Car mechanic
-
మూడేళ్లలో మూడింతల ఆదాయం
న్యూఢిల్లీ: కార్ సర్వీసెస్ (Car service), రిపేర్ (Car repair) ప్లాట్‌ఫామ్ గోమెకానిక్ (GoMechanic) మూడేళ్లలో నికర ఆదాయం మూడింతలకుపైగా అధికమై రూ.700 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆ తర్వాత పబ్లిక్ లిస్టింగ్‌కు (IPO) వెళ్తామని కంపెనీ కో–ఫౌండర్, సీఈవో హిమాన్షు అరోరా తెలిపారు. ప్రస్తుతం 3 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని, మూడేళ్లలో దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ద్విచక్ర, ఎలక్ట్రిక్ వెహికిల్స్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు.‘కంపెనీ ప్రస్తుతం 125 నగరాల్లో 800 గరాజ్ల ద్వారా సేవలను అందిస్తోంది. 2027 నాటికి 500 నగరాల్లో 2,500 గరాజ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని వివరించారు. గతంలో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు బయటపడడంతో కంపెనీని ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టారు. లైఫ్‌లాంగ్ గ్రూప్ అనుబంధ కంపెనీ సర్వీజ్జీ 2023 మార్చిలో గోమెకానిక్ను కొనుగోలు చేసింది. 8 లక్షల మంది కస్టమర్లు.. గోమెకానిక్ 2023–24లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో రూ.85 కోట్లు నమోదు చేసింది. ‘విడిభాగాలు, ఉపకరణాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. వీటి విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది. నికర రాబడి దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటాం’ అని అరోరా చెప్పారు. యాక్టివ్ కస్టమర్లు నెలకు 8 లక్షలు ఉన్నారని గోమెకానిక్ కో–ఫౌండర్, సీవోవో ముస్కాన్ కక్కర్ వివరించారు. నిర్వహణ లాభం నమోదు చేస్తున్నామని, 2027 నాటికి నికరలాభం అందుకుంటామని ఆమె వెల్లడించారు. కంపెనీ రోల్స్‌పై 550 మంది, ఫ్రాంచైజీ నెట్‌వర్క్‌లో 4,000 మంది పనిచేస్తున్నారని వివరించారు. -
ఎంటెక్.. మెకానిక్
‘ఏది తానంతట తానై నీ దరికి రాదు.. శోధించి సాధించాలనే’ నానుడిని నిజం చేశాడీ సంతోష్. లక్షల్లో వేతనం.. లగ్జరీ జీవితం అయినా ఏదో వెలితి.. ఒకరి వద్ద పని చేయడమేంటనే ఆలోచన వెంటాడటంతో సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు.అనుకున్నదే తడువుగా చదువుకు తగిన పనినే ఎంచుకున్నాడు. మెకానిక్‌లుగా ఇంజినీరింగ్ పట్టభద్రులు లేక పోగా మెకానికల్ ఇంజినీరింగ్ విద్యతోనే వినియోగదారులకు సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నగరంలో మెకానిక్ షాపును ప్రారంభించి పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తుండగా.. తను మాత్రమే కాకుండా 20మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. – కరీంనగర్ అర్బన్స్వయంకృషే నా బలం..మొదటి నుంచి స్వయంకృషితో ఎదగాలనుకున్న. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంటెక్ పూర్తి చేసి మెకానికల్ రంగంలో రాణించాలని నిర్ణయించుకున్న. ఉద్యోగాన్ని వదిలినపుడు చాలామంది హేళన చేశారు. ఇప్పుడు వారే అభినందిస్తున్నారు. సొంతకాళ్లపై నిలబడటంతో పాటు 20మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నా. – రొక్కం సంతోష్‌రెడ్డి -
బెంగళూరులో నకిలీ సూపరింటెండెంట్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంటూ మహిళను ట్రాప్ చేసే ప్రయత్నం చేసి న వ్యక్తిని బెంగళూరులోని బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు అగ్రహారం ప్రాంతానికి చెందిన అబ్దుల్ ముబారక్ అలియాస్ హాజీ షేక్ కారు మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు తెలంగాణ అబ్కారీ శాఖ పేరును వాడుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ మహిళను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మబలికాడు. నెల క్రితం ఆమెను బం గారు ఆభరణాలు కొనిస్తానని చెప్పి దుకాణానికి తీసుకెళ్లి బంగారు ఆభరణాలు, ఆ మహిళ కారు తో పరారయ్యాడు. దీని పై బాధితు రాలు పోలీసులకు ఫిర్యా దు చేయటంతో అతడిని అరెస్ట్ చేసి కారు, నకిలీ ఐడీ కార్డు, 28 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
హెలికాప్టర్ ను రిపేరు చేసిన కారు మెకానిక్
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ను కారు మెకానిక్ తో రిపేరు చేయించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత హెలికాప్టర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో డీజీసీఏ ఘటనపై విచారణకు ఆదేశించింది. కాగా విచారణలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన అగస్లా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ-109ను ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెన్స్ ఇంజనీర్(ఏఎమ్ఈ)తో కాకుండా ఓ కార్ మెకానిక్ తో రిపేరు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పింది. గత నెల 12వ తేదీన గోవా నుంచి పూణె(వయా కొల్హాపూర్)కు హెలికాప్టర్ వెళ్లినట్లు తెలిపింది. మధ్యలో కొంతసేపు కొల్హాపూర్ లో హెలికాప్టర్ ను పైలట్ నిలిపినట్లు చెప్పింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్లో హెలికాప్టర్ ఇంజన్ ను కారు మెకానిక్ రిపేర్ చేసినట్లు స్పష్టంగా ఉన్నట్లు పేర్కొంది. ఇంజన్ లో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు అతను ప్రయత్నించి ఉండొచ్చని డీజీసీఏ అధికారి ఒకరు పేర్కొన్నారు. చాపర్ పైలట్ ను విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. హెలికాప్టర్ ఇంజిన్ ను మెకానిక్ ఏం చేశాడనే దానిపై విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
స్నేహంగా ఉంటూ.. నట్టేట ముంచాడు!
రూ. 2.5 కోట్లతో కార్ మెకానిక్ పరార్ పోలీసులను ఆశ్రయించిన 61 మంది బాధితులు హిమాయత్‌నగర్: స్థానికులతో స్నేహంగా ఉంటూ... భర్తకు తెలియకుండా భార్య వద్ద, భార్యకు తెలియకుండా భర్త వద్ద... ఇలా పలు ఇళ్లల్లో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పు తీసుకున్నాడో వ్యక్తి. మొత్తం రూ. 2.5 కోట్లు దండుకొని పరారయ్యాడు. దీంతో సుమారు 61 మంది బాధితులు తమకు న్యాయం చేయాలని ఆసిఫ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా కార్వాన్ హరిదాసునగర్‌కు చెందిన బాధితులు కొండయ్య, సత్యనారాయణ, రంగారావు ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్లో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని విస్సాకోడేరు గ్రామానికి చెందిన తానుకొండ వెంకట కేదారి నగరంలోని శారదానగర్‌లో ఉంటూ కార్ఖానాలో కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇతను తాను నివాసం ఉండే చోట అందరితో స్నేహంగా ఉండేవాడు. తాను అపార్ట్మెంట్ నిర్మిస్తున్నానని, సాయం చేయాలని స్థానికుల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద రూ. లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇలా సుమారు 61 మంది నుంచి మొత్తం రూ. 2.5 కోట్లు దండుకున్నాడు. ఈ విషయం తెలిసి అందరూ తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తేవడంతో చెక్కులు ఇచ్చాడు. అవి కోర్టుకు సమర్పిస్తే బౌన్స్ అయ్యాయి. ఈ విషయమై కేదారిని ప్రశ్నిద్దామంటే అందుబాటులో లేడు. దీంతో ఆందోళనకు గురైన బాధితులంతా కలిసి ఆసిఫ్‌నగర్ ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయగా.. పోలీసు లు కేదారి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో బాధితులు వినోద్‌కుమార్, శివ, సురేఖ, ఉదయ్, పద్మావతి, బాలచంద్రుడు, వర్మ, యుగంధర్‌రెడ్డి, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.