న్యూఢిల్లీ: దేశంలోని 39 సెంట్రల్ వర్సిటీల పరిశోధనా ఫలితాలన్నీ కలిపినా.. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ (బ్రిటన్), స్టాన్‌ఫర్డ్(అమెరికా) వర్సిటీల కంటే తక్కువగా ఉన్నట్లు ఓ సర్వే తెలిపింది. మౌలిక వసతుల కొరత, నిధుల లేమి, అనవసర నిబంధనలు, అధ్యాపక ఖాళీలు.. తదితర కారణాల వల్ల భారత యూనివర్సిటీల్లో పరిశోధన కుంటుపడ్డట్లు పేర్కొంది.
ఢిల్లీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలు పరిశోధనల్లో దేశీయంగా అగ్రభాగాన నిలిచినట్లు సర్వేలో పాల్గొన్న వివేక్‌కుమార్ సింగ్ తెలిపారు. చిన్న వర్సిటీల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, హేమవతి నందన్ సెంట్రల్ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఘర్వాల్ పరిశోధనల్లో ముందున్నట్లు పేర్కొన్నారు.
పరిశోధనల్లో భారత వర్సిటీలు దారుణం
Published Mon, May 29 2017 9:04 AM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM
Advertisement
Advertisement