godavari khani
-
ఎంత పని చేశావు తల్లీ !
కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహాశివరాత్రి పండుగ పూట దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన తన ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు మృతి చెందారు. పిల్లలిద్దరూ తనతో ప్రేమగా, చనువుగా ఉండటం తట్టుకోలేక తన భార్య వారిపై దాడి చేసిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేనరికం.. ఉన్నత విద్యావంతులు.. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్, రమాదేవి దంపతులు. ఇందులో రమాదేవి తండ్రి.. శ్రీకాంత్ తల్లి అన్నాచెల్లెళ్లు కావడంతో మేనరికం కుదరగా 2003 నవంబర్ 4న ఇరువురికి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్(10), ఆర్యన్(6) ఉన్నారు. శ్రీకాంత్ స్థానికంగానే ప్రభుత్వ మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, రమాదేవి కొంతకాలం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసి ప్రసుతం ఇంటి వద్దే ఉంటోంది. వీరి పిల్లలు అజయ్ 4వ తరగతి, ఆర్యన్ ఎల్కేజీ చదువుతున్నారు. దంపతుల మధ్య గొడవలు.. కొంతకాలంగా శ్రీకాంత్, రమాదేవిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు తండ్రి శ్రీకాంత్‌తో చనువుగా ఉంటున్నారని తరచూ చెప్పుకునే రమాదేవి.. కొడుకులను అదే కారణంతో కొట్టేదని చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనార్టీ గురుకులంలో పని చేస్తున్న శ్రీకాంత్ ఆదివారం రాత్రి విద్యార్థులకు పాఠాలు బోధించి అక్కడే పడుకున్నాడు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న తన తండ్రి ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్య రమాదేవికి ఫోన్ చేశాడు. శివరాత్రి పూజ కోసం పండ్లు, సామాగ్రి తీసుకురావాలా అని అడిగి ఆమె సూచన మేరకు పూజా సామాగ్రితోపాటు పిల్లలకు తినడానికి అల్పాహారం కూడా తీసుకొని ఇంటికొచ్చాడు. గట్టిగా కొట్టడంతో.. శ్రీకాంత్ ఇంటికి రాకముందే రమాదేవి ఇద్దరు కొడుకుల తలపై ఇటుకతో విచక్షణా రహితంగా దాడి చేయగా తలలు పగిలిపోవడంతో కొడుకులిద్దరూ కుప్పకూలారు. ఇంటికి చేరుకున్న శ్రీకాంత్ పిల్లలను పిలిస్తే సమాధానం రాకపోగా, గేటుకు లోపలివైపు గడియపెట్టి తాళం వేసి ఉండడంతో అనుమానిం చాడు. స్థానికులను పిలిచి గోడ దూకి ఇంటి ఆవరణలోకి శ్రీకాంత్ వెళ్లే సరికి పిల్లలిద్దరూ తలలు పగిలి రక్తపు మడుగులో మూలుగు తూ కనిపించారు. పక్కనే రక్తంతో తడిసి పగిలిన ఇటుక కనిపించింది. భార్య చేతికి రక్తం మరకలు ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను గోదావరిఖలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి తీవ్రంగా గాయపడిన పెద్ద కుమారుడు అజయ్ చికిత్స పొందుతూ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. చిన్న కుమారుడు ఆర్యన్‌కు కూడా తలకు బలమైన గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించారు. మృతుల తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
‘గుండె’ను పిండేసిన స్ఫూర్తి
సాక్షి, గోదావరిఖని : ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడో ఆర్టీసీ డ్రైవర్. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా.. 52 మంది ప్రయాణికులు క్షేమండా ఉండాలనే ఏకైక తలంపుతో క్షేమంగా బస్సును రోడ్డు పక్కకు దించాడు. ఆ తర్వాతే తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు బుధవారం ఉదయం 5.15 గంటలకు వయా యైటింక్లయిన్‌కాలనీ మీదుగా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో 52 మంది ప్రయాణికులున్నారు. 6.35 గంటల సమయంలో రాఘవాపూర్ సమీపంలో డ్రైవర్ మహేందర్ (45) ఛాతీలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలో బస్సు వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా బస్సును నియంత్రించి రోడ్డు పక్కన ఆపి.. స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు 108కు ఫోన్ చేసినా.. అది ఆలస్యమయ్యేట్లు కనిపించింది. డ్రైవర్ విషమ పరిస్థితి గమనించిన బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఓసీపీ–3లో పనిచేస్తున్న ఎంవీ డ్రైవర్ వెంకటరమణ, ఈపీ ఆపరేటర్ ఆకుల రాజయ్యలు.. మహేందర్‌కు ప్రథమ చికిత్స అందించారు. ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తిరుపతి బస్సును నడుపుకుంటూ 10 నిమిషాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మహేందర్‌ను పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుగా నిర్ధారించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందడంతో.. డ్రైవర్ మహేందర్‌కు ప్రాణాపాయం తప్పింది. తన ప్రాణాన్ని లెక్కచేయక మహేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 52 ప్రాణాలు కాపాడారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి కరీంనగర్ తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడంతో.. కండక్టర్ డబ్బులిచ్చి డీజిల్ పోయించడంతో బండి ముందుకు కదిలింది. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని డ్రైవర్ ప్రాణాలు కాపాడేందుకు బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు పరితపించారు. -
యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
కోల్‌సిటీ(రామగుండం): యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నేహ(15) నానమ్మ జులేఖాబేగం వద్ద ఉంటోంది. శనివారం ఆమె నానమ్మ తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాబాయ్ రజాక్ ఇంటికి వెళ్లింది. సాయంత్రం బాబాయ్, నానమ్మ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నేహ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ‘నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ కొంతకాలంగా ప్రేమ పేరుతో నేహను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి బాబాయ్, నానమ్మ తెలిపారు. నిం దితుడిని అరెస్ట్ చేయాలని మృతు రాలి బంధువులు, ముస్లింలు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐలు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నం పెట్టలేదని తల్లిని కడతేర్చాడు
యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం): అన్నం పెట్టలేదనే కోపంతో తల్లినే కడతేర్చాడో కర్కోటకుడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముస్త్యాల గ్రామానికి చెందిన మేరుగు రమ (45) భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులతో కలసి ఉంటూ కూలీపని చేస్తోంది. పెద్ద కొడుకు ప్రశాంత్ చిన్నాచితక పనులు చేస్తూ ఉంటాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రశాంత్ తల్లిని అన్నం పెట్టమని అడిగాడు. ‘నువ్వేం పని లేకుండా తిరుగుతున్నావ్.. అసలు అన్నం వండనేలేదు’అని తల్లి రమ సమాధానం ఇచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రశాంత్ రమ తలపై రోకలిబండతో బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. -
లీకేజీలతో తాగునీటి కష్టాలు
గోదావరిఖనిటౌన్ : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12 డివిజన్లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదరకముందే నీటి కష్టాలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని స్థానికి ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన తాగు నీటి పైపులు చాలా చోట్ల లీకేజీ కావడంతో నీరు లీకేజీ అవుతోంది. దీంతో ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలందరికీ తాగునీరు అందించాలని కోరుతున్నారు. నీటి కలుషితం.. తాగు నీటి పైపులు లీకేజీ కావడంతో బురద, మట్టి, ఇతర కాలుష్య వస్తువులు కలవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల కొంతమంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడ్డామని స్థానికులు అంటున్నారు. లీకేజీలు అరికట్టి స్వచ్చమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరాలు గడిచినా పట్టించుకోవడం లేదు తాగు నీటి పైపులు లీకేజీ అవుతున్నాయని సంవత్సరాల నుంచి అధికారులకు, పాలకులకు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదు. నీటి కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. – బొద్దుల నరేందర్ తాగునీటి కోసం రోజూ ఇబ్బందే.. తాగు నీటి కోసం ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు 5 కిలోమీటర్ల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నాం. నీరు తెచ్చుకోవడం దిన చర్యలో భాగమైంది. ఎండా కాలంలో మరింత ఇబ్బంది పడుతున్నాం. కాలుష్యం లేని నీరు అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. – రాజేశం, స్థానికుడు -
మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ‘ఖని’ క్రీడాకారుల ప్రతిభ
24 బంగారు, తొమ్మిది రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్ గోదావరిఖని : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో గోదావరిఖనికి చెందిన పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 60 ఏళ్ల విభాగంలో టి.మనోహర్‌రావు లాంగ్ జంప్, హైజంప్, 100 మీటర్ల పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు, 70 ఏళ్ల విభాగంలో దామెర శంకర్ షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్ రో బంగారు పతకాలు, 50 ఏళ్ల విభాగంలో గూళ్ల రమేష్ 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెంలో మూడు బంగారు పతకాలు, చాట్ల సంజీవ్ ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్‌లో బంగారు పతకాలు, అంబాల ప్రభాకర్ జావెలిన్, డిస్కస్‌త్రో, హ్యామర్‌త్రోలో మూడు బంగారు పతకాలు, 55 ఏళ్ల విభాగంలో డీఎల్.సామ్యెల్ హైజంప్‌లో బంగారు పతకం, 50 ఏళ్ల విభాగంలో పర్శరాములు లాంగ్ జంప్‌లో బంగారు పతకం, 55 ఏళ్ల విభాగంలో తాండ్ర శంకర్ ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం, 40 ఏళ్ల విభాగంలో కాల్వ శ్రీనివాస్ షార్ట్పుట్లో బంగారు పతకం, డిస్కస్‌త్రోలో రజత పతకం, 35 సంవత్సరాల విభాగంలో విజయకుమార్ లాంగ్‌జంప్‌లో రజత పతకం, పోగుల రామకృష్ణ షార్ట్పుట్లో బంగారు పతకం, ఆట్ల రమేశ్ 800 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం, మహిళలకు సంబంధించి 55 ఏళ్ల విభాగంలో అనుముల కళావతి జావెలిన్ త్రో, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రోలో మూడు బంగారు పతకాలు, 50 ఏళ్ల విభాగంలో జాగంటి శాంత షార్ట్‌పుట్, 5 కిలోమీటర్ల వాకింగ్, 200 మీటర్ల పరుగుపందెంలో మూడు బంగారు పతకాలు, మంజుల షార్ట్పుట్లో రజతం, 5 కిలోమీటర్ల పరుగుపందెంలో రజతం, 40 ఏళ్ల విభాగంలో ఉమారాణి వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు సాధించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న మల్లేశ్ వంద మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 24 బంగారు పతకాలు, తొమ్మిది రజత పతకాలు సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ గెలుచుకుందని మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఆరెపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
గోదావరి ఖనిలో కార్డన్‌సెర్చ్
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం ఇందిరానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 60 లీటర్ల కిరోసిన్, క్వింటా బొగ్గును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఇంక్లయిన్ గనిలో ఎలక్ట్రిషియన్ హెల్పర్‌గా పని చేస్తున్న సమ్మయ్య (50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక స్లాబ్‌కు ఉరేసుకుని ఉండగా స్తానికులు గుర్తించారు. మతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమ్మయ్య కొంత కాలంగా మద్యానికి బానిస కాగా, కడుపునొప్పి, నడుమునొప్పి వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రాజీవ్ రహదారిపై లారీ బీభత్సం
కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖని సమీపంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఐరన్‌లోడ్‌తో చంద్రాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ గోదావరిఖని సమీపంలో చక్రం ఊడిపోవడంతో అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు లోకి దూసుకెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం, అయితే ఆ సయయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
టిప్పర్ ఢీ : వ్యక్తి మృతి
కరీంనగర్ : బొగ్గులోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బైక్‌ను ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని 5వ బొగ్గుగని సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు..కమాన్‌పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బైరీ మల్లేష్(32) గోదావరిఖనిలోని జీఎమ్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం బైక్‌పై గోదావరిఖని వస్తుండగా మూల మలుపు వద్ద టిప్పర్ ఢీ కొనడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (గోదావరిఖని) -
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అందు లో 4,300 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని, అయితే మిగిలిన దానికోసం యుద్ధ ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవస రం ఉందని సింగరేణి సంస్థ డెరైక్టర్లు వివేకానం ద (ఫైనాన్స్, (పా)), బి.రమేష్‌కుమార్ (ఆపరేషన్స్), ఎ.మనోహర్‌రావు (ప్రాజెక్టు, ప్లానింగ్) అన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లోటుగా ఏర్పడిన విద్యుత్‌ను అందించేందుకు జైపూర్‌లో 1200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని, అయితే వీటి కోసం ఏటా 9 మిలియన్ టన్నుల బొగ్గును అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2015-16లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60.30 మిలి యన్ టన్నులు నిర్ణయించిన నేపథ్యంలో భూగ ర్భ గనులు, ఓపెన్‌కాస్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడిని కలిసి సంస్థ, గని, ఓపెన్‌కాస్టులో ఉన్న స్థితిగతులను వివరించేందుకు మల్టీ డిపార్ట్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ త్వరలో నిర్దేశించిన ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం తన పెట్టుబడులను తానే సంపాదించుకుంటూ తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు ప్రణాళికలు రూపొందిం చిందన్నారు. భూగర్భ గనుల్లో ప్రతి కార్మికుడు తన ఎనిమిది గంటల సమయంలో కేవలం రెం డున్నర నుంచి మూడు గంటలు మాత్రమే పని చేస్తున్నారని, ఓపెన్‌కాస్టుల్లో యంత్రాలు రోజు లో 12 నుంచి 14 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ఇలా కాకుండా కార్మికులు, యంత్రాలను బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పని గంటలను పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతోపాటు ఎక్కువ బొగ్గు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి కార్మికుడికి తాము చేసే పని గురించి, సంస్థకు నిర్దేశించిన లక్ష్యాన్ని వివరిస్తూ కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా సహకారం అందించాలని కోరనున్న ట్లు తెలిపారు. మల్టీ డిపార్ట్మెంట్ కమిటీల్లో మైనింగ్, పర్సనల్, ఫైనాన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల నుంచి అధికారులు ఉంటార ని, వారు గనుల్లో, ప్రాజెక్టుల్లో బడ్జెట్ కు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు వివరా లు, రవాణా వివరాలు, ఓఎంఎస్, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి కార్మికులకు ఉద యం, మధ్యాహ్నం షిప్టుల ప్రారంభ సమయం లో వివరించి వారికి అవగాహన కల్పిస్తారన్నా రు. త్వరలో రానున్న ప్రైవేట్ బ్లాకుల నుంచి వెలికితీసే బొగ్గు చౌకగా లభించడం, విదేశీ బొగ్గు దిగుమతి, సింగరేణి బొగ్గును సిమెంట్ కంపెనీలు వాడకపోవడం, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో సింగరేణిలో బొగ్గుకు డిమాండ్ తగ్గనున్నదని, ఈ క్రమంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని కార్మికులకు తెలుపనున్నారన్నారు. వచ్చే మా ర్చి 31 నాటికి ఈ ప్రక్రియ ప్రతి రోజు జరుగుతుందన్నారు. కాగా, తొలుత అధికారులు, కార్మిక సంఘాల నాయకుల నుంచి సూచనలు తీసుకునేందుకు మొదటిసారిగా శనివారం గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమాలోచన సమావేశాన్ని నిర్వహించి సలహాలు స్వీకరించారు. కార్పొరేట్ పర్సనల్ జీఎం సి.మల్లయ్యపంతులు, జీఎంలు సుగుణాకర్‌రెడ్డి, సుభానీ, వెంకట్రామయ్య, భాస్కర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, మేరుగు రవీందర్‌రెడ్డి, గోవర్దన్, ఆరెళ్లి పోషం, ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్య, హెచ్ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఐఎన్టీయూసీ నాయకుడు డాలయ్య పాల్గొన్నారు. -
కోల్‌బెల్ట్‌కు జలగండం
గోదావరిఖని : రామగుండం ప్రాంతంలో రానున్న వేసవిలో తాగునీటికి కటకటాలు తప్పేలా లేవు. చలికాలంలోనే నీటి ఎద్దడి తీవ్రత పెరుగుతుండడంతో వేసవిలో నీటిగండం ఎలా ఉంటుందో ఊహించని విధంగా తయారైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరిలో ప్రవాహం లేక నది పూర్తిగా ఎండిపోయింది. కనుచూపు మేరలో గోదారమ్మ ఎడారిని తలపిస్తోంది. దీంతో ఊట నీటినే ఫిల్టర్ చేసి ప్రజలకు అందించాల్సిన పరిస్థితి ఇటు కార్పొరేషన్‌కు, అటు సింగరేణి యాజమాన్యానికి ఏర్పడింది. 2004లో ఎల్లంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన తరుణంలోనే భవిష్యత్‌లో కోల్‌బెల్ట్ ప్రాంతానికి తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారులకు తెలుసు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినప్పటికీ కార్పొరేషన్, సింగరేణి యంత్రాంగం దృష్టి సారించకపోవడం వల్ల సమస్య జటిలంగా మారింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో సుమా రు 15వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గోదావరినది ఒడ్డున గల ఫిల్టర్‌బెడ్ ద్వారా 135 హెచ్ పీ సామర్థ్యం గల మోటార్‌తో నీటిని తోడి శారదానగర్‌లోని ట్యాంకుకు చేరుస్తారు. అక్కడినుంచి వివిధ ప్రాంతాలలో గల ట్యాంకులకు సమయానుకూలంగా నీటిని అందిస్తారు. అయి తే ప్రస్తుతం గోదావరినదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నదిలో ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ సమీపంలో నీటికోసం గుంతలు తవ్వి ఊట నీటిని ఫిల్టర్బెడ్లోకి పంపింగ్ చేస్తున్నారు. అక్కడినుంచి పలు కాలనీలకు నీటిని అంది స్తుండగా మరికొన్ని కాలనీలకు ట్యాంకర్లతో నీరందించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రత్యామ్నాయ చర్యలు ఫలించేనా..? ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు కార్పొరేషన్‌కు అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు పైపులైన్ నిర్మాణం చేపట్టేందుకు గతంలో జైపూర్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేపట్టింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చింది. నివేదికను గత ప్రభుత్వానికి పంపగా దానిని పక్కనపెట్టేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మేయర్, అధికారులు ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్‌లోకి వచ్చే కుందనపల్లి శివారులోని పైపులైన్ సిస్టర్న్ నుంచి రూ.20 కోట్లతో కార్పొరేషన్‌కు తాగునీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించగా సహకారాన్ని అందిస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. ఈ ఫైల్ సీఎం పేషీలో ఉంది. పట్టింపులేని సింగరేణి సింగరేణి సంస్థ గోదావరినది ఇంటెక్వెల్ నుంచి ఆర్జీ-1,2,3 డివిజన్ల పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీ వరకు 21.90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపు 20వేల క్వార్టర్లకు, మరో 20వేల ప్రైవేటు గృహాలకు నల్లా నీటిని అందిస్తోంది. గోదావరినది వద్ద గల ఫిల్టర్‌బెడ్ నుంచి 240 హెచ్‌పీ సామర్థ్యం గల మూడు మోటర్లను నిరంతరం నడిపిస్తోంది. 18 మెగావాట్ల పవర్‌హౌస్‌కు సైతం రా వాటర్‌ను గోదావరినది నుంచే తరలిస్తున్నారు. ప్రస్తుతం నది ఎండిపోగా.. ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల నుంచి ఊటగా వచ్చే నీటిని ఇంటేక్‌వెల్‌లో ఫిల్టర్ చేస్తూ క్వార్టర్లకు సరఫరా చేస్తున్నారు. మూడేళ్లుగా వేసవి కాలంలో గోదావరినది ఎండిపోతుంటే సుమారు 40 బోర్లను వేసి నీటిని తోడుతున్నారే తప్ప ప్రత్యామ్నాయ చర్యల గురించి మాత్రం ఆలోచించడం లేదు. ప్రభుత్వం సింగరేణి సంస్థ తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాడుకునేందుకు ఒక టీఎంసీ నీటిని కేటాయించింది. ప్రాజెక్టు నుంచి గోదావరినది ఒడ్డున ఫిల్టర్‌బెడ్ వరకు పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.100 కోట్ల వ్యయం అవుతుండడంతో సింగరేణి యాజమాన్యం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. గోదావరినది ఎండిపోయిన ప్రతిసారి సింగరేణి భూగర్భగనుల్లో ఊటగా ఏర్పడే నీటిని ఉపరితలానికి పంపించి అక్కడినుంచి ఫిల్టర్బెడ్లకు తరలించి శుద్ధిచేసి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం యైటింక్లయిన్‌కాలనీకి గనుల నుంచి వచ్చిన నీటినే సరాఫరా చేస్తున్నట్టు కార్మిక కుటుంబాలు పేర్కొంటున్నాయి. శాశ్వత చర్యలేవీ..? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఇటు కార్పొరేషన్ గానీ, అటు సింగరేణి గానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్ద గల సిస్టర్న్ నుంచి నది నీటిని తీసుకోవడానికి ఇబ్బంది లేకపోయినా రిజర్వాయర్‌కు ఏడాది పొడువునా నీటి సరఫరా జరగదు. అలాంటి సందర్భంలో రిజర్వాయర్‌కు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు శాశ్వతంగా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. సింగరేణి సంస్థ కూడా గనుల ఊట నీటిని తాగునీటిగా అందించే ప్రయత్నం చేస్తే నీటిలోని మందం (పార్ట్స్ ఫర్ మిలియన్ -పీపీఎం) ఎక్కువగా ఉంటే అది తాగేందుకు పనికిరాకుండా పోతుంది. అలాగే శారీరక నొప్పులతో లేనిరోగాలను కొనితెచ్చుకున్నట్టవుతుంది. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం సైతం ఎల్లంపల్లి నుంచి పైప్‌లైన్ నిర్మాణం చేపడితేనే గని కార్మికులు, వారి కుటుంబాలకు దాహార్తిని తీర్చినట్టువుతుంది. ఆ దిశగా సింగరేణి, కార్పొరేషన్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ఖనిలో అగ్నిప్రమాదం: 20 దుకాణాలు దగ్ధం
కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్‌లోని దుకాణాల సముదాయంలో శుక్రవారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు దగ్దమైనాయి. రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీలిచిత్రాలు తీసిన వ్యక్తి అరెస్ట్
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో నీలిచిత్రాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్ర రమేశ్ అనే ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గోదావరిఖని డీఎస్పీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక లక్ష్మీనగర్‌లో మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రమేశ్ ఇద్దరు మహిళలను అశ్లీలంగా వీడియో తీశాడు. వీటిలో తాను కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ అశ్లీల చిత్రాలను ఇతర మొబైల్స్‌కు బ్లూటూత్ ద్వారా పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ పోలీసులు సుమోటోగా కేసు దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నీలిచిత్రాలను ఉద్దేశపూర్వకంగా తీసినట్లు తేలింది. వీటిని అడ్డుపెట్టుకుని ఆ మహిళలను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడా? ఇతడికి ఇంకెవరైనా సహకరించారా? ఈయన బారినపడిన మహిళలు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని డీఎస్పీ చెప్పారు. రమేశ్‌పై నిర్భయ చట్టంతోపాటు 292 సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. మహిళలను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసినా, తీస్తున్నట్లు తెలిసినా తనకు(94407 95133) సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారికి రివార్డు ఇస్తామని, వీరితోపాటు బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సకాలంలో సమాచారం ఇస్తే బాధితులకు నష్టాన్ని తగ్గించే వీలుంటుందని, బాధితులు పబ్లిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందిస్తానని పేర్కొన్నారు. -
గులాబీ జెండా?
గోదావరిఖని, న్యూస్‌లైన్: రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తొమ్మిది మంది స్వతంత్ర సభ్యులు, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల సహకారంతో టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన మెజారిటీ ఇండిపెండెంట్ సభ్యులను టీఆర్ఎస్ చాకచక్యంతా తనవైపు తిప్పుకుంది. చివరకు వారందరిని టీఆర్ఎస్లో చేర్చుకుని 12వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తు తం 14 మంది టీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ, తొమ్మి ది మంది స్వతంత్ర కార్పొరేటర్లతో టీఆర్ఎస్ క్యాంపు యానాంలో కొనసాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరై క్యాంపులో ఉన్న కార్పొరేటర్లతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ యన ఫోన్లో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. స్వతంత్ర కార్పొరేటర్లను ముందుగా టీఆర్ఎస్లో చేర్పించి, ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ గా ఎన్నుకోవాలని నిర్ణయించామని తెలి పా రు. రామగుండం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లకు టీఆర్ఎస్ 14, బీజేపీ రెండు స్థానాలను గెల్చుకోగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రె స్ పార్టీ తరఫున 19 మంది విజయం సాధిం చారు. స్వతంత్రంగా గెలిచిన వారిలో నుంచి తొమ్మిది మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ క్యాంపులో చేరిపోయారు. వారందరు 12వ డివిజన్ నుంచి గెలుపొందిన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్‌గా చేయాలని ఈ సమావేశంలో పట్టుబట్టారు. ఇందుకు టీఆర్ఎస్తో పాటు బీజేపీ సభ్యులు అంగీకరించారు. శిబి రంలో మొత్తం 25 మంది కార్పొరేటర్లు ఉండ గా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మె ల్యే ఓట్లతో టీఆర్ఎస్ సంఖ్యాబలం 27కు చేరనుంది. దీంతో రామగుండం మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయమైంది. ఇక డెప్యూటీ మేయర్ పదవిని టీఆర్ఎస్కు వదిలివేయగా... అభ్యర్థి ఎంపికను తమ సభ్యుల నిర్ణయానికే వదిలేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో సాగుతున్న తర్జనభర్జనలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లతో పాటు తొమ్మిదిమంది స్వతంత్ర కార్పొరేటర్ల ఖర్చులను మేయర్ అభ్యర్థి లక్ష్మీనారాయణ భరించుకోవాలని, డెప్యూటీ మేయర్ పదవిని ఆశించేవారు మిగతా 13 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ల ఖర్చును మోయాలని నిర్ణయించారు. 4న క్యాంపునకు కాంగ్రెస్ కార్పొరేటర్లు : రామగుండం మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీ నుంచి తమ కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ జి.వివేక్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ ఒకటవ తేదీన గోదావరిఖనిలో జరిగే సమావేశానికి హాజరై క్యాంపు విషయం నిర్ణయం తీసుకునే అవకాశముంది. 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు తోడు ఆరుగురు స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ ఇప్పటికే ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. వీరి సంఖ్య కూడా 25కు చేరగా, టీఆర్ఎస్ క్యాంపులోంచి ఎవరైనా రాకపోతారా.. అనే ఆశతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
సింగరేణిలో తేలని గుర్తింపు లొల్లి
సింగరేణి సంస్థలో తెలంగాణ వాదంతో గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఏర్పడిన అంతర్గత నాయకత్వ సమస్య కార్మికుల పాలిట శాపంగా మారింది. తమ పెత్తనం సాగాలనే ఉద్దేశంతో ఇద్దరు నాయకులు తమ బలాన్ని నిరూపించుకునే క్రమంలో వారి మధ్య గొడవ కోర్టుకు చేరడంతో కార్మికుల సమస్యలన్నీ గాలిలో కలిసిపోయాయి. గోదావరిఖని, న్యూస్‌లైన్ : 2012 జూన్ 28న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గెలుపొందింది. ఆనాటి నుంచి ఏడాది పాటు సాఫీగానే సాగగా... 2013 ఏప్రిల్ నుంచి యూనియన్‌లోని ఇద్దరు అగ్ర నాయకులు కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి మధ్య వైరం మొదలైంది. దీంతో సమావేశాలు నిర్వహించుకుని ఒకరినొకరు తొలగించినట్టు ప్రకటించారు. చివరకు కోర్టు సూచన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యూనియన్‌కు చెందిన ఆరుగురు ఆఫీస్ బేరర్లకు గోదావరిఖనిలో అంతర్గత ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు, ప్రధానకార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ గెలుపొందింది. కానీ వారికి అధికారపూర్వకంగా కోర్టు నుంచి లేఖ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏరియాల వారీగా ఉపాధ్యక్షులను కొనసాగించాలని ఆ ఏరియాల ఉపాధ్యక్షులు, అలాగే ఎన్నికలు నిర్వహించే అధికారం సెంట్రల్ లేబర్ కమిషనర్‌కు లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సమస్య ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీనివల్ల 2013 ఏప్రిల్ నుంచి గనులు, డిపార్ట్మెంట్లు, ఏరియాల వారీగా కార్పొరేట్ స్థాయిలో జరగాల్సిన స్ట్రక్చర్డ్ సమావేశాలు నిర్వహించకపోవడంతో కార్మికుల సమస్యలు అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. కార్మికుల ప్రమోషన్లు, మ్యాచింగ్ గ్రాంట్‌పై నిర్ణయం తదితర అంశాలన్నీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలతో కూడా యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో నిర్వహించాల్సిన జేసీసీ సమావేశాలు జరగకపోవడంతో ఆయా సంఘాల నాయకులు కేవలం ఏరియాల స్థాయిలో జరిగే సమావేశాల్లోనే సమస్యలను విన్నవించాల్సి వస్తోంది. టీబీజీకేఎస్‌లో ఏర్పడిన అంతర్గత నాయకత్వ పోరును పరిష్కరించేందుకు గతం నుంచి టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జూన్ 2 తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడనుండగా.. శనివారం కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీబీజీకేఎస్‌లోని కెంగెర్ల మల్లయ్య వర్గం కలిసింది. ఈ సందర్భంగా జూన్ 2 తర్వాత యూనియన్ అంతర్గత సమస్య పరిష్కారం చేస్తానని కేసీఆర్ వారికి హమీ ఇచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలోనైనా యూనియన్ సమస్య సమిసిపోతే తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని 65 వేల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
కొత్త సర్కారుపై కోటి ఆశలు
గోదావరిఖని,న్యూస్‌లైన్: సింగరేణి కార్మికులు కారుకు జైకొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా గులాబీకి పట్టం కట్టారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, ఐదు లోక్‌సభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల టీఆర్ఎస్ను గెలిపించారు. ఉద్యమ ప్రస్థానంలో అడుగడుగునా అండగా నిలిచి.. ఇప్పుడు అధికారం అప్పగించడంలో ముందున్న సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పార్టీ ప్రజాప్రతినిధులపైనే ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. సింగరేణి వ్యాప్తంగా 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజె క్టులు ఉండగా, 64వేల మంది కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తూ అటు ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. అయినప్పటికీ గనికార్మికుల జీవితాలు దినదినగండానే గడుస్తున్నాయి. సింగరేణి ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక సమస్యలతో నల్లసూరీళ్లు సతమతమవుతున్నారు. కార్మికుల సమస్యలను ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరిచిపోయి శ్రమజీవుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. సింగరేణిలో కొలువుదీరిన స్థానికేతర అధికారులు, ఉన్నతాధికారులు స్థానిక కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ అవమానాలు, అణిచివేతల కారణంగా ఆక్రోశంతో రగిలిపోతున్న కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైన తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టారు. కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో సింగరేణి సంస్థ విస్తరించి ఉండగా, రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న గనికార్మికులు అక్కడ సైతం గులాబీ జెండానే ఎగురవేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కారుకు పట్టం కట్టారు. దీంతోపాటు పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాద్‌లలో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ తమ సమస్యలకు విముక్తి కలుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక కార్మికులు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనే ఉంది. ఎంపీల గురుతర బాధ్యత ఇది... తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై సింగరేణి ప్రాంత అభివృద్ధితో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం చేయడాన్ని గురుతర బాధ్యత. లోక్‌సభకు పోటీ చేసిన టీఆర్ఎస్ సభ్యులు కోల్‌బెల్ట్ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలకు ఫనంగా పెట్టి పనిచేస్తున్న గని కార్మికులకు కూడా ఆదాయపు పన్ను మినహారుుంపు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 1998లో 1,09,000 మంది కార్మికులు పనిచేస్తే నేడు 64 వేలకు వారి సంఖ్య తగ్గింది. కార్మికుల నియూమక ప్రక్రియ చేపట్టాలి. కొత్తగా భూగర్భ గనులను ప్రారంభించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి. పనిఒత్తిడి కారణంగా విధులకు గైర్హాజరైన దాదాపు 10 వేల మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేసింది. వీరిలో ఇటీవల కొంత మందిని విధులకు తీసుకున్నా వేలాది మంది రోడ్లపైనే బతుకీడుస్తున్నారు. డిస్మిస్ కార్మికులను కూడా బేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకునేలా యాజమాన్యంతో చర్చించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 35 రోజుల పాటు కార్మికులు సకల జనుల సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి వేలాది రూపాయలు వేతనాలను కోల్పోయారు. ఈ సందర్భంగా రూ. 25 వేలను సమ్మె అడ్వాన్స్ చెల్లించి తిరిగి వేతనాల నుంచి కోత విధించారు. ఆ సొమ్మును తిరిగి కార్మికులకు చెల్లించాలనే డిమాండ్‌ను ఎంపీలు తమ భూజాలపై వేసుకోవాలి. -
‘రాజిరెడ్డి' కే పట్టం
రాజిరెడ్డి ప్యానల్‌కు 4,582 ఓట్ల ఆధిక్యం టీబీజీకేఎస్ ఎన్నికల్లో ‘కెంగెర్ల’ ఓటమి హైకోర్టుకు ఫలితాల నివేదన గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో మిర్యాల రాజిరెడ్డి వర్గం ఘనవిజయం సాధించింది. గోదావరిఖనిలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం ఎన్నిక నిర్వహించగా.. 40,752 ఓట్లకు 24,532 ఓట్లు పోలయ్యాయి. అదేరాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వర కు ఓట్లు లెక్కించారు. రాజిరెడ్డి వర్గానికి 14,499 ఓట్లు, కెంగెర్ల మల్లయ్య వర్గానికి 9,917ఓట్లు లభిం చాయి. మరో 116ఓట్లు చెల్లకుండా పోయాయి. మొ త్తంగా మల్లయ్య ప్యానెల్‌పై రాజిరెడ్డి ప్యానెల్ 4,582 ఓట్ల మెజారిటీ సాధించింది. గెలుపొందిన ప్యానెల్లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు (కొత్తగూడెం), ఉపాధ్యక్షుడిగా ఏనుగు రవీందర్‌రెడ్డి (శ్రీరాంపూర్), ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి (ఆర్జీ-3), సంయుక్త కార్యదర్శిగా మేడిపల్లి సంపత్ (మందమర్రి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.ఆగయ్య (భూపాలపల్లి), కోశాధికారిగా కె.సారంగపాణి (భూపాలపల్లి) ఉన్నారు. లేబర్ కమిషనర్ (సెంట్రల్) రీజినల్ పీఎం శ్రీవాస్తవ ఓట్ల వివరాల పత్రాన్ని ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి, ఇతర ప్యానెల్ నాయకులకు అందించారు. ఫలితాలను హైకోర్టుకు నివేదిస్తానని, అక్కడినుంచే ఎన్నికైన వారి సమాచారం అధికారికంగా వస్తుందని తెలిపారు. కార్మికుల భారీ ర్యాలీ ఫలితాల ప్రకటన అనంతరం టీబీజీకేఎస్ శ్రేణులు, ఐఎన్టీయూ, ఏఐటీయూసీ, దళిత, ఇతర సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రంగులు చ ల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ.. ఆర్జీ-1 కమ్యూనిటీహాల్ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ మద్దతిచ్చినా ఓడిన ‘కెంగెర్ల’ టీబీజీకేఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కెంగెర్ల మల్లయ్య ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, నల్లాల ఓదెలు, ఎంపీ వివేక్ బహిరంగంగా ప్రకటించారు. అయినా కార్మికులు మల్లయ్య, ఆయన ప్యానెల్‌కు చెక్‌పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తరుణంలో టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఒకే యూనియన్‌లో ఓ వర్గానికి పార్టీ మద్దతిచ్చినా ఓడిన విషయమై పార్టీలో చర్చనీయాంశమైంది. దీని ప్రభావం త్వరలో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇది కార్మికుల విజయం తమ గెలుపు ముమ్మాటికీ కార్మికుల విజయమేనని టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో గెలిచిన యూనియన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. కార్మిక సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. సింగరేణిని రక్షించుకునేందుకు సికాస తరహాలో పనిచేస్తామన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలువనున్నట్లు వెల్లడించారు. -
గెలుపెవరిదో..?
గోదావరిఖని, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులైన సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు తరలిరావడంతో గోదావరిఖనిలో రోజంతా సందడి నెలకొంది. టీబీజీకేఎస్‌లో తలెత్తిన నాయకత్వ వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ పీఎం శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్యానల్ టోపీ, లైటు గుర్తుపై, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ తట్టాచెమ్మస్ గుర్తుపై తలపడ్డాయి. సింగరేణి వ్యాప్తంగా సంఘ సభ్యులైన 40,752 మందికి ఓటుహక్కు ఉండగా, వీరిలో 24,532 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 60.19 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం రీజియన్‌లో అత్యధికంగా 74.4 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా కొత్తగూడెం రీజియన్‌లో 37.4 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లోని 26 బూత్‌లలో పోలింగ్ నిర్వహించారు. పలు కేంద్రాల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండి, బూత్‌ల సంఖ్య తక్కువగా ఉండడంతో రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు క్యూలైన్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సెయింట్‌పాల్ స్కూల్, గంగానగర్ సింగరేణి స్కూల్లో లైన్లో నిలుచున్న కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గోదావరిఖని డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మహేందర్‌జీ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. రెండు ప్యానళ్ల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. కార్మికుల ఓట్లను పొందేందుకు ఆయావర్గాలు మద్యం బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య వల్ల అంతర్గత ఎన్నికలు నిర్వహించడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సంఘం నాయకత్వ వివాదం హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎన్నికల ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. -
గెలుపెవరిదో..?
గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులైన సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు తరలిరావడంతో గోదావరిఖనిలో రోజంతా సందడి నెలకొంది. టీబీజీకేఎస్‌లో తలెత్తిన నాయకత్వ వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ పీఎం శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్యానల్ టోపీ, లైటు గుర్తుపై, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ తట్టాచెమ్మస్ గుర్తుపై తలపడ్డాయి. సింగరేణి వ్యాప్తంగా సంఘ సభ్యులైన 40,752 మందికి ఓటుహక్కు ఉండగా, వీరిలో 24,532 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 60.19 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం రీజియన్‌లో అత్యధికంగా 74.4 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా కొత్తగూడెం రీజియన్‌లో 37.4 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లోని 26 బూత్‌లలో పోలింగ్ నిర్వహించారు. పలు కేంద్రాల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండి, బూత్‌ల సంఖ్య తక్కువగా ఉండడంతో రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు క్యూలైన్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సెయింట్‌పాల్ స్కూల్, గంగానగర్ సింగరేణి స్కూల్లో లైన్లో నిలుచున్న కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గోదావరిఖని డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మహేందర్‌జీ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. రెండు ప్యానళ్ల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. కార్మికుల ఓట్లను పొందేందుకు ఆయావర్గాలు మద్యం బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య వల్ల అంతర్గత ఎన్నికలు నిర్వహించడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సంఘం నాయకత్వ వివాదం హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎన్నికల ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. -
నేడు గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎ స్ ఎన్నికలు గోదావరిఖని వేదికగా ఆదివారం జరుగనున్నాయి. అయితే ఎన్నికల్లో గెలుపొం దేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల నాయకులు గనుల వద్ద ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న తమ యూనియన్ సభ్యులను కలుసుకుని తమకే ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులను గోదావరిఖనికి తరలించేందు ఆయా వర్గాల నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. 2012 జూన్ 28వ తేదీన జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆ తర్వాత వివిధ కమిటీ ల్లో నాయకుల కు పదవులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించారని ద్వితీయశ్రేణి నాయకత్వం కినుక వహించింది. దీంతో వారందరూ సింగరేణి వ్యాప్తంగా ఏకం కాగా, వారికి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నాయకత్వం వహించారు. చివరకు అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించినట్లు సమావేశాల్లో ప్రకటించి కోర్టును ఆశ్రయించ డంతో సింగరేణిలో వర్గపోరు నెలకొంది. ఈ మేరకు హైకోర్టు సూచన మేరకు ఆదివారం రీజినల్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో గోదావరిఖనిలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆర్ఎల్సీ ఐదు కేంద్రాల్లో 11 డివిజన్లకు చెందిన కార్మికులు ఓటు వేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. కాగా శనివారం సాయంత్రం పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బందిని ఆర్ఎల్సీ శ్రీవాస్తవ, డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఆయా సెంటర్లకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సామగ్రితో తరలించారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియా ఓట్లే కీలకం... ఇదిలా ఉండగా, సింగరేణి గుర్తింపు సంఘం అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో సింగరేణిలోని 11 డివిజన్లకు చెందిన 40,752 మంది మంది ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ రామగుండం ఏరియాలోని 10,451 మంది, శ్రీరాంపూర్ ఏరియాలోని 12,358 మంది కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో పోటీ చేస్తున్న అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గాల ప్యానెళ్లు ఈ రెండు ఏరియాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, శ్రీరాం పూర్ డివిజన్లు గోదావరిఖనికి సమీపంలో ఉండడంతో సభ్య త్వం కలిగిన కార్మికులను ఎక్కువ మందిని తరలించే పనిలో రెండువర్గాల నాయకత్వం నిమగ్నమైంది. కాగా, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, కార్పొరేట్ నుంచి కూడా ఓటు హక్కు కలిగిన కార్మికులను బస్సుల ద్వా రా గోదావరిఖనికి తరలించేందుకు నాయకు లు ఏర్పాట్లు చేశారు. అయితే యాజమాన్యం ఆదివారం ప్లేడేను వర్తింపచేయడంతో కొంత మంది కార్మికులు విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. గనులపై ముగిసిన ప్రచారం... హైకోర్టు ఆదేశాల మేరకు రీజినల్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తున్న టీబీజీకేఎస్ ఆఫీస్ బేరర్ల ఎన్నికల ప్రచారం శనివారం నాటితో ముగి సింది. ఆయాగనులు, ఓపెన్కాస్ట్లపై కెంగెర్ల, మిర్యాల వర్గాల నాయకులు విస్తృతంగా ప్రచా రం చేపట్టి తమ గుర్తులకే ఓటువేయాలని కో రారు. కాగా, తమకు టీఆర్ఎస్ నాయకత్వం మద్దతు ప్రకటించిందని కార్మికులంతా తమకే ఓటు వేసి గెలిపిస్తారని అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య ధీమా వ్యక్తం చేస్తుండగా.. రెండేళ్ల పాలనలో మల్లయ్య కార్మికులకు చేసిందేమీ లేదని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారని, అందువల్ల కార్మికుల అండ తమకే ఉంద ని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి గెలుపు ధీమాలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
జాతరలో విషాదం
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖని వద్ద సమ్మక్క జాతరకు వచ్చిన ఓ యువకుడు గోదావరినదిలో మునిగి చనిపోయాడు. మహారాష్ట్ర గుగ్గూస్లోని ఇందిరానగర్‌కు చెందిన పోగుల రతన్(18), మెదక్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్టియర్ చదువుతున్నాడు. గోదావరిఖని ద్వారకానగర్‌లో ఉంటున్న పెద్దన్నాన్న, పెద్దమ్మ అరికిల్ల పీరయ్య-మల్లమ్మ ఇంటికి రెండ్రోజుల క్రితం వచ్చాడు. గురువారం రాత్రి పీరయ్య కుటుంబసభ్యులు సమ్మక్క జాతర కోసం స్థానిక గోదావరినది దగ్గరకు మొక్కులు తీర్చుకోవాడికి వచ్చి రాత్రి అక్కడే బసచేశారు. శుక్రవారం ఉదయం పీరయ్య కొడుకు కిషోర్, రతన్ కలిసి జాతరకు వచ్చారు. గోదావరిలో స్నానం చేసి వస్తామంటూ కిషోర్, రతన్ నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. కిషోర్ భయంతో అరుపులు వేయడంతో పక్కనే ఉన్న లింగాల రవి అనే యువకుడు అతడిని కాపాడాడు. అప్పటికే రతన్ నీటిలో గల్లంతయ్యాడు. సింగరేణి రెస్క్యూ బృందం, గజ ఈతగాళ్లు మూడు గంటలపాటు గాలించి రతన్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో బంధువులు గుండెలవిసేలా రోదించారు. రతన్ చిన్నప్పుడే తండ్రి మైసయ్య చనిపోయాడు. తల్లి సుగుణ అన్నీ తానై నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తోంది. రతన్ పెద్దన్నయ్య ప్రవీణ్‌కుమార్‌కు మార్చి 5న పెళ్లి జరగనుంది. ఇంట్లో అందరు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా, ఈ దుర్ఘటన జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రలోని స్వగ్రామానికి తరలించారు. మృతుడి పెద్దనాన్న పీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. జాతరకు వచ్చి జాడలేకపాయె.. హుజూరాబాద్, న్యూస్‌లైన్ : పదో తరగతిలో అత్యధిక మార్కులు రావాలని, తన కుటుంబం సల్లంగ ఉండాలని సమ్మక్క, సారక్క ఆశీర్వాదం కోసం జాతరకు వచ్చిన ఆ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటకు చెందిన రాగినేని రాములు హమాలీ పని నిమిత్తం తిమ్మాపూర్ మండలం అల్గునూరుకు వలస వెళ్లాడు. అక్కడ కామధేనువు రైస్‌మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. రాములు ఒక్కగానొక్క కొడుకు వెంకటేష్(15) అల్గునూరులో పదో తరగతి చదువుతున్నాడు. హుజూరాబాద్‌లోని రంగనాయకుల గుట్ట వద్ద జరిగే సమ్మక్క జాతరకు గురువారం సాయంత్రం కుటుంబంతో వచ్చాడు. జాతరలో బసచేసి, శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసమని తన మేనమామతో కలిసి ఆటోలో హుజూరాబాద్ శివారులోని కొత్తపల్లి కాకతీయ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువలోకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడ్డాడు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో గల్లంతై ఆచూకీ లేకుండా పోయాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు లక్ష్మి, రాములులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలువకు నీటి విడుదల ఆపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని బంధువులు తెలిపారు. నీటిని ఆపితేనే మృతదేహం దొరికే అవకాశముంది. సమ్మక్కకు చివరి మొక్కు.. ఓబులాపూర్(సిరిసిల్లరూరల్), న్యూస్‌లైన్: అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు సమ్మక్క-సారక్కలను దర్శించుకొని జాతరలోనే ఆత్మహత్యకు పాల్పడడం మండలంలోని ఓబులాపూర్‌లో విషాదాన్ని నింపింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన నేత కార్మికుడు బొల్లి రామరత్నం(47)కు ఇద్దరు భార్యలు ఉండగా, కుమారుడు, కుమార్తె సంతానం. సాంచాలు నడిపే రామరత్నం కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. దీనికితోడు రెండు నెలల క్రితం కుమార్తె మానస(23) ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్తాపం చెందిన రామరత్నం శుక్రవారం ఉదయం 9గంటలకు ఓబులాపూర్‌లోని సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లాడు. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత జాతరలోనే మద్యంసీసాలో నైట్రాప్ వేసుకొని తాగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో రామరత్నం కూర్చున్నవాడు కూర్చున్నట్లే మరణించాడు. సిరిసిల్ల టౌన్ సీఐ నాగేంద్రచారి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
డాక్టర్ డిస్మిస్
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : విధుల్లో నిర్లక్ష్యంపై వేటు పడింది. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని లేబర్ రూంలో గతేడాది నవంబర్ 3న ఏగోలపు కావ్య ఉరఫ్ సుమతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించిన ఘటనపై రాష్ట్ర వైద్య విధాన పరి షత్(ఏవీవీపీ) కమిషనర్ చర్యలు ప్రారంభించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలంది స్తున్న వైద్యుడు సంతోష్‌ను విధుల నుంచి తొలగించడంతోపాటు సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, నర్సింగ్ సిబ్బంది నాన్సీ, పుష్ప, స్వాతికి చార్జ్ మెమోలు జారీచేశారు. యైటింక్లయిన్‌కాలనీ పరిధి అల్లూరుకు చెందిన స్వామి భార్య కావ్యను నవంబర్ 2న పురిటినొప్పులు వస్తే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పారు. మరుసటి రోజు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి... అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో నర్సింగ్ సిబ్బందే పురుడు పోశారు. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన కావ్య తీవ్ర రక్తస్రావంతో అరగంటకు చనిపోయింది. ఘటనపై స్వామి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిషాలోని గ్లోబల్ హ్యుమన్ రైట్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. విచారణ చేయాలని హక్కుల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విచారణ నిర్వహించారు. రెండు ప్రత్యేక బృందాలు విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాయి. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనరేట్ నుంచి జారీ అయిన ఉత్తర్వు కాపీలను బుధవారం వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి పంపించినట్లు డీసీహెచ్ఎస్ అజ్మీరా భోజా తెలిపారు. ఇదే సంఘటనపై ఇటీవల తాత్కాలిక ఏఎన్ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్రను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌వో కొమురం బాబు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే చార్జ్ మెమోలు అందుకున్న సూపరింటెండెంట్, ముగ్గురు నర్సింగ్ సిబ్బంది కమిషనరేట్‌కు కావ్య మృతిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరణకు కమిషనరేట్ నుంచి సంతృప్తి చెందకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అధికారుల చర్యలతో ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
‘గుర్తింపు’ కార్డు తప్పనిసరి
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో ఏర్పడిన అంతర్గత నాయక సమస్యపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈనెల 23వ తేదీన గోదావరిఖనిలో ఏర్పాటు చేసే జనరల్ బాడీ సమావేశంలో ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ బుధవారం ఇక్కడికి వచ్చారు. స్థానిక సింగరేణి స్టేడియం, సెయింట్‌పాల్ హైస్కూల్, గంగానగర్ పాఠశాల, సింగరేణి కమ్యూనిటీ హాల్, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, ఆర్‌సీఓఏ క్లబ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 23న జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో పాల్గొననున్న కార్మికుల కు ఇబ్బందులు తలెత్తకుండా గోదావరిఖని లో అనుకూలంగా ఉండే పలు ప్రాంతాలను పరిశీలించామని, మొత్తం 25 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. ఈ ఎన్నికలకు రెవెన్యూ అధికారులను ఉపయోగిస్తున్నామని, వారికి ఈనెల 21వ తేదీన శిక్షణ ఇస్తామన్నారు. పోలీస్ సిబ్బం దిని ఎక్కువగా ఉపయోగించనున్నామని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో సంప్రదిస్తామ ని తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక లు నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించకుండా హైకోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నా రు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చంతా యూనియన్ ఖాతా నుంచి వాడనున్నామ ని, ఈ విషయాన్ని పోటీలో పడుతున్న ఇరువర్గాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. కొందరు నాయకులు గనులపైనే ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.. కార్మికులను అయోమయానికి గురిచేయవద్దని సూచించారు. చెక్ఆఫ్ సిస్టమ్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకా రం గుర్తింపు యూనియన్ యాజమాన్యాని కి ఇచ్చిన నివేదిక ప్రకారం 40,752 మంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఇందులో గుర్తింపు యూనియన్‌కు చందా చెల్లిస్తున్నట్లు కార్మికులు సైతం రాత పూర్వకంగా రాసి ఇచ్చారు.. వీరు ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది శాంతి భద్రతల సమస్యగా దారి తీస్తుంది.. తమ పరిధులు దాటి ఏ వర్గం వారైనా ఈ ప్రయత్నానికి పూనుకుంటే వారిపై హైకోర్టుకు నివేదిస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇరు వర్గాలు సహకరించాలి కోరారు. కార్మికులు యాజమాన్యం ఇచ్చిన ‘గుర్తింపు’ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఆర్ఎల్సీ వెంట ఏఎల్సీ ఆర్సీ సాహు, లేబర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పి.లక్ష్మణ్, వీకే ఖరే, నర్సయ్య, సింగరేణి పర్సనల్ జీఎం మల్లయ్యపంతులు, సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, అనిల్‌కుమార్, కె.ప్రకాశ్‌బాబు, అమానుల్లా తదితరులున్నారు. -
టార్గెట్ డౌటే..!
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనకబడుతోంది. అధికారుల ప్రణాళికాలోపంతో పన్నెండేళ్లుగా లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చిన రికార్డు చెదిరిపోయే ప్రమాదంలో పడింది. ఓబీ టెండర్ల జాప్యం, బొగ్గు రవాణాలో ఇబ్బందులు, పని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిర్దేశిత లక్ష్యసాధనకు రెండు నెలలు కూడా లేకపోవడంతో యాజమాన్యం ఆందోళనలో పడింది. గోదావరిఖని, న్యూస్‌లైన్ : కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించిన సింగరేణి సంస్థలో 35 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి 54.30 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు 43.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 38.85 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీశారు. అంటే గడిచిన పది నెలల కాలంలో లక్ష్యానికి 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడి ఉంది. లక్ష్యసాధనకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, మహాశివరాత్రితో 23 రోజులు, మార్చిలో ఐదు ఆదివారాలకు తోడు హోలీ, ఉగాది పండుగతో 24 రోజుల పనిదినాలున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు మూడు రోజులు సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. ఈ జాతరకు సింగరేణి ఉద్యోగులు భారీగా వెళ్తారు. ఈ లెక్కన రెండు నెలల్లో 44 రోజులే పని దినాలున్నాయి. ఈ రోజుల్లో గడిచిన కాలానికి వెనకబడిన 5 మిలియన్ టన్నులతోపాటు 10.45 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాల్సి ఉంటుంది. మొత్తం 15.45 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న లక్ష్యాన్ని రెండు నెలల్లో సాధించడం సింగరేణికి కష్టసాధ్యమని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు బొగ్గు ఉత్పత్తిని వెలికితీసేందుకు సంస్థ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. స్పెషల్ ప్యాకేజీలు, ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తూ ఉత్పత్తి మెరుగుపరిచేందుకు యత్నిస్తున్నా లక్ష్యం చేరడం అనుమానంగానే ఉంది. ఓబీ మట్టి తరలింపే సమస్య ఉత్పత్తిలో కొత్తగూడెం, ఎల్లందు, రామగుండం-3, బెల్లంపల్లి డివిజన్లు లక్ష్యాన్ని సాధించడంలో ముందున్నాయి. మణుగూరు, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా, భూపాలపల్లి, రామగుండం-1, రామగుండం-2, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు లక్ష్యసాధనలో వెనుకబడ్డాయి. ముఖ్యంగా పని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆర్జీ-1లోని మేడిపల్లి ఓసీపీలో 1.5 మిలియన్ టన్నులు, అడ్రియాల షాఫ్ట్బ్లాక్లో 2 మిలియన్ టన్నులు, కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు, భూపాలపల్లి ఓసీపీ, మణుగూర్ ఓపెన్‌కాస్ట్‌ల్లో సరైన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయారు. పలు ఓపెన్‌కాస్ట్‌ల్లో మట్టి తొలగింపు చేసే కాంట్రాక్టు సంస్థల టెండర్లు పూర్తి కాకపోవడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి జరగలేదు. బొగ్గు రవాణా సరిగ్గా సాగకపోవడంతో పలు సంస్థలు ఇతర సంస్థలు, విదేశీ బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ధర 230 డాలర్ల నుంచి 130 డాలర్లకు పడిపోవడంతో కర్ణాటకలోని పలు సిమెంట్ కంపెనీలు విదేశాల నుంచి వచ్చే బొగ్గును వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీకి ప్రతీసారి అదనంగా బొగ్గును రవాణా చేసే సింగరేణి సంస్థ ఈసారి ఎక్కువ బొగ్గును రవాణా చేయలేకపోయింది. దీంతో పలు సంస్థల యజమాన్యాలు సింగరేణిపై అసంతృప్తితో ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణాళికా లోపం ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి ప్రణాళికా లోపం ఉంది. ఓపెన్‌కాస్టుల్లో సమయానికి అనుకూలంగా ఓబీ టెండర్లు ఇవ్వాల్సి ఉండగా జాప్యం చేయడంతో మట్టి తరలింపు త్వరగా జరగడం లేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. ఇది లక్ష్యంపై ప్రభావం చూపుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల సమయంలోనే అంచనా వేసి ఉత్పత్తి మెరుగుపరిచేందుకు సరైన ప్రణాళికలు వేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా 2000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చిన రికార్డును ఈ ఏడాది సింగరేణి కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటోంది. ఇన్సెంటివ్‌లు, స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించినా లక్ష్యం సాధించే పరిస్థితి లేదు. గతేడాది లక్ష్యం 54 మిలియన్ టన్నులు కాగా, 53.19 మిలియన్ టన్నులు సాధించి లక్ష్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే సంస్థాగత లక్ష్యం 53 మిలియన్ టన్నులే కావడంతో లక్ష్యాన్ని సాధించినట్లుగానే పరిగణించారు. ఇలా చేస్తే ఉత్పత్తి మెరుగు సమయం వృథా కాకుండా ఉత్పత్తి ఎక్కువ చేయడం. గనులు, ఓపెన్‌కాస్టుల్లో ఉన్న మిషన్లు ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక. ఓబీ కాంట్రాక్టర్లు మట్టి తీశాక కొంతకాలానికి అక్కడ బొగ్గు తీసేవారు. ఇప్పుడు ఓబీ మట్టి తీశాక వెంటనే ఆ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి చేయడం.