ఎగసిన మంటలు
కలప వ్యర్థాలకు నిప్పుఎగసిన మంటలు
ఆకతాయిల పనే అంటున్న స్థానికులు
అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఊపిరి పీల్చుకున్న పరిసర ప్రాంత ప్రజలు
విశాఖపట్నం: విశాఖ రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాం తీయులు ఆందోళన చెందారు. రైల్వే డీజిల్ లోకో షెడ్డుకు దగ్గరలో ఈ ప్రమా దం సంభవించింది. ఇక్కడికి సమీపంలో డీజిల్ ట్యాంకు ఉండటంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ద ట్టంగా వ్యాపించిన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో కారుచీకటి అలుముకుంది. ఇటీవల హుద్‌హుద్ తుపానుకు నేలకొరిగిన చెట్ల వ్యర్థాలను ఈ ప్రాంతం లో జీవీఎంసీ సిబ్బంది డంపింగ్ చేశారు. వాటినుంచి ఒక్కసారిగా మంటలు ఎగిశా యి. వెంటనే స్థానికులు 100, 101 నంబర్లకు సమాచారం అందించారు. సం ఘటన స్థలానికి జిల్లా అగ్నిమాకపక అధికారి మోహనరావు, సౌత్ డీసీపీ రాంగోపాల్‌నాయక్ చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వీటికి గాలి తోడవడంతో మంటలు అదుపులోకి రాలేదు. స్కైలిఫ్ట్ సహకారంతో నీటిని వెదజల్లి రాత్రి 7గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు , ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఆకతాయిల చేష్టల వల్లే: రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం సంభవించేం దుకు ఆకాతాయిల చేష్టలే కావచ్చని స్థాని కులు భావిస్తున్నారు. ఈ గ్రౌండ్‌కు పరి సర ప్రాంతాలనుంచి ఆటల నిమిత్తం వ స్తుంటారు. వీరిలో కలప వ్యర్థాలకు ని ప్పంటించి ఉండవచ్చని స్థానికులు తెలి పారు. కలప వ్యర్థాలు డంప్ చేసి మూడు నెలలు కావస్తున్నా వాటిని తరలించడం లో జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లనే ప్రమాదం సం భవించిందని స్థానికులు ఆరోపించారు.