గోదావరిఖని, న్యూస్‌లైన్ : గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో శనివా రం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగిం ది. 16 దుకాణాల్లోని సుమారు రూ.22 లక్షల విలువైన కూరగాయలు, మసాలా దినుసులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు, బాధితులు తెలి పిన ప్రకారం.. కొత్త కూరగాయల మార్కెట్‌లోని ఇబ్రహీమ్, రమేశ్, అమీరోద్దీన్, వెంకటేశ్, యాకూబ్, కన్నం మల్లయ్య, రమాదేవి, దేవేందర్‌రెడ్డి, దేవేందర్, కేతమ్మ, రాజు, వేణుకు చెందిన 1, 2, 3, 4, 5, 6, 11, 12, 13, 14, 15, 16, డి-1(రెండు), డి-2(రెండు) నెం బర్ గల 16 దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హోల్‌సేల్ దుకాణాల వద్దకు వచ్చిన కూరగాయలు దింపుతున్న వ్యాపారులు గమనించి పోలీసు లు, ఫైర్‌సర్వీస్‌కు ఫోన్ చేశారు. వారు వెంటనే అక్కడకు చేరుకున్నా అప్పటికే సామగ్రి మొత్తం ఖాళీ బూడిదైంది. ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి మం టలు వ్యాపించగా ఆ వేడికి పైకప్పులు కూలి కిందపడ్డాయి.
ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే కొందరు దుండగులు కావాలనే దుకాణాలను దహనం చేశారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కూరగాయల మార్కెట్ సమీపంలో మద్యం దుకాణం ఉందని, అక్కడకు వచ్చే మందుబాబులు ఎవరైనా తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం రీలీఫ్ ఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తా : మంత్రి శ్రీధర్‌బాబు
బాధిత వ్యాపారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన మార్కెట్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు అగ్నిప్రమాద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం ఇవ్వలేదని, అయినా అధికారులతో చర్చించి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయా విభాగాల ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేయడంతోపాటు తక్షణ సహాయం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, కమిషనర్ రవీంద్రను ఆదేశించారు.
కాగా ‘మాకు రక్షణ కావాలి’, ‘సానుభూతివద్దు-తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలి’ అని బాధితులు ప్లకార్డులు చేతపట్టుకుని మంత్రి వద్ద తమ నిరసన తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేష న్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ పద్మయ్య, కమిషనర్ ఎస్.రవీంద్ర, డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగ య్య, వివిధ పార్టీల నాయకులు కోలేటి దామోదర్, బాబర్ సలీంపాష, కౌశిక హరి, కోరుకంటి చందర్, పాతిపెల్లి ఎల్లయ్య, రావుల రాజేందర్, నిమ్మకాయల ఏడుకొండలు, రాజేశ్‌శర్మ, ముప్పిడి సత్యప్రసాద్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
‘ఖని’మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
Published Mon, Nov 25 2013 3:59 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement