సింగరేణిపై సీఎం కీలక సమావేశం
సింగరేణిపై సీఎం కీలక సమావేశం
Published Thu, Oct 6 2016 11:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
తేలనున్న వారసత్వ ఉద్యోగాలు, లాభాల వాటా..?
ఇప్పటికే డైరెక్టర్ తో సీఅండ్‌ఎండీ బేటి
10 గంటలకు సీఅండ్‌ఎండీకి సీఎం అపాయిమెంట్
హైదారాబాద్‌లోనే మకాం వేసిన టీబీజీకేఎస్ నేతలు
వారసత్వం, విధివిధానాలపై కసర త్తు
శ్రీరాంపూర్ : ఎంతో కాలంగా అందరూ ఎదురుచూస్తున్న సింగరేణి కీలక సమావేశం నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో జరుగనుంది. కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన వారసత్వ ఉద్యోగాలు, లాభాల వాటా, స్వంతింటి పథకం వంటి వాటిపై ముఖ్యమంత్రి నేడు అటు సింగరేణి యాజమాన్యం, ఇటు గుర్తింపు సంఘం నేతలతో చర్చించనున్నట్లు విశ్వాసనీయం సమాచారం. బుధవారం మధ్యాహ్నమే సీఎం పేషీ నుంచి సింగరేణి సీఅండ్‌ఎండీకి కబురు వచ్చింది. ఆయనకు ఉదయం 10 గంటలకు సీఎం అపాయిమెంట్ ఇచ్చారు.
రాత్రికి గుర్తింపు సంఘం నేతలకు కూడా సమాచారం అందనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎంపీ కవిత, బాల్క సుమన్‌లు టీబీజీకేఎస్ ముఖ్య నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. సీఎం ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించడంతో వారు రెండు రోజులుగా ఇక్కడే మాకం వేసి ఎప్పుడు కబురు వస్తుందా అని వేచి ఉన్నారు. ఎట్టకేలకే సీఅండ్‌ఎండీ అధికారికంగా అపాయిమెంట్ ఇవ్వడంతో ఇక సమావేశం ఖరారైనట్లు తెలిసింది. ఇదిలా అన్నింటిలోకెళ్లా ముఖ్యమైన వారసత్వ ఉద్యోగాలపై ఇప్పటికే సీఎం తనును కలిసి పలువురు ఎంపీలు, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది.
డైరెక్టర్ తో సీఅండ్‌ఎండీ మంతనాలు...
ఇదిలా ఉంటే ఇందులో వారసత్వ ఉద్యోగాల పీటముడిపై సీఅండ్‌ఎండీ ఎన్ శ్రీధర్ కంపెనీ డైరెక్టర్ల తో సమావేశమయ్యారు. డైరెక్టర్లంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తే కంపెనీ జరిగే లాభ నష్టాలను ప్రత్యేక రిపోర్టు తయారు చేసుకున్నారు. కంపెనీలో ఉన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు, ఈసమయంలో వారసత్వం ఇస్తే ప్రభుత్వం నుంచి సింగరేణి అందాల్సిన సహాయ సహకారా లు కూడా చర్చకు పెట్టే అవకాశం ఉంది. సీఎం వారసత్వ ఉద్యోగాలు డిక్లేర్‌చేస్తే దానిలో విధివిధానాలు ఎలా పెట్టాలో ఇప్పటికే యాజమాన్యం డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంది.
మంతనాలు సాగిస్తున్న టీబీజీకేఎస్ నేతలు..
గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ముఖ్యనేతలు సీఎం బేటిలో చర్చించాల్సిన అంశాలపై మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయూనియన్ అధ్యక్షుడు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్యలు రెండు రోజులుగా హైదారాబాద్‌లోనే మకాం వేసి అటు కవిత, ఇటు బాల్క సుమన్‌తో టచ్‌లో ఉన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు పయనమయ్యారు. వారసత్వ ఉద్యోగాలపై సీఎం సానుకూలత వ్యక్తం చేస్తే దాన్ని యాజమాన్యం చెప్పే అభ్యంతరాలను ఎలా అడ్డుకోవాలి, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్లే కలిగే ప్రయోజనాలు, అటు కంపెనీ పరంగా, ఇటు రాజకీయ పరంగా మేలు చేసే అంశాలను కూడా సీఎం వద్ద ప్రజెంట్ చేయడానికి ఈ ఇద్దరు నేతలు సిద్దమయ్యారు. దీనికి సంబంధించిన వారు రిపోర్టును కూడా సిద్ధం చేసుకున్నారు. గతంలో ఉన్న మాదిరిగా కేవలం రెండేళ్ల సర్వీసుతో వారసత్వం కల్పిస్తే కేవలం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. చాలా మంది నష్టపోతారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని వారసత్వ ఉద్యోగాల పరిదిలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి ఇప్పటి వరకు మెడికల్ బోర్డుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకొన్న వారికి కూడా వారసత్వ అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారని సీఎంకు సూచించనున్నారు.
Advertisement
Advertisement