
ఇన్ బాక్స్
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాట యోధుల బలిదానం కారణంగా... 610 జీవో విడుదలయ్యింది. తెలంగాణ ఉద్యమం మొదటి దశలోని ఆరు పాయింట్ల ఫార్ము లాలో రెండవ అంశంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad (UoH)) ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 371ఈ ప్రకారం ఏర్పడిన ఈ విశ్వ విద్యాలయానికి ప్రాథమికంగా 2,324.05 ఎకరాల భూమిని కేటా యించారు. అయితే, కాలక్రమేణా గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ హైదరాబాద్, బస్ డిపో, టీఐఎఫ్‌ఆర్ లాంటి అనేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూమిని బదిలీ చేయడంతో ప్రస్తుతం విశ్వ విద్యాలయం వద్ద కేవలం 1,800 ఎకరాల భూమి మాత్రమే మిగి లింది. యూనివర్సిటీకి మొదటి వైస్ చాన్సలర్‌గా ఉన్న గుర్ భక్షి సింగ్ 2 సంవత్సరాల నిర్విరామ కృషితో దాదాపు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీని’ నిర్మించారు. ఆ తదనంతర పరిస్థితుల్లో హైద్రాబాద్ నగరం అభివృద్ధి చెంది, ఐటీ హబ్‌గా మారడంతో ఇక్కడి భూములకు విలువ పెరిగిపోయింది. దీంతో ఈ భూములను కబ్జా చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి.
ఈ చర్యలకు వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఉన్న లెఫ్ట్, రైట్ వింగ్‌ల విద్యార్థి సంఘాలు, దళిత, బహుజన, బీసీ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ అధికారులు పోరాడుతున్నారు. యూనివ ర్సిటీకి చెందిన భూమిలో ఎలాంటి ఆదేశాలు, అనుమతులులేకుండా ఇప్పటికే దేవాలయ నిర్మాణాలను చేపట్టారు. యూనివ ర్సిటీ చూట్టు రక్షణ కవచంగా నిర్మించిన గోడను పడగొట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రహరీ గోడను కూల్చడం వల్ల బయటి వ్యక్తులు యూనివర్సిటీలో ప్రవేశించి, విద్యార్థినీ విద్యార్థులపై భౌతికపరమైన దాడులు చేయడానికీ, అలాగే క్యాంపస్‌లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడా నికీ అవకాశం ఉంది.
చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!
యూనివర్సిటీ అద్భుతమైన జీవావరణాన్ని కలిగి ఉంది. ఇందులో 3 చెరువులు, కొండ ప్రాంతాలు, 734 రకాల మొక్కలు, జింకలు, అడవి పందులు, నెమళ్ళు, 15 రకాల కుందేళ్ళు, 220 రకాల పక్షులున్నాయి. ఈ భూములను కబ్జా చేసి పరిశ్రమలు, ఇతర భవనాలు నిర్మిస్తే కాంక్రీట్ జంగిల్‌గా మారి ఈ జీవావరణం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ యూనివర్సిటీ భూములు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
– వై. శివ ముదిరాజ్, తెలంగాణ బీసీ కులాల జాక్ చైర్మన్