Leadership change
-
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
గాంధీ కుటుంబానికి ఇద్దరు సీఎంల బాసట
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు గాంధీ కుటుంబ నాయకత్వాన్ని సవాల్ చేసిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. దేశ రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యవస్థలను కూలదోస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఈ సమయంలో ఇలాంటి అంశాన్ని లేవనెత్తడం తగదని అమరీందర్ సింగ్ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశ స్వాతంత్ర్యం సాధించడం నుంచి గాంధీ కుటుంబం దేశ పురోగతికి తీవ్రంగా శ్రమించిందని గుర్తుచేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు గాంధీ కుటుంబ నేతలే సరైన వారని అన్నారు. దేశంలో బలమైన విపక్షం లేనందునే ఎన్డీయే అప్రతిహత విజయం సాధిస్తోందని, ఈ సమయంలో పార్టీ ప్రక్షాళనకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ, దేశ ప్రయోజనాలకు విఘాతమని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ప్రస్తుతం సరిహద్దుల వెలుపల కాకుండా అంతర్గతంగానూ పలు సవాళ్లు ఎదుర్కొంటోందని అన్నారు. దేశ సమాఖ్య వ్యవస్ధకు ముప్పు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకతాటిపై నిలిచిన కాంగ్రెస్ ఒక్కటే దేశాన్ని,ప్రజలను కాపాడగలదని చెప్పారు. మరోవైపు సోనియా గాంధీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ సైతం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ఎలాంటి సవాల్ ఎదురైనా సోనియా, రాహుల్ చొరవ చూపి పరిష్కరించేవారని, మేమంతా మీతో ఉన్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఇక పార్టీలో నాయకత్వ మార్పు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం కలకలం రేపింది. పార్టీలో నాయకత్వ మార్పును కోరుతూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి రాహుల్‌కు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేత వైపు మొగ్గుచూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి : కాంగ్రెస్ ప్రక్షాళనకు సీనియర్ల డిమాండ్ -
‘మోదీ స్ధానంలో గడ్కరీ’
సాక్షి, ముంబై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలని మహారాష్ట్రకు చెందిన సీనియర్ రైతు నేత వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మంగళవారం పర్యటిస్తున్న క్రమంలో రైతు నేత, వసంత్‌రావు నాయక్ సేఠి స్వావలంబన్ మిషన్ చైర్మన్ కిషోర్ తివారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మోదీ అహంభావ ధోరణే కారణమని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపు వంటి ప్రజా వ్యతిరేక చర్యలతోనే ఓటమి ఎదురైందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ సురేష్ జోషిలకు రాసిన లేఖలో తివారీ పేర్కొన్నారు. పార్టీలో అతివాద, నిరంకుశ ధోరణితో వ్యవహరించే నేతలతో సమాజానికి, దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చేందుకు పార్టీ పగ్గాలను నితిన్ గడ్కరీకి అప్పగించాలని కోరారు. ఇటీవలీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను బీజేపీ వదిలించుకోవాలని తివారీ ఇటీవల వ్యాఖ్యానించి కలకలం రేపారు. -
టీబీజీకేఎస్‌లో నాయకత్వ మార్పు!
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మరోసారి వివాదంలోకి ఎక్కింది. నిత్యం నాయకత్వ పోరులో నలుగుతున్న యూనియన్‌కు ముఖ్య నేతల అరెస్టు మరో మచ్చగా మారింది. కార్మికులు ఇచ్చిన సభ్యత్వ రుసుములో రూ.90 లక్షలు దుర్విని యోగం చేశారనే కేసులో అధ్యక్షుడు ఆకునూరి కనుకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కోశాధికారి వై.సారంగపాణిలను బుధవారం కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో టీబీజీకేఎస్‌లో అలజడి మొదలైంది. ముఖ్య నేతలు అరెస్ట్ కావడంతో ఇప్పుడు సంఘాన్ని ఎవరు నడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అనినీతి ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పరువు బజారున పడడం తో తీవ్రంగా పరిగణించిన పార్టీ హైకమాండ్ ప్రక్షాళన చేయూలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం జరిగే పార్టీ ప్లీనరీ సందర్భంగా నాయకత్వం దీనిపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ ముగ్గురిపై వేటు తప్పదా..? అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గరిని బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలే కనిపిస్తున్నాయి. వారిపై చీటింగ్, తీవ్ర ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగం, రికార్డులను మాయం చేయం వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యూరుు. అవినీతికి పాల్పడితే కన్న కొడుకునైనా ఉపేక్షించ నని పలు మార్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను బాధ్యతల నుంచి తొలగించారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలపై కేసులు నమోదైన యూనియన్ నాయకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. ఆ ముగ్గురిని కొనసాగించినా కేసుల కోసం నిత్యం కోర్టు చుట్టూ తిరగడం, 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తప్పవని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పు వచ్చేంత వరకు వారిని పక్కన పెట్టాలనే సూచనను పార్టీకి చెప్పడానికి పలువురు నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కోల్‌బెల్ట్‌లోని 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఎన్నికలప్పటి నుంచీ రాజిరెడ్డి వర్గంపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. కీలకం కానున్న ‘కెంగర్ల’ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రిమాండ్‌లో ఉండటంతో సీన్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య వైపు మళ్లింది. యూనియన్ను మొదటి నుంచి నడిపించిన మల్లయ్యకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతోం ది. అయితే రాజిరెడ్డి వర్గం నుంచి ప్రధానమైన ముగ్గురుపై కేసులు ఉన్న దృష్ట్యా ఆవర్గంలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం ఇప్పుడు కీలకంగా మారారు. ప్రస్థుత పరిస్థితిల్లో యూనియన్ బాధ్యతలపై జనరల్‌బాడీ పెట్టి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఇప్పటికే ఒక సారి కార్మికుల ఓట్ల ద్వారా ఎన్నికలకు వెళ్లా రు. ఈ నేపథ్యంలో కేసీఆర్, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత జోక్యం చేసుకుని ఆ ముగ్గురి స్థానంలో ఇతరులను నియమిస్తేనే మేలనే అభిప్రాయం పార్టీతో పాటు కొందరు యూనియన్ నేతల్లో ఉంది. ఇదే జరిగితే మల్ల య్య, రవీందర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు గ్రూపుల నేతలు గురువారం రాత్రి ైెహ దరాబాద్‌కు పయనమయ్యారు.