తెలంగాణ ప్రభుత్వ పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్.. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వరంగల్: పోస్టుల సంఖ్య 01
► పోస్టు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్
► అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
► వయసు: 35–55ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.22,000 చెల్లిస్తారు.
వికారాబాద్: పోస్టుల సంఖ్య 02
► పోస్టులు: సపోర్ట్ పర్సన్, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్.
► అర్హత: ఎంఏ సైకాలజీ/ఎంఎస్‌డబ్ల్యూ, టాలీతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: సపోర్ట్ పర్సన్ 22–35ఏళ్ల మధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ 20–35ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం సపోర్ట్ పర్సన్–నెలకి రూ.18,000, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్–నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
సూర్యాపేట్: పోస్టుల సంఖ్య 06
► పోస్టులు: సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్‌ఎం, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్.
► అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ(నర్సింగ్), ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎంఎస్/ఎంఎస్‌డబ్ల్యూ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
సంగారెడ్డి: పోస్టుల సంఖ్య 01
► పోస్టులు: లీగల్ సపోర్ట్ ఆఫీసర్.
► అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35–55 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.22,000 చెల్లిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
► వెబ్‌సైట్: https://womensafetywing.telangana.gov.in/
యూఓహెచ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు
హైదరాబాద్(గచ్చిబౌలి)లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 04
► పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ మేనేజర్లు–03, ఆఫీస్ అటెండెంట్–01.
► ప్రోగ్రామ్ మేనేజర్లు: అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ విభాగాల్లో పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
► ఆఫీస్ అటెండెంట్: అర్హత: సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతోపాటు ఆఫీస్ అటెండెంట్‌గా పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్, ఐఓఈ డైరెక్టరేట్, డా.జాకీర్ హుస్సేన్ యూపీఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సీఆర్‌రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్–500046 చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
► వెబ్‌సైట్: https://uohyd.ac.in
తెలంగాణ పోలీస్ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు
Published Tue, Jun 15 2021 8:06 PM | Last Updated on Tue, Jun 15 2021 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment