The risk of fire
-
మధ్యప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం
హోషంగబాద్(మధ్యప్రదేశ్): హోషంగబాద్లోని ఓ ఫైవుడ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పరిశ్రమలో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. -
అగ్ని ప్రమాదంలో బాలిక సజీవదహనం
కొల్లూరు (గుంటూరు): అగ్ని ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. ఈ ఘటన జిల్లాలోని కొల్లూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ కాలనీకి చెందిన కొలకలూరు గోపి కుమార్తె జ్యోతి (4) పిల్లలతో ఆడుకుంటూ తన మేనత్త అయిన చొప్పర శేషమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన జ్యోతి బయటకు వచ్చేలోపే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లోమంటలు చెలరేగాయి. బాలిక ఇంట్లో చిక్కుకుంది, మంటలు ఒక్కసారిగా ఇల్లంతా వ్యాపించడంతో స్థానికులు ఇంటి గోడను కూలగొట్టారు. అప్పటికే బాలిక పూర్తిగా మంటల్లో కాలిపోయి మృతి చెందింది. -
ఆయిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం
మేడ్చల్: షార్ట్‌సర్క్యూట్‌తో శనివారం మేడ్చల్‌లోని ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రూ.కోటి ఆస్తి నష్టం జరిగింది. సుప్రీం లూబ్రికెంట్స్ కంపెనీలో ఆయిల్ రీసైక్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఎగసిన మంటలు
కలప వ్యర్థాలకు నిప్పుఎగసిన మంటలు ఆకతాయిల పనే అంటున్న స్థానికులు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఊపిరి పీల్చుకున్న పరిసర ప్రాంత ప్రజలు విశాఖపట్నం: విశాఖ రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాం తీయులు ఆందోళన చెందారు. రైల్వే డీజిల్ లోకో షెడ్డుకు దగ్గరలో ఈ ప్రమా దం సంభవించింది. ఇక్కడికి సమీపంలో డీజిల్ ట్యాంకు ఉండటంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ద ట్టంగా వ్యాపించిన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో కారుచీకటి అలుముకుంది. ఇటీవల హుద్‌హుద్ తుపానుకు నేలకొరిగిన చెట్ల వ్యర్థాలను ఈ ప్రాంతం లో జీవీఎంసీ సిబ్బంది డంపింగ్ చేశారు. వాటినుంచి ఒక్కసారిగా మంటలు ఎగిశా యి. వెంటనే స్థానికులు 100, 101 నంబర్లకు సమాచారం అందించారు. సం ఘటన స్థలానికి జిల్లా అగ్నిమాకపక అధికారి మోహనరావు, సౌత్ డీసీపీ రాంగోపాల్‌నాయక్ చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వీటికి గాలి తోడవడంతో మంటలు అదుపులోకి రాలేదు. స్కైలిఫ్ట్ సహకారంతో నీటిని వెదజల్లి రాత్రి 7గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు , ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆకతాయిల చేష్టల వల్లే: రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్నిప్రమాదం సంభవించేం దుకు ఆకాతాయిల చేష్టలే కావచ్చని స్థాని కులు భావిస్తున్నారు. ఈ గ్రౌండ్‌కు పరి సర ప్రాంతాలనుంచి ఆటల నిమిత్తం వ స్తుంటారు. వీరిలో కలప వ్యర్థాలకు ని ప్పంటించి ఉండవచ్చని స్థానికులు తెలి పారు. కలప వ్యర్థాలు డంప్ చేసి మూడు నెలలు కావస్తున్నా వాటిని తరలించడం లో జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లనే ప్రమాదం సం భవించిందని స్థానికులు ఆరోపించారు. -
టపాసుల గోడౌన్లో అగ్ని ప్రమాదం
అబిడ్స్/దత్తాత్రేయనగర్: బేగంబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫీల్‌ఖానా నింబూ మార్కెట్ ఎదురుగా ఉన్న టపాసుల గోడౌన్లో శనివారం మధ్యాహ్నం భారీ మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుకాణ యజమాని టపాకాయలు విక్రయిస్తుండగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే భారీ శబ్దాలు రావడంతో స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులు పరుగులు పెట్టారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు రెండో, మూడో అంతస్తుల్లోని టాయిస్ గోడౌన్‌లోకి విస్తరించాయి. తోటి వ్యాపారులు దుకాణాలను మూసేసి మంటలు ఆర్పేందుకు సహకరించారు. లెసైన్ ్సలతోనే... శ్రీనివాస ఏజెన్సీ పేరిట రమేష్ గుప్తా చెన్నై ఎక్స్‌ప్లోజివ్ శాఖ లెసైన్స్‌తో టపాసుల హోల్‌సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. మొదటి అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ పెట్టడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఇనుప బక్కెట్లు, నీరు, మంటలు ఆర్పే పరికరాలు లేకపోవడంతో ఫైరింజన్లు వచ్చేవరకు మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. యజమానిపై కఠిన చర్యలు - డీసీపీ దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి మంటలను ఆర్పేందుకు సహకరించిన వ్యాపారులు, స్థానికులను ఆయన ప్రశంసించారు. టపాకాయల దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైదానాల్లోనే తాత్కాలిక టపాకాయల దుకాణాలకు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతి ఎలా వచ్చిందో పూర్తి విచారణ చేపడతామన్నారు. రమేష్ గుప్తా పై కేసు నమోదుచేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలు పాటించండి-ఫైర్ అధికారి టపాసుల దుకాణాల వారు నిబంధనలు పాటించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ అసిస్టెంట్ ఫైర్ అధికారి ఎం.భగవాన్‌రెడ్డి పేర్కొన్నారు. సమాచారం అందింన వెంటనే ఆరు ఫైరింజన్లను రప్పించామన్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వివరించారు. సంఘటనలు ఎన్నెన్నో... ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో టపాసుల దుకాణాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. ఐదేళ్ల క్రితం గోషామహాల్ చందన్‌వాడీలో ఓ ఇంట్లో టపాకాయలు తయారు చేస్తుండగా నలుగురు మృతి చెందారు. అలాగే మూడేళ్ల క్రితం బేగంబజార్ ఛత్రీ ప్రాంతంలోని హోల్‌సేల్ దుకాణంలో మంటలు చెలరేగి టపాకాయలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శాంతి ఫైర్ వర్క్స్ ఘటన సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు పలు ప్రకటనలు చేసినా అవి నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో వ్యాపారం.. అనుమతులు చెన్నైలో.. టపాకాయల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెన్నైలో ఎక్స్‌ప్లోజివ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ అనుమతి ఉంటేనే హోల్‌సేల్ దుకాణాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ శాఖ అనుమతి సునాయాసంగా తీసుకువస్తున్న కొంతమంది, జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
రూ. 7 లక్షల ఆస్తి నష్టం - మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది - శంషాబాద్ సమీపంలో ఘటన శంషాబాద్: ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో అగ్ని ప్రమాదం జరిగి రూ. 7 లక్షలు విలువ చేసే ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న వైష్ణో ప్లాస్టిక్ పరిశ్రమలో పాత ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేసి ముద్దలుగా తయారుచేస్తుంటారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. పరిశ్రమలో భారీ ఎత్తున పాత ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో మంటలు ఉధృతంగా వ్యాపించాయి. కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేయడానికి సుమారు రెండు గంటల పాటు సిబ్బంది కష్టపడ్డారు. కంపెనీలో ఉన్న ప్లాస్టిక్ కవర్ల పూర్తిగా కాలిపోవడంతో పాటు యంత్రాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ. 7 లక్షల మేరకు ఆస్తినష్టం జరిగిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లు తెరిచిన బీఎంసీ
సాక్షి, ముంబై : ఇటీవల అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ భవనానికి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. బహుళ అంతస్తుల భవనం ఆఖరు అంతస్తు వరకు చేరుకునేందుకు భారీ పొడవైన నిచ్చెనతో కూడిన ఫైరింజన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం 22 అంతస్తుల లోటస్ బిజినెస్ భవనాన్ని చుట్టుముట్టిన మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో ఒక జవాను మృతి చెందడం, 15 మంది గాయపడడంతో ఆ శాఖలో ఉన్న లోపాలేంటో బహిర్గతమయ్యాయి. రూ. 19.18 కోట్ల అంచనా త్వరలో 90 మీటర్ల ఎత్తున్న నిచ్చెనతో కూడిన కొత్త ఫైరింజన్‌ను కొనుగోలు చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనానికి రూ.19.18 కోట్లు ఖర్చవుతాయని అంచనవేశారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన బుధవారం స్థాయి సమితి ముందుకు రానుంది. ఈ నిచ్చెన ప్రత్యక్షంగా ముంబై అగ్నిమాపక శాఖ ఆధీనంలోకి వస్తే దేశంలోనే అత్యంత పొడవైన నిచ్చెన వాహనంగా గుర్తింపు లభించనుంది. భైకళ నుంచి వచ్చే సరికి.. ప్రస్తుతం బీఎంసీ వద్ద 68 మీటర్ల ఎత్తున్న నిచ్చెనతో కూడిన ఫైరింజన్ ఒకటే ఉంది. ఇది కేవలం 20వ అంతస్తు వరకే చేరుకుంటుంది. ఆపై అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బందికి భవనం మెట్ల ద్వారా పైకి వెళ్లాల్సి వస్త్తోంది. అప్పటికే దట్టమైన పొగ చుట్టుముడితే ప్రాణాల మీద ఆశ వదులు కోవాల్సిందే. ఇదిలాఉండగా 68 మీటర్ల ఎత్తున్న నిచ్చెన గల ఈ ఫైరింజన్ అగ్నిమాపక ప్రధాన కేంద్రమైన భైకళలో నిలిచి ఉంటుంది. నగరంలో ఎక్కడ బహుళ అంతస్తుల భవనానికి అగ్నిప్రమాదం జరిగినా భైకళ నుంచి ఈ ఫైరింజన్ వెళ్లాల్సిందే. విపరీతంగా పెరిగిపోయిన ఈ ట్రాఫిక్ జాంలో ఆ భారీ ఫైరింజన్ దారి వెతుక్కుంటూ ఈ మూల నుంచి ఆ మూలకు చేరుకోవాలంటే కసర త్తు చేయాల్సిందే. అప్పటికే జరగాల్సిన ఆస్తి, ప్రాణ నష్టం జరిగిపోతుంది. శివారులో మరో ఫైరింజన్ అదనంగా మరో ఫైరింజిన్ కొనుగోలు చేసి శివారు ప్రాంతంలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అగ్నిమాపక శాఖ చీఫ్ ఎ.ఎన్.వర్మ చెప్పారు. దీన్ని ఎలా వినియోగించాలో అందుకు అవసరమైన శిక్షణ అగ్నిమాపక సిబ్బందికి ఇవ్వనున్నారు. అందుకు ఇంజినీర్లను ఫిన్‌ల్యాండ్‌కు పంపిస్తారని వర్మ చెప్పారు. ఈ వాహనాన్ని ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన ‘బ్రాంటో స్కైలిఫ్ట్ ఓవాయ్ ఏబీ’ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేయనున్నారు. 500 కేజీల బరువును భరించే సామర్థ్యం ఈ నిచ్చెనలో ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నగరం, శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల (అద్దాల మేడలు) విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఆ ప్రకారం భవిష్యత్తులో ప్రమాదాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష!
ముంబై: వేసవి కాలం.. అగ్నికి ఆజ్యం పోసే కాలం. ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వింటూనే ఉంటాం. అనుకోకుండా మన దగ్గర ప్రమాదం జరిగితే ఒక్కోసారి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. ఆ అగ్ని ప్రమాదం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. కళ్లెదుటే సర్వస్వం బుగ్గి పాలవుతుంటే గుండెలు పగిలే వేదన అనుభవించాల్సి వస్తుంది. అప్పటి వరకు దర్జాగా జీవించిన వారు ప్రమాదం జరిగిన మరుక్షణమే కట్టుబట్టలతో రోడ్డున పడతారు. దిగువ, మధ్య తరగతి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడిపోతారు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఏమీ చేయలేని మనం అవి జరగకుండా మాత్రం ఎన్నైనా చేయగలం. కనీసం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎనలేని ఆస్తులు, ప్రాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలం. ప్రమాదాలను నివారించే వీలు కూడా ఉంటుంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ప్రమాదాలు దరికి రాకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు ఇంట్లోని వస్తువులు అల్మారాలు, షెల్పుల్లో సక్రమంగా ఉంచండి. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే గుణం ఉన్న వస్తువులు, సామగ్రి అందుబాటులో లేకుండా చూడాలి. కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పి వేయాలి. ఇంట్లో ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలు వాడాలి. పాడైన వైర్లు వాడొద్దు. ఓవర్‌లోడ్ వేయొద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లలో దాని సామర్థ్యానికి మించి ప్లగ్‌లను వాడొద్దు. పడుకుని పొగ తాగొద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులపై కుటుంబంతో బయటకు వెళ్తే ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. టపాకాయలు కాల్చే సమయంలో నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు. వేసవిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి, నేలరాలిన ఎండుటాకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్చి బయటపడేయాలి. {పమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వేసవికాలంలో రాత్రిళ్లు కరెంటు ఎక్కువగా పోతుంది. కరెంటు పోయినప్పుడు క్యాండిళ్లు, కిరోసిన్ దీపాలు వెలిగించి అలాగే నిద్ర పోతుంటాం. అలా కాకుండా పడుకునే ముందు వాటన్నింటిని ఆర్పి వేయాలి. తప్పదనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. {పమాదవశాత్తు నిప్పంటుకుంటే భయంతో పరుగెత్తకూడదు. దుప్పట్లు, తట్టులతో మంటలను కప్పేయాలి. వీలైనంత వరకు నేలపై దొర్లాలి. పాఠశాలలు, ఆస్పత్రుల్లో.. పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌లో ఆర్సీసీ లేదా కాంక్రిట్ స్లాబులనుమాత్రమే పైకప్పులుగా వాడాలి. ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి. పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునేందుకు సరైన ప్రణాళిక రచించి అది అందరికీ తెలిసే విధంగా తగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లే మార్గాల్లో(మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని వాడాలి. తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పు కలిగిన నిర్మాణాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహించరాదు. షార్ట్‌సర్క్యూట్ జరిగితే అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అమర్చుకోవాలి. అగ్ని ప్రమాదం అరికట్టడానికి సరిపడా నీరు, ఫిక్సిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా నిర్వహించాలి. కర్మాగారాల్లో.. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల ఉనికిని గుర్తించేలా ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి. అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. మిషనరీ బెల్టులు, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్క్యూట్లో ఓవర్ లోడ్ వేయకూడదు. మండే స్వభావం ఉన్న దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే.. {పమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి. విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగితే నీటిని ఉపయోగించకుండా పొడి ఇసుక లేదా మట్టి వాడాలి. ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పెళ్లి పందిళ్లు, ఇతర పందిళ్లు వేయాలి. పందిళ్ల చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ స్థలాన్ని ఉంచాలి. ఎలక్ట్రికల్ లైవ్ వైర్లు, పెండాల్స్కు కనీసం రెండు మీటర్ల దూరం ఉంచాలి. వంటింట్లో.. వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ట్యూబ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మార్చాలి. నాణ్యమైన ట్యూబ్లనే వాడాలి. గ్యాస్ స్టౌ ఎత్తయిన ఫ్లాట్‌ఫాంపై ఉండేలా చూసుకోవాలి. వంట గ్యాస్ వాడకం పూర్తి కాగానే రెగ్యులేటర్ వాల్వ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆపి వేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, ఆన్ ఆఫ్ చేయొద్దు. వెంటనే అగ్నిమాపక, గ్యాస్ కంపెనీల సాయం కోరాలి. మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయొద్దు. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివిస్టౌ దగ్గర నిల్వ ఉంచరాదు. గోదాముల్లో.. వస్తు నిల్వలను చెక్క స్లీపర్లపై నిల్వ చేయాలి. గోదాం బయట వస్తువులను నిల్వ చేయరాదు. పరిసర ప్రాంతాల్లో పొగతాగడం వంటివి నిషేధించాలి. వివిధ రకాల వస్తువులను స్టోరేజీ ర్యాకుల్లో విడివిడిగా నిల్వ చేయాలి. గోదాముల్లో తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. వస్తు నిల్వల మధ్యలో గ్యాంగ్వే, క్రాస్‌వే సెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది. వస్తువుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు ఆపివేయాలి. వస్తు నిల్వలు 4, 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు. తప్పనిసరి అయితే నిల్వలకు పెకప్పు కనీసం రెండు అడుగుల దూరం ఉంచాలి. గోదాం సమీపంలో తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష!
- అగ్నిప్రమాదాల నివారణలో అదే కీలకం - చిన్న చిన్న జాగ్రత్తలతో బతుకు భద్రం న్యూఢిల్లీ: వేసవి కాలం.. అగ్నికి ఆజ్యం పోసే కాలం. ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని వింటూనే ఉంటాం. అనుకోకుండా మన దగ్గర ప్రమాదం జరిగితే ఒక్కోసారి మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. ఆ అగ్ని ప్రమాదం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. కళ్లెదుటే సర్వస్వం బుగ్గి పాలవుతుంటే గుండెలు పగిలే వేదన అనుభవించాల్సి వస్తుంది. అప్పటి వరకు దర్జాగా జీవించిన వారు ప్రమాదం జరిగిన మరుక్షణమే కట్టుబట్టలతో రోడ్డున పడతారు. దిగువ, మధ్య తరగతి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడిపోతారు. తిరిగి గూడు సమకూర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఏమీ చేయలేని మనం అవి జరగకుండా మాత్రం ఎన్నైనా చేయగలం. కనీసం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎనలేని ఆస్తులు, ప్రాణాలు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకోగలం. ప్రమాదాలను నివారించే వీలు కూడా ఉంటుంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ప్రమాదాలు దరికి రాకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి పరిశీలిద్దాం. పాఠశాలలు, ఆస్పత్రుల్లో.. - పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌లో ఆర్సీసీ లేదా కాంక్రిట్ స్లాబులనుమాత్రమే పైకప్పులుగా వాడాలి. - ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. - సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి. - పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునేందుకు సరైన ప్రణాళిక రచించి అది అందరికీ తెలిసే విధంగా తగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లే మార్గాల్లో(మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి. - ఐఎస్ఐ మార్కు కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని వాడాలి. - తాటాకులు, గడ్డితో వేసిన పైకప్పు కలిగిన నిర్మాణాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహించరాదు. - షార్ట్‌సర్క్యూట్ జరిగితే అగ్నిప్రమాదం సంభవించకుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అమర్చుకోవాలి. - అగ్ని ప్రమాదం అరికట్టడానికి సరిపడా నీరు, ఫిక్సిడ్ ఫైర్ ఫైటింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలి. - ఫైర్ ఎవాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి తప్పకుండా నిర్వహించాలి. కర్మాగారాల్లో.. - పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల ఉనికిని గుర్తించేలా ప్రాథమిక పరిజ్ఞానం కల్పించాలి. - అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించాలి. మిషనరీ బెల్టులు, పుల్లీలు, విద్యుత్ పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్క్యూట్లో ఓవర్ లోడ్ వేయకూడదు. - మండే స్వభావం ఉన్న దుమ్ము, ధూళి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - కార్మికులు పనిచేసే చోట ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ద్వారాలు ఏర్పాటు చేయాలి. వంటింట్లో.. - వంటింట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. - గ్యాస్ సిలిండర్ ట్యూబ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మార్చాలి. నాణ్యమైన ట్యూబ్లనే వాడాలి. - గ్యాస్ స్టౌ ఎత్తయిన ఫ్లాట్‌ఫాంపై ఉండేలా చూసుకోవాలి. - వంట గ్యాస్ వాడకం పూర్తి కాగానే రెగ్యులేటర్ వాల్వ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. - గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ ఆపి వేయాలి. ఆ సమయంలో ఇంట్లో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, ఆన్ ఆఫ్ చేయొద్దు. వెంటనే అగ్నిమాపక, గ్యాస్ కంపెనీల సాయం కోరాలి. - మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయొద్దు. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివిస్టౌ దగ్గర నిల్వ ఉంచరాదు. గోదాముల్లో.. - వస్తు నిల్వలను చెక్క స్లీపర్లపై నిల్వ చేయాలి. - గోదాం బయట వస్తువులను నిల్వ చేయరాదు. పరిసర ప్రాంతాల్లో పొగతాగడం వంటివి నిషేధించాలి. - వివిధ రకాల వస్తువులను స్టోరేజీ ర్యాకుల్లో విడివిడిగా నిల్వ చేయాలి. - గోదాముల్లో తగినంత గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి. - వస్తు నిల్వల మధ్యలో గ్యాంగ్వే, క్రాస్‌వే సెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే మంచిది. - వస్తువుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు ఆపివేయాలి. - వస్తు నిల్వలు 4, 5 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు. తప్పనిసరి అయితే నిల్వలకు పెకప్పు కనీసం రెండు అడుగుల దూరం ఉంచాలి. - గోదాం సమీపంలో తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే.. - ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలి. - విద్యుత్ అగ్ని ప్రమాదం జరిగితే నీటిని ఉపయోగించకుండా పొడి ఇసుక లేదా మట్టి వాడాలి. - ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. - అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పెళ్లి పందిళ్లు, ఇతర పందిళ్లు వేయాలి. - పందిళ్ల చుట్టూ కనీసం 4.5 మీటర్ల ఖాళీ స్థలాన్ని ఉంచాలి. - ఎలక్ట్రికల్ లైవ్ వైర్లు, పెండాల్స్కు కనీసం రెండు మీటర్ల దూరం ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు - ఇంట్లోని వస్తువులు అల్మారాలు, షెల్పుల్లో సక్రమంగా ఉంచండి. ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. - చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే గుణం ఉన్న వస్తువులు, సామగ్రి అందుబాటులో లేకుండా చూడాలి. - కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలు పూర్తిగా ఆర్పి వేయాలి. - ఇంట్లో ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలు వాడాలి. - పాడైన వైర్లు వాడొద్దు. ఓవర్‌లోడ్ వేయొద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లలో దాని సామర్థ్యానికి మించి ప్లగ్‌లను వాడొద్దు. - పడుకుని పొగ తాగొద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు సెలవులపై కుటుంబంతో బయటకు వెళ్తే ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి. - టపాకాయలు కాల్చే సమయంలో నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు. - వేసవిలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎండుగడ్డి, నేలరాలిన ఎండుటాకులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఊడ్చి బయటపడేయాలి. - ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆర్పడానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - వేసవికాలంలో రాత్రిళ్లు కరెంటు ఎక్కువగా పోతుంది. కరెంటు పోయినప్పుడు క్యాండిళ్లు, కిరోసిన్ దీపాలు వెలిగించి అలాగే నిద్ర పోతుంటాం. అలా కాకుండా పడుకునే ముందు వాటన్నింటిని ఆర్పి వేయాలి. తప్పదనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. - ప్రమాదవశాత్తు నిప్పంటుకుంటే భయంతో పరుగెత్తకూడదు. దుప్పట్లు, తట్టులతో మంటలను కప్పేయాలి. వీలైనంత వరకు నేలపై దొర్లాలి. -
‘ఖని’మార్కెట్లో అగ్ని ప్రమాదం
గోదావరిఖని, న్యూస్‌లైన్ : గోదావరిఖని కూరగాయల మార్కెట్లో శనివా రం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగిం ది. 16 దుకాణాల్లోని సుమారు రూ.22 లక్షల విలువైన కూరగాయలు, మసాలా దినుసులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు, బాధితులు తెలి పిన ప్రకారం.. కొత్త కూరగాయల మార్కెట్లోని ఇబ్రహీమ్, రమేశ్, అమీరోద్దీన్, వెంకటేశ్, యాకూబ్, కన్నం మల్లయ్య, రమాదేవి, దేవేందర్‌రెడ్డి, దేవేందర్, కేతమ్మ, రాజు, వేణుకు చెందిన 1, 2, 3, 4, 5, 6, 11, 12, 13, 14, 15, 16, డి-1(రెండు), డి-2(రెండు) నెం బర్ గల 16 దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హోల్‌సేల్ దుకాణాల వద్దకు వచ్చిన కూరగాయలు దింపుతున్న వ్యాపారులు గమనించి పోలీసు లు, ఫైర్సర్వీస్కు ఫోన్ చేశారు. వారు వెంటనే అక్కడకు చేరుకున్నా అప్పటికే సామగ్రి మొత్తం ఖాళీ బూడిదైంది. ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి మం టలు వ్యాపించగా ఆ వేడికి పైకప్పులు కూలి కిందపడ్డాయి. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే కొందరు దుండగులు కావాలనే దుకాణాలను దహనం చేశారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కూరగాయల మార్కెట్ సమీపంలో మద్యం దుకాణం ఉందని, అక్కడకు వచ్చే మందుబాబులు ఎవరైనా తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రీలీఫ్ ఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తా : మంత్రి శ్రీధర్‌బాబు బాధిత వ్యాపారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన మార్కెట్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు అగ్నిప్రమాద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం ఇవ్వలేదని, అయినా అధికారులతో చర్చించి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయా విభాగాల ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేయడంతోపాటు తక్షణ సహాయం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, కమిషనర్ రవీంద్రను ఆదేశించారు. కాగా ‘మాకు రక్షణ కావాలి’, ‘సానుభూతివద్దు-తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలి’ అని బాధితులు ప్లకార్డులు చేతపట్టుకుని మంత్రి వద్ద తమ నిరసన తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేష న్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ పద్మయ్య, కమిషనర్ ఎస్.రవీంద్ర, డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగ య్య, వివిధ పార్టీల నాయకులు కోలేటి దామోదర్, బాబర్ సలీంపాష, కౌశిక హరి, కోరుకంటి చందర్, పాతిపెల్లి ఎల్లయ్య, రావుల రాజేందర్, నిమ్మకాయల ఏడుకొండలు, రాజేశ్‌శర్మ, ముప్పిడి సత్యప్రసాద్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
ఆయిల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం..
మంథని, న్యూస్‌లైన్ : మంథనిలోని బ్రిడ్జిరోడ్‌లో ఉన్న ధనలక్ష్మి ఆయిల్ అండ్ ఆటో స్టోర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఆదివారం దీపావళి పర్వదినం కావడంతో దుకాణం నిర్వాహకుడు కొంతం వెంకటేశ్వర్లు దీపం వెలిగించి వెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగి సమీపంలో ఉన్న ఇళ్లవైపునకు వ్యాపించాయి. స్థానికులు ఆ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులకు చేరవేయగా సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపకయంత్రం మంటలు ఆర్పేలోపే దుకాణంలో ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. ఆయిల్, వాహనాలకు వినియోగించే టైర్లు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. వివిధ వాహనాలకు సంబంధించిన విడిభాగాలు, ఆయిల్, టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పండగ సంబరంలో పట్టణ ప్రజలంతా మునిగితేలుతుండగా ప్రమాదం వార్త దాశానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టారు.