గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో ఏర్పడిన అంతర్గత నాయక సమస్యపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈనెల 23వ తేదీన గోదావరిఖనిలో ఏర్పాటు చేసే జనరల్ బాడీ సమావేశంలో ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ బుధవారం ఇక్కడికి వచ్చారు.
స్థానిక సింగరేణి స్టేడియం, సెయింట్‌పాల్ హైస్కూల్, గంగానగర్ పాఠశాల, సింగరేణి కమ్యూనిటీ హాల్, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, ఆర్‌సీఓఏ క్లబ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 23న జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో పాల్గొననున్న కార్మికుల కు ఇబ్బందులు తలెత్తకుండా గోదావరిఖని లో అనుకూలంగా ఉండే పలు ప్రాంతాలను పరిశీలించామని, మొత్తం 25 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. ఈ ఎన్నికలకు రెవెన్యూ అధికారులను ఉపయోగిస్తున్నామని, వారికి ఈనెల 21వ తేదీన శిక్షణ ఇస్తామన్నారు.
పోలీస్ సిబ్బం దిని ఎక్కువగా ఉపయోగించనున్నామని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో సంప్రదిస్తామ ని తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక లు నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించకుండా హైకోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నా రు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చంతా యూనియన్ ఖాతా నుంచి వాడనున్నామ ని, ఈ విషయాన్ని పోటీలో పడుతున్న ఇరువర్గాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. కొందరు నాయకులు గనులపైనే ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.. కార్మికులను అయోమయానికి గురిచేయవద్దని సూచించారు.
చెక్‌ఆఫ్ సిస్టమ్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకా రం గుర్తింపు యూనియన్ యాజమాన్యాని కి ఇచ్చిన నివేదిక ప్రకారం 40,752 మంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఇందులో గుర్తింపు యూనియన్‌కు చందా చెల్లిస్తున్నట్లు కార్మికులు సైతం రాత పూర్వకంగా రాసి ఇచ్చారు.. వీరు ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది శాంతి భద్రతల సమస్యగా దారి తీస్తుంది.. తమ పరిధులు దాటి ఏ వర్గం వారైనా ఈ ప్రయత్నానికి పూనుకుంటే వారిపై హైకోర్టుకు నివేదిస్తామని హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇరు వర్గాలు సహకరించాలి కోరారు. కార్మికులు యాజమాన్యం ఇచ్చిన ‘గుర్తింపు’ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఆర్‌ఎల్‌సీ వెంట ఏఎల్‌సీ ఆర్‌సీ సాహు, లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పి.లక్ష్మణ్, వీకే ఖరే, నర్సయ్య, సింగరేణి పర్సనల్ జీఎం మల్లయ్యపంతులు, సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, అనిల్‌కుమార్, కె.ప్రకాశ్‌బాబు, అమానుల్లా తదితరులున్నారు.
‘గుర్తింపు’ కార్డు తప్పనిసరి
Published Thu, Feb 13 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement