సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్‌గా డాక్టర్ బసూత్కర్ జగదీశ్వర్ రావు నియమితులయ్యారు. ఆయన్ను వీసీగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. బీజే రావు ప్రస్తుతం తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు పలు ఉన్నత పదవులు చేపట్టిన బసూత్కర్ జగదీశ్వర్ రావు.. అమెరికాలోని యేల్ స్కూల్ నుంచి బయోలాజికల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరేట్ పట్టా పొందారు. ఈయన ఐదేళ్లపాటు హెచ్‌సీయూ వీసీగా కొనసాగనున్నారు.
ఇక మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వీసీగా సయ్యద్ ఐనుల్ హుస్సేన్ నియమితులయ్యారు. డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్‌గా ప్రొఫెసర్ హుస్సేన్ పనిచేస్తున్నారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణకు అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment