ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్నై మీట్–2023’లో మాట్లాడుతున్న సీవీ ఆనంద్. చిత్రంలో బుర్రా వెంకటేశం, శేఖర్ కమ్ముల.
సాక్షి, హైదరాబాద్: వందేళ్లు దాటిన మహోన్నత చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకు తానే ఒక బ్రాండ్ ఇమేజ్ అని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యా లయాల్లో చెక్కుచెరదరని స్థానం కలిగి ఉందని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ అన్నారు. గతేడాది రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాల యాల జాబితాలో ఉస్మా నియా 22వ స్థానంలో ఉందని చెప్పారు.
ఇటీవల వరకు ఉద్యమాల గడ్డగా ఉన్న ఉస్మానియా వర్సిటీ ఇప్పుడు ఉద్యోగాల అడ్డాగా మారిందని పేర్కొ న్నా రు. ‘ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్నై మీట్–2023’ వేడుకలు మంగళవారం వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమ య్యాయి. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ స్వాగతోపన్యా సం చేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలలో పాల్గొనేందుకు దేశ, విదేశాల్లో స్థిరపడిన వేలాదిమంది ‘ఉస్మానియన్స్’ తరలివచ్చారు.
వైస్ చాన్సలర్ మాట్లాడుతూ టీచింగ్, లెర్నింగ్ మెథడ్స్, రీసెర్చ్ రంగంలో అత్యున్నత ప్రమాణాలను అభి వృద్ధి చేసినట్లు, అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓయూ నిర్వహించిన ‘నిపుణ’కార్యక్రమంలో 250 క్యాంపస్‌లు పాల్గొన్నా యని, 55 వేలమంది విద్యార్థులు హాజరయ్యారని, సుమారు 16 వేలమందికి ఉద్యోగాలు లభించా యని వివరించారు.
ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీ పూర్వ విద్యా ర్థులను ఒక వేదికపైకి తీసుకురాగలిగినట్లు చెప్పా రు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యా ర్థుల సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్లు వివరించారు. కార్య క్రమంలో ఆయన ఉస్మానియా టీవీని లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 46 చానళ్లతో త్వరలోనే ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు.
చదువులమ్మ చెట్టు నీడలో...
పూర్వవిద్యార్థుల ప్యానెల్ సమావేశంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఫ్యూజీ సీఈవో మనోహర్‌రెడ్డి, ఓఎస్‌డీ రాజశేఖర్ వర్సిటీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎక్కడో నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగిన తనను ఉస్మానియా కన్నతల్లిలా చేరదీసి ఆదరించిందని చెప్పారు.
ఆర్ట్స్ కళాశాలలో 1989–91లో ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న తాను ఉస్మానియన్‌గా చెప్పుకొనేందుకు గర్విస్తున్నానని సీవీ ఆనంద్ అన్నారు. ఉస్మానియా వర్సిటీకి సైతం అలుమ్నైలు బలమైన వెన్నుదన్నుగా నిలవాలని బుర్ర వెంకటేశం అభిప్రాయపడ్డారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఉస్మానియా గాలిలోనే ఒక వైబ్రేషన్ ఉందన్నారు. అమ్మకు, ఆవకాయకు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ అవసరం లేనట్లుగానే ఉస్మాని యా కు అవసరం లేదన్నారు, ఉస్మానియా ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ దేవరకొండ, సీఏబీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment