Vivek Kumar Singh
-
పరిశోధనల్లో భారత వర్సిటీలు దారుణం
న్యూఢిల్లీ: దేశంలోని 39 సెంట్రల్ వర్సిటీల పరిశోధనా ఫలితాలన్నీ కలిపినా.. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ (బ్రిటన్), స్టాన్‌ఫర్డ్(అమెరికా) వర్సిటీల కంటే తక్కువగా ఉన్నట్లు ఓ సర్వే తెలిపింది. మౌలిక వసతుల కొరత, నిధుల లేమి, అనవసర నిబంధనలు, అధ్యాపక ఖాళీలు.. తదితర కారణాల వల్ల భారత యూనివర్సిటీల్లో పరిశోధన కుంటుపడ్డట్లు పేర్కొంది. ఢిల్లీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలు పరిశోధనల్లో దేశీయంగా అగ్రభాగాన నిలిచినట్లు సర్వేలో పాల్గొన్న వివేక్‌కుమార్ సింగ్ తెలిపారు. చిన్న వర్సిటీల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, హేమవతి నందన్ సెంట్రల్ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఘర్వాల్ పరిశోధనల్లో ముందున్నట్లు పేర్కొన్నారు. -
'సమాజ్‌వాది పార్టీతో చేతులు కలపండి'
లక్నో: లోక్‌సభ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తి చిదంబరం హైకమాండ్ ను ధిక్కరించే విధంగా మాట్లాడి 24 గంటలు గడవకముందే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు గళం విప్పారు. బీజేపీ వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీని బలోపేతం చేయాలని ఉత్తరప్రదేశ్ లోని బంద నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ కుమార్ సింగ్ ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎస్ఎంఎస్ పంపించారు. పార్టీని బలోపేతం చేయండి లేదా మతతత్వ శక్తులతో పోరాటం చేయడానికి యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీతో చేతులు కలపాలని ఆయన సూచించారు.