ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం శాంతిఖనిలోని బొగ్గు గని పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గని 51వ లెవల్‌లో బుధవారం సాయంత్రం పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. క్షతగాత్రులను సింగరేణి ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గనిపైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి
Published Wed, Apr 13 2016 3:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement