శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మరోసారి వివాదంలోకి ఎక్కింది. నిత్యం నాయకత్వ పోరులో నలుగుతున్న యూనియన్‌కు ముఖ్య నేతల అరెస్టు మరో మచ్చగా మారింది. కార్మికులు ఇచ్చిన సభ్యత్వ రుసుములో రూ.90 లక్షలు దుర్విని యోగం చేశారనే కేసులో అధ్యక్షుడు ఆకునూరి కనుకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కోశాధికారి వై.సారంగపాణిలను బుధవారం కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
దీంతో టీబీజీకేఎస్‌లో అలజడి మొదలైంది. ముఖ్య నేతలు అరెస్ట్ కావడంతో ఇప్పుడు సంఘాన్ని ఎవరు నడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అనినీతి ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పరువు బజారున పడడం తో తీవ్రంగా పరిగణించిన పార్టీ హైకమాండ్ ప్రక్షాళన చేయూలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం జరిగే పార్టీ ప్లీనరీ సందర్భంగా నాయకత్వం దీనిపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆ ముగ్గురిపై వేటు తప్పదా..?
అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గరిని బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలే కనిపిస్తున్నాయి. వారిపై చీటింగ్, తీవ్ర ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగం, రికార్డులను మాయం చేయం వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యూరుు. అవినీతికి పాల్పడితే కన్న కొడుకునైనా ఉపేక్షించ నని పలు మార్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను బాధ్యతల నుంచి తొలగించారు.
ఇప్పుడు అవినీతి ఆరోపణలపై కేసులు నమోదైన యూనియన్ నాయకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. ఆ ముగ్గురిని కొనసాగించినా కేసుల కోసం నిత్యం కోర్టు చుట్టూ తిరగడం, 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తప్పవని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పు వచ్చేంత వరకు వారిని పక్కన పెట్టాలనే సూచనను పార్టీకి చెప్పడానికి పలువురు నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కోల్‌బెల్ట్‌లోని 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఎన్నికలప్పటి నుంచీ రాజిరెడ్డి వర్గంపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.
కీలకం కానున్న ‘కెంగర్ల’
యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రిమాండ్‌లో ఉండటంతో సీన్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య వైపు మళ్లింది. యూనియన్‌ను మొదటి నుంచి నడిపించిన మల్లయ్యకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతోం ది. అయితే రాజిరెడ్డి వర్గం నుంచి ప్రధానమైన ముగ్గురుపై కేసులు ఉన్న దృష్ట్యా ఆవర్గంలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం ఇప్పుడు కీలకంగా మారారు. ప్రస్థుత పరిస్థితిల్లో యూనియన్ బాధ్యతలపై జనరల్‌బాడీ పెట్టి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు.
ఇప్పటికే ఒక సారి కార్మికుల ఓట్ల ద్వారా ఎన్నికలకు వెళ్లా రు. ఈ నేపథ్యంలో కేసీఆర్, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత జోక్యం చేసుకుని ఆ ముగ్గురి స్థానంలో ఇతరులను నియమిస్తేనే మేలనే అభిప్రాయం పార్టీతో పాటు కొందరు యూనియన్ నేతల్లో ఉంది. ఇదే జరిగితే మల్ల య్య, రవీందర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు గ్రూపుల నేతలు గురువారం రాత్రి ైెహ దరాబాద్‌కు పయనమయ్యారు.
టీబీజీకేఎస్‌లో నాయకత్వ మార్పు!
Published Fri, Apr 24 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement