట్ అవార్డు లభించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానంగా యూసీ లాన్, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండేజ్ ఫౌండేషన్ అమలు చేయనున్నాయి. దీనికి సంబంధించిన మల్టీ మీడియా ప్రోగ్రామ్స్ పూర్తయ్యాక వాటిని భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లోని జడ్జీలు, లాయర్లకు అందజేస్తారు. వీటిని ఏ మేరకు ఉపయోగించవచ్చు, సిజేరియన్ ఆపరేషన్ల కారణంగా ఉత్పన్నమయ్యే కేసుల్లో తలెత్తే న్యాయపరమైన అంశాలు, వాటిపై తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి ఈ జడ్జీలు, న్యాయవాదులు పరిశీలిస్తారు. హైదరాబాద్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్æ పరిశోధకుల సేవలను వీసీ ప్రొఫెసర్ పి.అప్పారావు ప్రశంసిస్తూ, ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్యానికి ఎంపిక కావడం ద్వారా తమ వర్సిటీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా తన ప్రతిష్టను నిలుపుకుంటుందన్నారు. తమ పరిశోధక బృందాన్ని హైదరాబాద్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ ప్రొ.పి.ప్రకాశ్‌బాబు అభినందించారు. ప్రతిష్టాత్మక ఈ రీసెర్చి గ్రాంట్ కోసం యూఓహెచ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున దరఖాస్తుదారుగా ఉన్న ఫ్యాకల్టీ డా.బీఆర్ శమన్న ఈ అధ్యయనం పట్ల తాము ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై తమ పరిశోధనలు ప్రభావం చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
యూఓహెచ్ ఘనత.. మరింత చౌకగా ఫావిపిరవిర్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్)లోని ఆస్పైర్ టీబీఐలో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ ఆప్టస్ థెరప్యూటిక్స్ కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న మందు ఫావిపిరవిర్‌ను మరింత చౌకగా ఉత్పత్తి చేసేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. కృత్రిమ రసాయన శాస్త్రం, కెమో ఎంజమాటిక్ రసాయన శాస్త్రాలపై పరిశోధనలు చేసే ఆప్టస్ థెరప్యూటిక్స్ ఫావిపిరవిర్తోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగించే ఓ మందును కూడా మరింత సమర్థంగా, చౌకగా, పర్యావరణ అనుకూల మార్గాల్లో ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ పద్ధతి ద్వారా ఫావిపిరవిర్‌ను కావాల్సినంత మోతాదులో సులువుగా తయారు చేసుకొనే అవకాశం ఏర్పడటం గమనార్హం. ఈ పద్ధతిలో తక్కువ రసాయనాలను వాడటం, కావాల్సిన అణువులను సులువుగా వేరు చేసే అవకాశం ఉండటం దీనికి కారణం. (33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్) హైదరాబాద్‌లోని ఫ్లెమింగ్ లేబొరేటరీస్ సహకారంతో వాణిజ్యస్థాయి ఉత్పత్తిపై కూడా ప్రయోగాలు పూర్తి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఫావిపిరవిర్‌ను భారీగా సరఫరా చేసేందుకు ఫ్లెమింగ్ లేబొరేటరీస్ ఇప్పటికే ఓ రష్యా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ఆప్టస్ లేబొరేటరీస్ సాధించిన ఘనతను కొనియాడారు. వర్సిటీకి ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్టస్ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ కోటిరెడ్డి, ఫ్లెమింగ్ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ప్లేట్లెట్లు తగ్గేది ఇందుకే..
సాక్షి, హైదరాబాద్: డెంగీ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోయేందుకు కారణమేమిటో గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ విభాగం శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు. వ్యాధికారక వైరస్‌లోని ప్రొటీన్ ఒకటి కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును ప్రభావితం చేస్తుండటం వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోతున్నట్లు తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని డాక్టర్ ఎం. వెంకట రమణ, డాక్టర్ ఎస్. నరేశ్‌బాబులు తెలిపారు. సుమారు 140 దేశాల్లో ప్రభావం చూపగల డెంగీకి ఇప్పటివరకూ సరైన టీకా లేదా మందు లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము డెంగీ కారక వైరస్‌పై పరిశోధనలు చేపట్టామని తెలిపారు. డెంగీ వైరస్‌లో మొత్తం పది వరకూ ప్రొటీన్లు ఉంటే ఇందులోని ఎన్ఎస్–3 ప్రొటీన్ నకళ్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఎన్ఎస్–3 ప్రొటీన్ కణానికి శక్తిని అందించే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్‌లోకి ప్రవేశించి జీఆర్పీఈఎల్1 అనే ప్రొటీన్‌ను ముక్కలు చేస్తోందని, ఇది కాస్తా మైటోకాండ్రియా పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని వారు వివరించారు. ఈ కారణంగానే రక్తంలోని ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయన్నది తమ అంచనాగా వారు చెప్పారు. జీఆర్పీఈఎల్1 ప్రొటీన్ ఆధారంగా డెంగీకి సమర్థమైన మందులు తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు. మానవ, జంతు సంబంధిత వైరస్ మైటోకాండ్రియాలోని ప్రొటీన్లతో చర్య జరుపుతున్నట్లు తెలియడం ఇదే మొదటిసారి అని, కరోనా కారక వైరస్‌లోనూ ఇదేమాదిరిగా జరుగుతుండవచ్చని తెలిపారు. పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ వైరాలజీ సంచికలో ప్రచురితమయ్యాయి. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: రాజధానిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను నిలిపివేయించి, ఆరుగురు విద్యార్థులను పోలీసులు పట్టుకెళ్లడం పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. క్యాంపస్‌లోకి పోలీసులు రావడం, ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం పట్ల ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన ‘రామ్ కే నామ్’డాక్యుమెంటరీ చిత్రాన్ని సోషల్ సైన్సెస్ భవనంలోని న్యూ సెమినార్ హాల్లో ప్రదర్శించాలని ఏఐఎస్ఏ నాయకులు నిర్ణయించారు. అయితే ఆ హాల్‌ను చిత్ర ప్రదర్శనకు ఇవ్వడం కుదరదని డీన్ స్పష్టం చేశారు. దీంతో సోషియాలజీ భవనంలోని సెకండ్ ఫ్లోర్‌లోని ఎంఏ ఫస్ట్ ఇయర్ లెక్చర్ హాల్లో ప్రదర్శించేందుకు అనుమతి పొందారు. ఆ తర్వాత చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు సోషల్ సైన్సెస్ భవనానికి చేరుకుని ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ల్యాప్‌టాప్, స్క్రీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని బాబాజాన్, సోనాల్, నిఖిల్, వికాస్‌తోపాటు మరో ఇద్దరు విద్యార్థి నేతలను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. దీంతో ఆ వాహనాన్ని అడ్డుకోవడానికి విద్యార్థులు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులంతా నినాదాలు చేసుకుంటూ హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని, చీటికీమాటికీ పోలీసులు క్యాంపస్‌లోకి రావడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులను వదిలిపెట్టాలని, చిత్ర ప్రదర్శనకు అనుమతించాలని, పోలీసులు క్యాంపస్‌లోకి రాకూడదని ఏఐఎస్ఏ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు విడుదల చేయడంతో ఏఐఎస్ఏ నాయకులు ఆందోళన విరమించారు. -
ఆ ఐఐటీ దేశంలోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ కల్పనల్లో ఐఐటీ-బాంబే యూనివర్సిటీ మెరుగ్గా ఉందని క్వాక్వారెల్లి సిమండ్స్ (క్యూఎస్) ర్యాకింగ్స్ సంస్థ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గాను దేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే అధిక పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచిందని తెలిపింది. ఇక ఐఐఎస్సీ బెంగుళూరు సైన్స్ విభాగంలో టాప్‌లో నిలవగా... ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశమిచ్చే సంస్థల ప్రతిష్ట ఆధారంగా సర్వే నిర్వహించినట్టు క్యూఎస్ ర్యాకింగ్స్ తెలిపింది. టాప్‌టెన్ యూనివర్సిటీలకు క్యూఎస్ సర్వే ర్యాంకులు ప్రకటించింది. మూడు, నాలుగు స్థానాల్లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ ఉండగా.. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏడో స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ రూర్కే తొమ్మిదో స్థానంలో, ఐఐటీ గువాహటి పదో స్థానాల్లో ఉన్నాయి. -
వెలివాడలో దీక్ష విరమించండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల పట్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రతరమవుతోంది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్ నరేష్ గెలుపుని ఖరారు చేయకుండా యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రారంభించిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. నరేష్‌కు హాజరు తక్కువగా ఉందన్న సాకుతో గెలుపుని ప్రకటించకపోవడంపై కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలివాడలో దీక్షా శిబిరాన్ని ఎత్తివేయాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని కొందరు విద్యార్థులకు యాజమాన్యం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో విద్యార్థి సంఘాలు బుధవారం రాత్రి సమావేశమయ్యాయి. నరేష్‌ని వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని, నిరాహార దీక్షల్లో అన్ని విద్యార్థి సంఘాలు భాగస్వా ములు కావాలని సమావేశంలో నిర్ణయిం చారు. అరెస్టులకైనా సిద్ధమేనని, యాజ మాన్యం బెదిరింపులకు లొంగేది లేదని దీక్షలో పాల్గొన్న విద్యార్థులు స్పష్టం చేశారు. ఒకదానికొకటి సంబంధం లేకుండా డిపార్ట్‌మెంట్లే 3 రకాలైన రిపోర్టు లిచ్చి ఫలితాలను తారుమారు చేయాలని చూస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకు లు ఆరోపించారు. 3వ రోజు దీక్షలో లునావత్ నరేష్‌తో పాటు విద్యార్థులు సుందర్ రాథోడ్, వెంకటేశ్‌చౌహాన్, మున్నా సన్నంకి, అమ్ము జోసెఫ్, సురేష్ రాథోడ్ పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి కృషి.. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ దెబాషి ఆచార్య దీక్షా శిబిరాన్ని సందర్శించి విద్యార్థులు దీక్షను విరమించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి జరుగుతోందని, అయితే కొంత ఆలస్యమవుతుందని, కనుక దీక్షను విరమించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అయితే నరేష్‌ని వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకటించేంత వరకు దీక్షను విరమించేది లేదని విద్యార్థులు ఆయనకు స్పష్టంచేశారు. షోకాజ్ నోటీసులు అప్రజాస్వామికం వెలివాడలో దీక్షా శిబిరాన్ని తొలగించాల ని విద్యార్థులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు అప్రజాస్వామికం. భావప్రక టనా స్వేచ్ఛకు, నిరసన హక్కుకు ఇది వ్యతిరేకం. వివక్షకి ముగింపు పలికే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. – వెంకటేశ్ చౌహాన్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేత ఆమరణ దీక్షకైనా సిద్ధం.. ప్రస్తుతం నిరవధిక దీక్షను కొనసాగిస్తు న్నాం. బుధవారం రాత్రి జరిగిన ఆల్ స్టూడెంట్ యూనియన్స్ సమావేశం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. అన్ని విద్యార్థి సంఘాలు దశలవారీగా దీక్షలో పాల్గొంటాయి. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నాం. – సుందర్ రాథోడ్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు -
హెచ్‌సీయూలో మళ్లీ వివక్ష
-
హెచ్‌సీయూలో మళ్లీ వివక్ష
సాక్షి, హైదరాబాద్: జనవరి 17, 2016.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చరిత్రలో ఓ బ్లాక్‌డే. విశ్వవిద్యాలయాల్లో వివక్ష తీవ్రతను పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మరణం ఎలుగెత్తి చాటిన రోజది. రోహిత్ ఆత్మహత్యకు దాదాపు రెండేళ్లు నిండ బోతున్నాయి. ఇప్పుడు మరోమారు వివక్షకు నిరసనగా హెచ్‌సీయూలో వెలివాడ వెలిసింది. అణచివేతను ధిక్కరిస్తూ అగ్గిరాజుకుంది. 75 శాతం హాజరు లేదన్న కారణంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్ నరేశ్ గెలుపుని ప్రకటించకపోవడం యూనివర్సిటీలో ఆందోళనలకు దారితీ సింది. హాజరుపట్టీలో ప్రజెంట్‌ని ఆబ్సెంట్గా తారుమారు చేసి నరేశ్ గెలుపుని ఓడించాలన్న ఆత్రుతలో వర్సిటీ తప్పులపై తప్పులు చేస్తూ పోయింది. వీసీ అప్పారావు ఏబీవీపీతో కుమ్మౖక్కై వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన నరేశ్‌ని అడ్డుకోవడానికి గ్రీవెన్స్ సెల్‌ని పావుగా వాడుకున్నారని ఆరోపిస్తూ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది. రెండు రోజులుగా నిరాహార దీక్ష.. నిజానికి విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపడా.. అంటే 75 శాతం హాజరుతోనే లునావత్ నరేష్ పోటీకి అర్హత సాధించారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఏబీవీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుని, తారుమారు చేసిన హాజరుపట్టీని చూపించి నరేష్ ఎన్నిక చెల్లదని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం ప్రకటించడంతో విద్యార్థులు తిరగబడ్డారు. ఎన్నికలు జరిగిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్లో ప్రెజెంట్‌ని ఆబ్సెంట్గా> మార్చారని, 75 శాతం హాజరున్నదంటూ డిపార్ట్మెంట్ స్వయంగా ముద్రవేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ని బుట్టదాఖలు చేసి గ్రీవెన్స్ సెల్, వీసీ అప్పారావు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. హాజరుపట్టీని తారుమారు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలతో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజులుగా వెలివాడలో నిరాహార దీక్షకు ఉపక్రమించింది. వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఆల్ స్టూడెంట్ యూనియన్స్‌తో సమావేశమై గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సిద్ధమవుతోంది. గిరిజనుడిని కనుకనే వివక్ష.. మొత్తం ప్యానల్లో నేనొక్కడినే గిరిజనుడిని. అందుకే ఈ వివక్ష. అటెండెన్స్ రిజిస్టర్లో నేను ప్రెజెంట్ అయిన చోట ఆబ్సెంట్ అని దిద్దారు. కొన్ని చోట్ల డేట్స్ లేకుండా అటెండెన్స్ వేశారు. యాజమాన్యం నా పట్ల కక్షపూరితంగా వ్యవహరించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ముందు 75 శాతం హాజరు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత 64 శాతం ఉందని ఒకసారి, 71 శాతం ఉందని మరోసారి రిపోర్ట్ ఇచ్చింది. దీన్నిబట్టే నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. యాజమాన్యానికి అనుకూలంగా ఉంటే ఎన్నేళ్లైనా డీన్‌గా ఉండొచ్చు. నిజానికి ప్రతి నాలుగేళ్లకీ డీన్స్ మారతారు. మెడికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘకాలంగా గీతా వేముగంటి డీన్‌గా కొనసాగుతున్నారు. రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల రస్టికేషన్కి సూత్రధారి గీతా వేముగంటి. ఇప్పుడు నా విషయంలో తప్పుడు రిపోర్టు ఇచ్చింది కూడా ఆమే. – వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లునావత్ నరేష్ కుట్రపూరితంగా అటెండెన్స్‌లో గోల్మాల్ ఏబీవీపీని కాపాడాలనే కుట్రలో భాగమే ఇదంతా. వీసీ అప్పారావు, గ్రీవెన్స్ సెల్ కుమ్మక్కై ఆడుతున్న నాటకం ఇదీ. రీఎలక్షన్స్‌కి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మేం అనేక ఆందోళనలు చేశాం. కానీ యాజమాన్యంలో స్పందన లేదు. వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు హాజరు శాతాన్ని నిర్థారించేందుకు కమిటీ వేస్తున్నామన్నారు. ఏబీవీపీతో కుమ్మక్కై అటెండెన్స్‌లో గోల్మాల్ చేసి సమస్యను తాత్సారం చేస్తున్నారు. అందుకే నిరవధిక నిరాహార దీక్షను చేపట్టబోతున్నాం. -సుందర్ రాథోడ్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆరోపణలు నిజం చేసేందుకు కుట్ర.. లునావత్ నరేష్ ఏబీవీపీ అభ్యర్థి అపూర్వ్‌పై గెలిచాడు. అయితే అతని ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేసింది ఏబీవీపీ అధ్యక్షుడు. ఏ ఆధారంలేని ఆరోపణలను నిజం చేసేందుకు వీసీతో కలసి గ్రీవెన్స్ సెల్ కుట్ర పన్నింది. జూలై 16న క్లాసులు మొదలైతే.. ఆగస్టు 8 నుంచి అటెండెన్స్ రిజిస్టర్ ప్రారంభించారు. అంతకుముందు హాజరైనా పరిగణనలోనికి తీసుకోలేదు.– ప్రశాంత్, సామాజిక న్యాయ ఐక్యపోరాట కమిటీ నాయకుడు -
పరిశోధనల్లో భారత వర్సిటీలు దారుణం
న్యూఢిల్లీ: దేశంలోని 39 సెంట్రల్ వర్సిటీల పరిశోధనా ఫలితాలన్నీ కలిపినా.. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ (బ్రిటన్), స్టాన్‌ఫర్డ్(అమెరికా) వర్సిటీల కంటే తక్కువగా ఉన్నట్లు ఓ సర్వే తెలిపింది. మౌలిక వసతుల కొరత, నిధుల లేమి, అనవసర నిబంధనలు, అధ్యాపక ఖాళీలు.. తదితర కారణాల వల్ల భారత యూనివర్సిటీల్లో పరిశోధన కుంటుపడ్డట్లు పేర్కొంది. ఢిల్లీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలు పరిశోధనల్లో దేశీయంగా అగ్రభాగాన నిలిచినట్లు సర్వేలో పాల్గొన్న వివేక్‌కుమార్ సింగ్ తెలిపారు. చిన్న వర్సిటీల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, హేమవతి నందన్ సెంట్రల్ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఘర్వాల్ పరిశోధనల్లో ముందున్నట్లు పేర్కొన్నారు. -
విద్యార్థి మృతికి యూనివర్సిటీ సంతాపం
ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి నెల్లి ప్రవీణ్ కుమార్ మృతిపట్ల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంతాపం తెలిపింది. యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగం శనివారం ఉదయం ఒక సంతాప సభ నిర్వహించింది. జరిగిన విషయాలను యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ప్రవీణ్ రూమ్మేట్ పెయింటింగ్ స్టూడియో నుంచి తిరిగి గదికి వచ్చాడని, అయితే అప్పటికి గది లోపలి నుంచి గడియ పెట్టి ఉందని తెలిపారు. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకపోవడంతో హాస్టల్లో ఉన్న ఇతర మిత్రులను లేపి విషయం చెప్పగా అంతా కలిసి బలంగా తలుపును తోసి చూసేసరికి.. సీలింగ్‌కు ప్రవీణ్ వేలాడుతున్నాడన్నారు. వెంటనే యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు అతడిని తరలించామని, ప్రాథమిక పరీక్షల అనంతరం సిటిజన్ ఆస్పత్రికి పంపామని తెలిపారు. అయితే అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రవీణ్ మరణించినట్లు చెప్పారన్నారు. అనంతరం ప్రవీణ్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, యూనివర్సిటీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు అతడి కుటుంబ సభ్యులతోను, సన్నిహిత మిత్రులతోను టచ్‌లో ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపారు. -
'అసలు నేనేంటి? ఎందుకిలా చేస్తున్నాను?'
హైదరాబాద్: 'నేనెందుకు సరిగా చదవలేకపోతున్నాను? నేను ఎందుకు ఇతరులతో కలవలేకపోతున్నాను?' ఈ వ్యాఖ్యలు శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఎన్ ప్రవీణ్ కుమార్ తన నోట్ బుక్ లో రాసుకున్నవి. ఎంఎఫ్ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శనివారం తెల్లవారు జామున ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు. అతడు ఆత్మహత్య పాల్పడటానికి గలకారణాలేమీ తెలియరాలేదు. అయితే, అతడి ఉంటున్న గదిలో ఓ ల్యాప్ ట్యాప్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని నోట్ బుక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని ఓ నోట్‌బుక్ లో మాత్రం సెప్టెంబర్ 9నాటి తేదితో ఓ లేఖ మాత్రం దొరికింది. అందులో ప్రవీణ్ స్వయంగా ఇలా రాసుకున్నాడు. 'నాకెందుకు ఇంత భయం వేస్తోంది? నా మీద నాకే కోపం వేస్తోంది. నేను అందరితో ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? నేను ఒంటరివాడిననే భావన ఎందుకు వస్తుంది? నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఈ రోజు ఉదయం మా డిపార్ట్మెంట్కు వెళ్లినప్పుడు ఓ విద్యార్థి వచ్చి నన్ను పలకరించాడు. కానీ నేను అతడితో సరిగా మాట్లాడలేకపోయాను.. నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఇంకా బాగా చదవాలి. అందుకోసం ఇంకా ఏదో చేయాలి. లేదంటే నా జీవితానికి అర్థం లేదు. నేను ఎందుకసలు సంతోషంగా ఉండలేకపోతున్నాను. నాకు నేనుగా ఒంటరిగా ఎందుకు భావిస్తున్నాను' అంటూ అందులో పేర్కొన్నాడు. కాగా, ప్రవీణ్ ఆత్మహత్యకు సంబంధించి డీసీపీ కార్తీకేయ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 'నాకెందుకు ఇంత సోమరితనం, భయం' అంటూ ప్రవీణ్ లో నోట్లో రాసి పెట్టుకున్నాడని ఆ కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ప్రవీణ్ కుమార్ ది మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. అతడి తండ్రి ఓ బీఎస్ఎన్ఎల్ అధికారి. -
సెంట్రల్ వర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరవకముందే సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శనివారం తెల్లవారుజామున ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యపై సహచర విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. యూనివర్సిటీ వీసీ పి. అప్పారావు హుటాహుటిన ఎల్ బ్లాక్‌కు చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంతా తెలియలేదని వీసీ అప్పారావు తెలిపారు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడని చెప్పారు. ప్రవీణ్ స్వస్థలం మహబుబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ అని ఆయన పేర్కొన్నారు. ప్రవీణ్ అత్మహత్యపై యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రవీణ్ గదిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎటువంటి లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్.. పవర్ఫుల్!
- పునర్విభజనలో శక్తివంతమైన జిల్లాగా ఏర్పాటు - ఔటర్ రింగు రోడ్ ఆలంబనగా అభివృద్ధి - పారిశ్రామిక, ఐటీ,ఎయిరోస్పేస్ రంగాలకు కేంద్రం - విద్య, పర్యాటక, క్రీడా సౌకర్యాలకు నిలయం సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఆవిర్భవిస్తున్న శంషాబాద్.. రాష్ట్రంలోనే సంపన్నమైన జిల్లాగా రూపొందనుంది. ఇన్నాళ్లూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో నూతన అభివృద్ధి కేంద్రాల్లో ఒకటిగా ఉన్న శంషాబాద్.. ఇకపై ఆర్థికంగా కీలకంగా మారబోతోంది. ముసాయిదాలో పేర్కొన్న ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా శంషాబాద్ జిల్లాలో అంతర్భాగంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాలన్నీ రియల్ఎస్టేట్, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక, విద్య, పర్యాటక రంగాల్లో ఇప్పటికే ప్రాధాన్యత పొంది ఉండడం గమనార్హం. ముచ్చర్ల ఫార్మాసిటీ, ఎయిరోస్పేస్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఐటీ పార్కులు, ప్రముఖ విద్యా సంస్థలు వంటివి ఈ జిల్లాలోకే వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకలాంటి రంగాలన్నీ ఈ జిల్లా పరిధిలో ఉండటం దీని ప్రత్యేకత. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయంతో తెరపైకి వచ్చిన శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డు, బెంగళూరు, విజయవాడ, శ్రీశైలం రహదారులు ఆలంబనగా ఉన్నాయి. విజయవాడ జాతీయ రహదారి 65 నుంచి బెంగళూరు జాతీయ రహదారి 44 మీదుగా నూతన జిల్లా విస్తరించి ఉండటం ప్రధాన అనుకూలాంశం. పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు నూతన జిల్లా పరిధిలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రంగా.. కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కందుకూరు మండలంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫార్మా రంగానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఎకరాల విస్తీర్ణంలో ముచ్చర్ల ఫార్మాసిటీని ప్రతిపాదించింది. ప్రస్తుతం భూసేకరణ జరుగుతుండగా.. ఫార్మాసిటీని శ్రీశైలం ప్రధాన రహదారితో అనుసంధానం చేయనున్నారు. ఇక మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉండగా.. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఎయిరోస్పేస్ కంపెనీలు హెలికాప్టర్లు మొదలుకుని ఉపగ్రహాలకు అవసరమయ్యే పరికరాల దాకా తయారు చేస్తున్నాయి. ఈ సెజ్‌లో భూకేటాయింపులు పూర్తికావడంతో వెలిమినేడులో రెండో దశ ఎయిరోస్పేస్ పార్కు విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్ విస్తరణ ప్రణాళికలు చేపట్టగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎన్జీ) రీజినల్ సెంటర్, రాష్ట్ర యాంటీ టైస్టు వింగ్ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇక ఈ జిల్లా పరిధిలో ఉండనున్న కొత్తూరు, షాద్‌నగర్‌లు ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమేజాన్, జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గాంబుల్ వంటి ప్రముఖ కంపెనీలు కొత్తూరు మండలంలో ఏర్పాటయ్యాయి. విద్య, పర్యాటక కేంద్రంగానూ... నూతనంగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లా విద్య, పర్యాటక, క్రీడా రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషించనుంది. గచ్చిబౌలి క్రీడా మైదానం, హైదరాబాద్ యూనివర్సిటీ (శేరిలింగంపల్లి), సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (కొత్తూరు)తో పాటు పలు ఇంజనీరింగ్ కాలేజీలు... ఆసియాలోనే రెండో అతిపెద్ద ఉస్మానియా అబ్జర్వేటరీ (రంగాపూర్, మంచాల మండలం), పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు ఈ జిల్లాలోకి రానున్నాయి. జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో శంషాబాద్ పరిసరాల్లో 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగుల ఎత్తున్న రామానుజాచార్య విగ్రహం ఏర్పాటవుతోంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ (కొందుర్గు).. కొత్త జిల్లా సాగు, తాగునీటికి కీలకంగా మారనుంది. వంద అంతస్తుల రిలయన్స్ టవర్స్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గృహ నిర్మాణ ప్రాజెక్టులు శంషాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. -
రికార్డు సృష్టించిన హెచ్‌సీయూ విద్యార్థిని
హైదరాబాద్: ఓ పక్క రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూవోహెచ్) వివాదాలకు వేదికగా మారి చర్చనీయాంశంకాగా.. అదే వర్సిటీ, అందులోని విద్యార్థులు విద్యాపరంగా రికార్డులను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల సరసన చేరిన ఈ వర్సిటీ అంతే స్థాయిలో ఉత్తమ విద్యార్థులను కూడా అందించగలదని నిరూపించింది. అవును.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీ ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థి సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నంబర్ 1 ర్యాంకును సాధించి రికార్డు సృష్టించింది. స్కూల్ ఆఫ్ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిక్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిగా అడుగుపెట్టి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్న ఆమె 200 మార్కులకుగాను 158 మార్కులు సాధించింది. వచ్చే జూలై నెలలో ఆమె టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో పీహెచ్డీ ప్రవేశం పొందనుంది. ముందునుంచే పుస్తకాలంటే ఎంతో మక్కువ చూపే ప్రసూన ప్రతి అకాడమిక్ ఇయర్లో రాణించేందుకు తోటి విద్యార్థులతో మమేకమవుతూ ప్రణాళిక బద్దంగా చదివినట్లు తెలిపింది. తన డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, వర్సిటీ అందించిన సహకారం ఎంతో గొప్పదని కొనియాడింది. వర్సిటీలో బోధన, పరిశోధన ఎంతో ఉత్తమంగా ఉంటుందని అభిప్రాయపడింది. పరిశోధన రంగంవైపు వెళ్లేందుకే తాను ఈ వర్సిటీని, ఈ కోర్సును ఎంచుకున్నట్లు వివరించింది. -
హెచ్‌సీయూలో తెరుచుకున్న మెస్‌లు
మూడో రోజూ వర్సిటీలో కొనసాగిన ఆంక్షలు మంచినీరు, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ 76వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం వాయిదా హైదరాబాద్: వరుస ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం కూడా పోలీసు ఆంక్షలు కొన సాగాయి. సిబ్బంది, విద్యార్థులు మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. అయితే ప్రొఫెసర్లు, విద్యార్థి, ప్రజా సంఘాల ఒత్తిడికి తలొగ్గిన యాజమాన్యం మెస్‌లు సహా మంచి నీరు, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. వర్సిటీలో మొత్తం 22 హాస్టళ్లు ఉండగా వీటిలో 4 వేల మంది వసతి పొందుతున్నారు. వీరి కోసం పది మెస్లున్నాయి. మెస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విద్యార్థులు దాడి చేయడం తో బుధవారం ఆయా మెస్‌లను బంద్ చేసి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, చీఫ్ వార్డెన్ నాగరాజు, ప్రొఫెసర్లు మీనాహరిహరన్, పద్మజ విజ్ఞప్తి మేరకు గురువారం మెస్‌లను పున రుద్ధరించారు. రెండు రోజులుగా ఇబ్బందులు పడ్డ విద్యార్థులు మెస్‌లు తెరుచుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు వర్సిటీలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గురువారం జరగాల్సిన 76వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేశారు. ఆందోళన విరమించి విధుల్లోకి.. కొందరు విద్యార్థుల దాడితో సహాయ నిరాకరణ చేస్తున్న బోధనేతర ఉద్యోగులను గురువారం వీసీ చర్చలకు ఆహ్వానించారు. బోధనేతర ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు ఆర్.గంగరాజు, నిరంజన్‌రెడ్డి, తుకారాం, శంకరయ్య, పూల్‌సింగ్, రఘురామ్ తదితరులు వీసీతో చర్చలు జరిపారు. తమపై దాడి చేసిన వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ దాడులకు పాల్పడమని లిఖితపూర్వక హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమకు తగు రక్షణ కల్పించాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని వీసీ సూచించడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. వీసీ దిష్టిబొమ్మ దహనం కాగా, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీ షాపింగ్ కాంప్లెక్స్‌లో వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జుహైల్ మాట్లాడుతూ.. రోహిత్ మృతి ఘటనలో వీసీ ప్రథమ ముద్దాయి అని ఆరోపించారు. వర్సిటీ గేట్లకే కాక విద్యార్థుల గళాలకూ తాళం వేయాలని వీసీ చూస్తున్నారని, అరెస్టు చేసి జైలుకు పంపిన వారిని విడుదల చేయించాలని డిమాం డ్ చేశారు. మరోవైపు వంటావార్పు కార్యక్రమ సమయంలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీహెచ్డీ విద్యార్థి ఉదయ్భానును.. రోహిత్ వేముల తల్లి రాధిక పరామర్శించారు. -
క్షణ క్షణం
హైదరాబాద్ యూనివర్సిటీ వీసీగా అప్పారావు బాధ్యతలు చేపట్టడం అత్యంత గోప్యంగా, ప్రణాళికాబద్ధంగా సాగిపోయింది. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి ఏమాత్రం అనుమానం రాకుండా తంతు కానిచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఆందోళనకు దిగితే... కట్టడి చేసేందుకు వీలుగా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే... ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి స్టేడి యానికి వీసీ అప్పారావు చేరుకున్నారు. 8.05 గంటలకు లైఫ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ గోపాల్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ రాజశేఖర్‌తో పాటు కొందరు ప్రొఫెసర్లు అక్కడే అప్పారావును కలుసుకున్నారు. 8.15 గంటలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సమాచారం. 8.30: అనుకున్నట్లుగానే వర్సిటీకి తన కుటుంబసభ్యులతో చేరుకున్న అప్పారావు వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వీసీ లాడ్జీ దగ్గర సమావేశం కావడానికి 150 కుర్చీలు, టెంట్ వే యడానికి ఏర్పాట్లు చేశారు. 9 గంటలకు అప్పారావు వర్సిటీలోని వీసీ లాడ్జీకి చేరుకునేలా సిబ్బందికి రాజగోపాల్ సూచించారు. 9.15: 9.30 గంటలకల్లా వీసీ లాడ్జీ వద్దకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ అలోక్ పాండే తదితరులు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయానికి లైఫ్‌సెన్సైస్ విద్యార్థులు అక్కడికి చేరుకుని వీసీకి శుభాకాంక్షలు తెలిపారు. 10.00: వీసీ వచ్చిన విషయుం తెలుసుకున్న విద్యార్థులు వీసీలాడ్జ్ వద్దకు చేరుకున్నారు. లోనికి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. 10.45: పోలీసులు రంగప్రవేశం..విద్యార్థులను చెదరగొట్టారు. 11.15 : వీసీ లాడ్జ్ వుుందు విద్యార్థులు ధర్నా..వీసీ ఉన్న గదిలోకి వెళ్లేందుకు యుత్నం..అడ్డుకున్న పోలీసులు12.00 : వీసీకి వుద్దతుగా నాన్‌టీచింగ్ సిబ్బంది ఆందోళన.. వారిని అడ్డుకున్న విద్యార్థులు.. సా 5.30 : వీసీ చాంబర్ వెనుక విద్యార్థులు ఆందోళన.. స్పెషల్ బెటాలియున్ పోలీసులు రాక.. విద్యార్థులపై లాఠీచార్జి..పరిస్థితి ఉద్రిక్తం రాత్రి 8.00: యుూనివర్శిటీ గేట్ల వుూసివేత..వర్శిటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు -
10 మంది ప్రొఫెసర్ల రాజీనామా
-
హెచ్‌సీయూ చాన్సలర్‌గా రంగరాజన్
ప్రముఖ ఆర్థికవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డాక్టర్ సీ రంగరాజన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్) చాన్సలర్‌గా నియమితులయ్యారు. విజటర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. హెచ్‌సీయూ 11వ చాన్సలర్‌గా రంగరాజన్ పేరును ఖరారుచేసి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో రిజర్వు బ్యాంకు గవర్నర్, పార్లమెంటు సభ్యుడుగానూ పనిచేసిన రంగరాజన్ తమిళనాడుకు చెందినవారు. తిరుచిరాపల్లి నేషనల్ కాలేజీలో చదువుకున్న ఆయన లయోలా కాలేజ్ (మద్రాస్ యూనివర్సిటీ) నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం చాలా ఏళ్లపాటు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాతోపాటు ఐఐఎం- అహ్మదాబాద్‌లో పాఠాలు చెప్పారు. మైక్రో ఎకనామిక్స్‌పై ఆయన రాసిన పుస్తకాలే.. ప్రస్తుతం పలు బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూళ్లు పాఠ్యాంశాలయ్యాయి. ఆర్థిక శాస్త్రంలో రంగరాజన్ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వాలు అనేక ఉన్నత పదవులు ఆయనకు కట్టబెట్టాయి. ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలికి చైర్మన్‌గా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు అధ్యక్షుడిగా, సీఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. 1992 నుంచి 1997 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా.. 1997 నుంచి నుంచి 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. అదే సమయంలో ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2002 సంవత్సరంలో భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషన్'తో ఆయనను సత్కరించింది. -
తెలుగువారి పెన్నిధి
వర్ణన రత్నాకరము- ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనం (నాలుగు భాగాలు) సంకలన కర్త: దాసరి లక్ష్మణస్వామి ఒక్కొక్క సంకలం వెల: రూ.200 ఎమెస్కో ప్రచురణ ప్రతులకు: 040-23264028 వ్యాఖ్యాతలు: బేతవోలు రామబ్రహ్మం (98481 69769) అద్దంకి శ్రీనివాస్ (98488 81838 ) ఇటీవల కొన్ని మంచి పనులు ఒక దాని వెంట ఒకటి జరుగుతున్నాయి- తెలుగు భాషకు సంబంధించి. తెలుగు భాషకు విశిష్ట ప్రతిపత్తిని కేంద్రం ప్రకటించిన దరిమిలా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ప్రాచీన తెలుగు- అధ్యయనం’ కేంద్రం ఈ మంచి పనులను తలకెత్తుకుంది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సమన్వయకర్తగా ఏర్పడిన ఈ అధ్యయన కేంద్రం స్వీకరించిన కీలకమైన పనులలో మొదటిది- ‘వర్ణన రత్నాకరము’ను వెలుగులోకి తేవడం. ఏమిటి ఈ ‘వర్ణన రత్నాకరము’? ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే మనకు దాసరి లక్ష్మణస్వామిగారు (పిఠాపురం) తెలియాలి. మహానుభావులు, కవి పండితులు అయిన లక్ష్మణస్వామిగారు నేటికి 90 ఏళ్ల క్రితం అంటే 1930లో ఒక గొప్ప పని చేశారు. భావితరాలలో తెలుగుభాష ధారణ శక్తినీ, జ్ఞాపకశక్తినీ, పద స్వరూప శక్తినీ, ఉచ్చారణపుష్టినీ, శబ్ద సౌందర్యతుష్టినీ పునర్నవం కలిగించడానికి 15వ శతాబ్దం నుంచి 20 శతాబ్దం వరకూ ఉన్న అసంఖ్యాక కవి పండితుల ఆణిముత్యాల వంటి పద్యాలను సేకరించి వాటిని ‘వర్ణన రత్నాకరము’గా ఏర్చి కూర్చారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 8000 అపురూపమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఆ రోజులలో ఒక ముద్రణకు నోచుకొని ఆ తర్వాత మరుగున పడిపోయిన ఈ అమూల్య రత్నాకరమును ఇప్పుడు పదుల సంఖ్యలో భాషావేత్తలు, పరిశోధకులు కలిసి- పరిష్కరించి- ఆ పద్యాలకు అన్వయం, వ్యాఖ్య వివరించి పండితుల కోసం కాకుండా పాఠకుల కోసం సరళ సులభశైలిలో విభజన చేసి 250 పద్యాలు ఒక సంపుటం వంతున మొత్తం 26 సంపుటాలను క్రమానుగతంగా వెలువరించే బృహత్కృషిలో ఉన్నారు. ఇప్పటికి నాలుగు సంపుటాలు పూర్తయ్యాయి. వీటిని ఎమెస్కో సంస్థ ప్రచురించడానికి ముందుకు రావడమే కాదు తక్కువ వెలకు ఇవ్వడానికి కూడా కట్టుబడటం మంచి విషయం. ఈ సంపుటాలలో నన్నెచోడుని మాటల్లో వివరించాలంటే ‘రస రసాయన సుధారసం’ ప్రతి పద్యంలోనూ చిప్పిల్లుతూ ఉంటుంది. ఒక వర్గమా? ప్రకృతిలోని సకల విషయాలు, మానవ ప్రకృతిలోని రకరకాల ఎగుడుదిగుళ్లు, ఉచ్ఛనీచాలు, యావత్తు ప్రాణికోటికి చెందిన నిత్యవ్యాపకాలు, జీవన సమరంలో శృంగారం, సౌందర్యం, అనురాగబంధాలు, సామాజిక బాధ్యతలు, వాటి ఉల్లంఘనలు, వాటి పర్యవసానంగా ఉప్పటిల్లే పరిణామాలు, స్త్రీ-పురుష సంబంధాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికీ తెలుసుకుని మెళకువలతో మెలగడానకీ ఈ రత్నాకరం తోడ్పడుతుంది. స్త్రీలు విద్యావంతులు కాకపోతే వారికే కాదు యావత్తు సమాజానికే ఎన్ని నష్టాలు వాటిల్లుతాయో బోధించే ‘భాస్కర రామాయణం’ పద్యాలు, 19వ శతాబ్ది నాటి ‘నయనోల్లాస’ కావ్య పద్యాలు కనిపిస్తాయి. స్త్రీలు విద్య ద్వారా ‘జ్యోతిష్మతు’లు కావాలని కాళిదాసులా కోరుకునే కవులూ కనిపిస్తారు. మనది ‘మూర్త’ (విగ్రహం లేదా బొమ్మ) సంప్రదాయం కాదు, ‘అమూర్త’ సంప్రదాయమని తెలివిడి చేసి, జ్ఞాన రూపమే జగత్తు అనీ, జ్ఞానం నిజం,భౌతిక ప్రపంచం వాస్తవం అనీ హేతవాదాన్ని చాటిన పద్య శకలాలూ మిమ్మల్ని పలకరిస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు రకాల శత్రువులూ స్త్రీ పురుషులిద్దరినీ వేధించే అంతఃశత్రువులేనని అభేద భావాన్ని ప్రకటించిన సూక్తులనూ వర్ణన రత్నాకరం అందిస్తోంది. పద్య సంకలనాలు ఇంతకు ముందు చాలానే ఉండవచ్చు. వేటూరి ప్రభాకర శాస్త్రి ‘చాటుపద్య మణిమంజరి’ (రెండు భాగాలు); మానవల్లివారు తొలి పరిష్కర్తగా. నిడదవోలు వారు మలి పరిష్కర్తగా వెలువరించిన పూర్వకవి సంచితం ‘ప్రబంధ మణిభూషణం’ ఉన్నాయి. వీటన్నింటి కన్నా ప్రయోగ వైచిత్రితో విస్తృతిలో సకల కావ్యాలలోని ప్రయోజనకర వస్తు నిర్దేశంతో వెలువడింది- దాసరి వారి ‘వర్ణన రత్నాకరము’. ఆట్టే చూస్తే మనం దక్కించుకున్న సారస్వత సంపద కన్నా అసూయల కారణంగానో అహంకారాల వల్లనో కోల్పోయిన సంపదే ఎక్కవేమో. పదకవితా పితామహుడు అన్నమాచార్యుడి కీర్తనలు ఇంకా ఇరవై వేలు పండితుల వెతుకులాటలోనూ శోధనా నాళికల్లోనూ ఉండిపోయాయి. ప్రభాకరశాస్త్రి గురజాడను చూసి పెట్టమన్న ప్రాచీన ‘పట్టుభట్టు’ కవి రచన ‘ప్రసంత రత్నావళి’ ఉనికే మసకబారిపోయింది. అలాగే తంజావూరు నాయకరాజుల కాలంలో విదుషీమణీ, కవయిత్రీ అయిన కళావతి రచన ‘ప్రబంధ శిరోమణి’ గతీ అంతే అయిందని పండితుల ఫిర్యాదు. వీటిలో దేనికీ, ఒక్క అన్నమయ్య పద సాహిత్యానికి తప్ప సంపుటాల పరంపర భాగ్యం దక్కలేదు. ఆ భాగ్యం యిప్పుడు పద్యకావ్యాల ఉపయుక్త భాగాల రచనగా దాసరివారి ‘వర్ణన రత్నాకరం’ 26 సంపుటాలుగా వెలువడే గౌరవం దక్కుతోంది. చిలకమర్తివారన్నట్టు ‘వర్ణన రత్నాకరం ఎవరి దగ్గర ఉంటుందో తెలుగు సాహిత్యం మొత్తం వారి దగ్గర ఉన్నట్టే’. - ఎ.బి.కె.ప్రసాద్ 9848318414 -
షాయరీ షహర్
గుల్జార్.. అక్షరానికి ఆత్మబంధువు! కవిత్వం ఆయన కలానికి క్లోజ్‌ఫ్రెండ్! మధ్యలో మనసు కొన్నాళ్లు సినిమాలెన్స్ను పెట్టుకున్నా రచనావ్యాసంగం దారిమళ్లలేదు!. రొమాంటిక్ కవితలను రాసి యువతను ఆకట్టుకున్నా చిన్నపిల్లలనెప్పుడూ చిన్నబుచ్చలేదు!. మోగ్లీతో మురిపించారు! ఇప్పటికీ వాళ్లకు ఆత్మీయ రచయితే! ఉర్దూ యూనివర్సిటీకి అతిథిగా.. హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందుకోవడానికి నగరానికి వచ్చిన గుల్జార్ చెప్పిన సంగతులు కొన్ని.... హైదరాబాద్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ఉర్దూ నేర్చుకుంటున్నప్పటిది. ఎన్నిసార్లు వచ్చానో ఈ నగరానికి. ఇది కులీ కుతుబ్‌షాహీల నగరమైనా నేను మాత్రం కవిత్వానికి చిరునామాగా చూస్తాను. నా దృష్టిలో హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని పెంచేది ఇక్కడి ఉర్దూ భాషే! ఆ ప్రేమతో ఎన్నో సార్లు ఈ ఊరికొచ్చాను. చిన్నపిల్లల సాహిత్యమంటే ఉన్న అభిమానంతో చిల్డ్రన్ ఫెస్టివల్ కోసమూ కొంత పనిచేశాను. జయాబచ్చన్ హయాంలో చిన్న పిల్లల సినిమా పండగకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. అది హైదరాబాద్ అయితే బాగుంటుందని ఈ ఊరునే ఖాయం చేశాం. అలా కిందటేడు ఈ సినిమా పండుగకు హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరుతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. నడిపించే శక్తి.. ప్రతి కళాకారుడికి, రచయితకు ముఖ్యంగా నాలాంటి వాడికి ప్రశంసల అవసరం ఉంటుంది. ఎందుకంటే మేంవెళ్తున్న దారి సరైనదేననే మా నమ్మకాన్ని మరింత బలపర్చడానికి. ఈ తరానికి నా దరఖాస్తు ఒక్కటే.. మీరు కొత్త కొమ్మలు. కొత్త ఆలోచనల సరికొత్త చిగుర్లు. మాలాంటి వాళ్ల చేయిపట్టుకొని నడిపించే శక్తిమంతులు. అందుకే మా వేలు పట్టుకుని నడిపించండని కోరుతుంటాను. కానీ ఈ తరాన్ని చూస్తే కలవరమూ కలుగుతోంది. ఈ తరానికి ఓపిక తక్కువైంది. పఠనాసక్తి పోయింది. సినిమాల మీదున్న మోజు చదవడం మీద చూపించట్లేదు. నేను తీసిన సినిమాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే టక్కున చెప్తారు కానీ నేను రాసిన పుస్తకాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే... జవాబు ఉండదు. సాహిత్యానికి దూరమైన ఈ తరాన్ని చూస్తుంటే జాలేస్తోంది. మంచి సినిమా వినోదాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పఠనం విజ్ఞానాన్నిస్తుంది. విజ్ఞతను పెంచుతుంది. జీవించే తోవను చూపిస్తుంది. మూసిన అలమార తలుపుల వెనకున్న పుస్తకాలు నెలలకు నెలలుగా నిరీక్షిస్తున్నాయి.. మీ సాంగత్యం కోసం. ఇది వరకు సాయంకాలాలు పుస్తకాల పుటలమీదుగా జారిపోయేవి కానీ ఇప్పుడు మీ కనురెప్పలు కంప్యూటర్ వీక్షణతో బరువెక్కిపోతున్నాయి. అందుకే యువతరానికి నా విన్నపం.. పుస్తకాలు బాగా చదవండి ! ..:: సరస్వతి రమ -
శిక్షణ, పరిశోధనలకు కేరాఫ్ హెచ్‌సీయూ
ఇన్స్టిట్యూట్ వాచ్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్).. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీ యూ)గా విద్యార్థి లోకంలో సుపరిచితమైన పేరు. ఈ విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 1974లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటై.. బోధన, శిక్షణ, పరిశోధనల్లో ఎప్పటికప్పుడు నవ్యతను ప్రదర్శిస్తూ.. ఇటు స్వదేశీ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులనూ ఆకర్షిస్తోంది. ఉన్నత విద్యలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన హెచ్‌సీయూపై ఇన్స్టిట్యూట్ వాచ్.. శ్రీఒక విద్యా సంస్థ పనితీరును తెలుసుకోవాలంటే అందులో పట్టభద్రులైన విద్యార్థులు, సదరు విద్యా సంస్థ అకడమిక్ ప్రతిభే ప్రామాణికం్ణ.. సాధారణంగా ఏదైనా వర్సిటీ/కాలేజీ గురించి విద్యావేత్తల అభిప్రాయమిది! ఈ కోణంలో పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందంజలో ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు! ప్రవేశాల నుంచి పరిశోధనల వరకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల నుంచి పరిశోధనల వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. మొత్తం 47 విభాగాల ద్వారా 59 యూజీ/పీజీ కోర్సులను, 27 ఎంటెక్/ఎంఫిల్ కోర్సులను, 47 పీహెచ్డీ స్పెషలైజేషన్లను అందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 5000 మందికిపైగా విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. ట్రాన్స్లేషన్ స్టడీస్ నుంచి టెక్నికల్ రీసెర్చ్ వరకు వినూత్న కోర్సులను అందిస్తున్న ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని విభాగాల్లో క్రెడిట్ ఆధారిత అభ్యసన వ్యవస్థ(సీబీఎల్‌ఎస్) ను అమలు చేస్తుండటం విశేషం. ప్రత్యేక గుర్తింపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రముఖ సంస్థలు ఇస్తున్న ర్యాంకుల ఆధారంగా దానికున్న గుర్తింపును అంచనా వేయొచ్చు. అవుట్ లుక్, కెరీర్స్ 360, ఇండియా టుడే తదితర మేగజైన్లు నిర్వహిస్తున్న ‘ఉత్తమ విశ్వవిద్యాలయాల’ సర్వేలో హెచ్‌సీయూ టాప్-10, టాప్-20 పరిధిలో స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకుల కేటాయింపులో ప్రసిద్ధిగాంచిన క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ర్యాంకింగ్స్ జాబితాలోనూ చోటు సంపాదించింది. 2010లో క్యూఎస్ టాప్-200 ఆసియా విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది. నిత్య నూతనంగా శిక్షణ శిక్షణ పరంగా హెచ్‌సీయూ నిత్య నూతనంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమ వర్గాలను ఎప్పటికప్పుడు సంప్రదించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల పాఠ్యప్రణాళికలో మార్పులుచేర్పులు చేపడుతోంది. కొత్త కోర్సుల రూపకల్పనలోనూ తనదైన ముద్రను చాటుకుంటోంది. ఈ క్రమంలో విశ్వవిద్యాలయం గత దశాబ్ద కాలంలో 30కి పైగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. అధ్యాపకుల బోధనా శైలి, కోర్సు స్వరూపం-దాన్ని అందిస్తున్న విధానం తదితర అంశాల్లో విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని, లోటుపాట్లను సరిదిద్దుకుంటోంది. బోధనలో నాణ్యతను పెంచేందుకు పీహెచ్డీ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో ముందుంటోంది. 404 మంది అధ్యాపకుల్లో 379 మంది పీహెచ్డీ ఫ్యాకల్టీ కావడం ఇందుకు నిదర్శనం. విదేశీ విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలు, పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేందుకు పెద్దపీట వేస్తోంది. బోధనా సిబ్బందిలో నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అకడమిక్ స్టాఫ్ కాలేజీని ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాల ను సాధించగలుగుతున్నారు. సీఎస్ఐఆర్-నెట్, స్లెట్ వంటి పరీక్షల్లో వర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధిస్తున్నారు. పరిశోధనలకు ప్రాధాన్యం: కేవలం అకడమిక్ కోర్సుల తరగతి బోధనకే పరిమితం కాకుండా పరిశోధనలకూ ప్రాధాన్యమిస్తోంది. డీఎస్టీ, సీఎస్ఐఆర్, డీఆర్డీఓ తదితర సంస్థల కోసం స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. యూనివర్సిటీకి అధికారిక గుర్తింపు తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.283 కోట్లు లభించడం విశేషం. ఫ్యాకల్టీ సభ్యులు కూడా ఆవిష్కరణల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 15 పరిశోధన ప్రాజెక్టులకు పేటెంట్ల కోసం భారత్‌తోపాటు, అమెరికా, యూకేల్లోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఠ అకడమిక్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి కలిగించేలా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆసరా ఇచ్చేలా విశ్వవిద్యాలయం ‘టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్’ను ప్రారంభించింది. - విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో సదరు విద్యాసంస్థ లో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ విషయం లో విశ్వవిద్యాలయం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. విశ్వవిద్యా లయ గ్రంథాలయంలో 3.7 లక్షల పుస్తకాలు, 2.5 లక్షల జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐసీటీ బోధన పద్ధతులకు సంబంధిం చిన పలు సాధనాలు కూడా ఉన్నాయి. దూర విద్య కోర్సులు : విశ్వవిద్యాలయం ‘సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్’ పరిధిలో దూరవిద్యా విధానం ద్వారా అందిస్తున్న కోర్సుల్లో ప్రస్తుతం 17 పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 1994లో ఏర్పాటు చేసిన దూరవిద్య కేంద్రంలో నవ్యతకు నిదర్శనంగా క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్; టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్; కన్జూమర్ ఎడ్యుకేషన్ తదితర కోర్సులను చెప్పుకోవచ్చు. వెబ్సైట్: www.uohyd.ac.in ‘న్యాక్’ గుర్తింపు మన దేశంలో విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇచ్చే అత్యున్నత సంస్థ నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్(న్యాక్). దీని గుర్తింపు విషయంలోనూ హెచ్‌సీయూ ముందు వరుసలో నిలుస్తోంది. 2014లో న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపును పొంది.. వరుసగా మూడోసారి ఈ ఘనతను సాధించింది. నిపుణులైన ఫ్యాకల్టీ శ్రీహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఇక్కడి బోధన విధానాలే. ఇందుకోసం నిపుణులైన ఫ్యాకల్టీని నియమించుకునేందుకు పెద్దపీట వేస్తున్నాం. ముఖ్యంగా పీహెచ్డీ ఫ్యాకల్టీ సభ్యులు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంటర్మీడియెట్ అర్హతతోనే విశ్వవిద్యాలయ స్థాయి విద్య లభించేలా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు రూపకల్పన చేయడం కూడా యూనివర్సిటీ ప్రాధాన్యానికి మరో కారణంగా చెప్పొచ్చు. ప్లేస్‌మెంట్స్ పరంగానూ విద్యార్థులకు సహకరిస్తున్నాం. ఏటా 90 శాతానికి తగ్గకుండా ప్లేస్‌మెంట్స్ నమోదవుతున్నాయి. - ప్రొఫెసర్. రామకృష్ణన్ రామస్వామి, వీసీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోర్సుల్లో ప్రవేశాలు కోర్సుల్లో ప్రవేశానికి హెచ్‌సీయూ ఏటాఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 35 నగరాల్లో నిర్వహిస్తారు. దీనికి ఏటా జనవరి/ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. హెచ్‌సీయూలో చదివేందుకు విదేశీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. వీరికి 15 శాతం సీట్లను కేటాయించగా.. ఈ సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి. -
నగరంలో నారీభేరి
మన మహిళల ఆత్మగౌరవ బావుటాను ఎగరేసింది.. ఉమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ! ఈ నెల 22వ తేదీ వరకు సాగే ఈ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ వేదిక నుంచి దేశవిదేశాలకు చెందిన ఎందరో నారీమణులు తమ గెలుపువాణిని వినిపిస్తున్నారు. విశ్వవనితలకు స్ఫూర్తినిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్.. ప్రొఫెసర్, విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ చైర్పర్సన్ అండ్ డెరైక్టర్ రేఖాపాండే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవం వెనుక విశేషాలను ‘సిటీ ప్లస్’తో రేఖాపాండే పంచుకున్నారు. - సరస్వతి రమ ఇంటర్నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ కాంగ్రెస్ ఆఫ్ విమెన్.. అనే ఆర్గనైజేషన్ మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 1981లో జరిగిన ఈ సంస్థ తొలి సవూవేశానికి ఇజ్రాయిల్ వేదికైంది. అమెరికా, కోస్టారికా, కెనెడా, ఉగాండా.. ఇలా ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగిన ఈ సవూవేశాలు.. ఈ ఏడాది వున హైదరాబాద్‌లో జరుగుతున్నారుు. గతంలో పలు దేశాల్లో జరిగిన కాన్ఫరెన్స్‌లకు ఏ వూత్రం తీసిపోకుండా సవూవేశాలు నిర్వహిస్తున్నారు. అన్నీ అధిగమించి.. విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువుతి వున దేశానికి తెచ్చింది రేఖాపాండేనే. కార్యక్రవుం ఇండియూలో నిర్వహించడానికి 2011లోనే ఆమోదవుుద్రపడింది. అరుుతే ఆ ఏర్పాట్లలో వూత్రం అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యూరుు. మొదట ఈ సవూవేశానికి వుూడున్నరవేల వుంది అతిథులను ఆహ్వానించాలనుకుని హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్‌ను ఖాయం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయు ఘటన ఎఫెక్ట్ విదేశీ వనితలను చాలా వుంది కాన్ఫరెన్స్‌కు దూరం చేసింది. లేటెస్ట్గా ఎబోలా కారణంగా ఆఫ్రికా దేశాలకు చెందినవారి వీసాలన్నీ రద్దయ్యూరుు. అన్ని అడ్డంకులు దాటుకుని వేదికెక్కిన ఈ కాన్ఫరెన్స్‌కు వెరుు్య వుంది అతిథులు హాజరుకానున్నారు. వీళ్లలో 58 దేశాల నుంచి 200 వుంది డెలిగేట్స్ రానున్నారు. వావ్.. హైదరాబాద్ ‘మా ఈ విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ థీమ్.. జెండర్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్! అసలు ఈ కాన్ఫరెన్స్‌ను మన దేశంలో పెట్టాలని జెండర్ ఆన్ హిస్టరీ, జెండర్ ఆన్ వయొలెన్స్, జెండర్ ఆన్ కల్చర్, జెండర్ ఆన్ హెల్త్, జెండర్ ఆన్ మీడియా.. లాంటి ఇష్యూస్ అన్నీ చర్చకు రానున్నాయి. వీటికి సంబంధించి అన్ని దేశాల నుంచి మొత్తం 850 ప్రెజెంటేషన్ పేపర్లు వచ్చాయి. ఇక్కడకు వచ్చిన విదేశీ వనితలు హైదరాబాద్ ఎరుుర్‌పోర్ట్‌ను చూడగానే అమేజింగ్ ప్లేసంటూ ఆశ్చర్యపోతున్నారు. సిటీలోని చారిత్రక కట్టడాలు చూడాలనుకుంటున్నారు. అందుకే వాళ్ల కోసం చివరి రెండు రోజులు టూర్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు ప్రొఫెసర్ రేఖాపాండే. నెదర్లాండ్స్‌లో ప్రేరణ కొన్నేళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో జరిగిన ఫ్యామిలీ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు రేఖాపాండే. అక్కడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రముఖులూ వచ్చారు. ఆ సదస్సు చూసి ముగ్దురాలైన రేఖా పాకిస్థానీ డెలిగేట్ ఫారూఖ్‌తో ‘ఇలాంటి కాన్ఫరెన్స్ ఇండియాలోనో, పాకిస్థాన్‌లోనో జరిగితే ఎంత బాగుంటుంది?’ అని అన్నారట. అందుకాయున ‘విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ అని ఇంకోటి ఉంది.. అది జరిగితే నిజంగానే చాలా గ్రేట్‌గా ఉంటుంది. మీకు ఆసక్తి ఉంటే నేను హెల్ప్ చేస్తాను’ అన్నారట ఫారూఖ్. అనడమే కాదు దానికి సంబంధించిన ప్రాసెస్‌లో ఆయున సాయుం కూడా చేశారట. అయితే ఆ ఏడాది అది ఆస్ట్రేలియూకు దక్కింది. ఏమైతేనేం చివరకు ఈ ఏడాది విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ హైదరాబాద్ చేరుకుని వున వేడుకైంది.