కొద్ది రోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు ఆ హోదాలో పనిచేసిన టీబీజీకేఎస్‌లో అంతర్గత విభేదాలతోనే పుణ్యకాలం గడిచిపోయింది.
గ్రూపులు ఏకమయ్యేనా..!
Published Sat, Aug 20 2016 12:53 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
వెంకట్రావుతో టీబీజీకేఎస్‌కు లాభం ఎంత?
ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి
మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : కొద్ది రోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు ఆ హోదాలో పనిచేసిన టీబీజీకేఎస్‌లో అంతర్గత విభేదాలతోనే పుణ్యకాలం గడిచిపోయింది. నాయకత్వ మార్పే పరిష్కార మార్గమని టీఆర్‌ఎస్ అధిష్టానం ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతన్న బి.వెంకట్రావుకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే సొంత పార్టీలో ఉన్న వారిని కాదని బయటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం వల్ల టీబీజీకేఎస్‌కు ఏమేరకు ప్రయోజనం కలుగుతుందనే చర్చ సింగరేణిలో జరుగుతోంది.
టీబీజీకేఎస్‌లో ప్రధానంగా కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగింది. అంతర్గత ఎన్నికలకు దారితీయడంతో రాజిరెడ్డి గెలుపొం ది ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అరుునా పరిస్థితి చర్కబడక పోవడంతో అధిష్టానం నూతన కమి టీ ఏర్పాటుకు మొగ్గుచూపింది. ఈ క్రమంలో రాజిరెడ్డిని పక్కన బెట్టి మల్లయ్యకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కట్టబెట్టింది. అలాగే ఇప్పటి వరకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కలిసి పనిచేసిన రాజిరెడ్డి, కనకరాజుల విషయంలోనూ అదే ఫార్ములాను ఉపయోగించి కనకరాజు కు ఉపాధ్యక్ష పదవి అప్పగించింది. దీంతో అంతర్గత సమస్యను కొంత వరకు పరిష్కరించినా ఇప్పటికే ఒక వర్గంగా ఏర్పడిన రాజిరెడ్డి అనుయూయులు ఇప్పుడు యూనియన్‌తో కలిసి వస్తారనేది అనుమానమే.
వెంకట్రావు గెలిపించగలడా..?
ఇక వెంకట్రావు విషయూనికి వస్తే సింగరేణిపై పట్టు ఉన్న వ్యక్తి. ట్రేడ్ యూనియన్‌లో సీనియర్ నాయకుడు. వేజ్ బోర్డు సభ్యుడిగా అనుభవం టీబీజీకేఎస్‌కు కలిసి వచ్చే అంశాలు. అలాగే ఐఎన్‌టీయుసీలో తన వెంట ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను తీసుకురాగలడు. యూనియన్ మరింత బలోపేతం అవుతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం టీబీజీకేఎస్‌లో పక్కన బెట్టిన రాజిరెడ్డి వర్గం యూనియన్‌ను చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇతర సంఘాలు ఆయనను చేర్చుకోవడానికి మంతనాలు సైతం మొదలు పెట్టారుు. అలాగే గుర్తింపు సంఘంగా కొనసాగిన నాలుగేళ్ల కాలం లో యూనియన్‌లో నెలకొన్న విభేదాలు కార్మికవర్గంలో టీబీజీకేఎస్‌పై అసంతృప్తిని మిగిల్చారుు. ఇదిలా ఉండ గా ఐఎన్‌టీయూసీలో వెంకట్రావు, జనక్‌ప్రసాద్ రెండు గ్రూపులుగా కొనసాగారు. ఆయన ఇతరులను ఎదగని వ్వడనే అభిప్రాయమూ ఉంది. తన వర్గానికే పదవులు కట్టబెడతాడనే పేరుంది. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన వెంకట్రావు గ్రూపులను ఏకం చేసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించగలడా అనే సందేహాలు వ్యక్త మవుతున్నారుు.
సత్తా ఉన్న నాయకుడే లేడా..
రాష్ట్రంలో అధికార పార్టీగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్ తన అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌కు సొంత నాయకుడిని ఇవ్వలేకపోరుుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా రుు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీలో కార్మిక సంఘాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడే లేడా అనే చర్చ జరుగుతోంది. యూనియన్ బలోపేతం చేయడానికే అరుుతే ఇతర సంఘాలకు చెందిన వారికే పట్టకట్టడం ఎంత వర కు సమంజసమని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నా రు. కనీసం సొంత ప్రాంతాల్లో ప్రాతినిధ్య సంఘంగా గెలిపించుకోలేని వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement