ఆయిల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం.. | In oil store fire incident occur | Sakshi
Sakshi News home page

ఆయిల్ స్టోర్‌లో అగ్నిప్రమాదం..

Published Mon, Nov 4 2013 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

In oil store fire incident occur

మంథని, న్యూస్‌లైన్ : మంథనిలోని బ్రిడ్జిరోడ్‌లో ఉన్న ధనలక్ష్మి ఆయిల్ అండ్ ఆటో స్టోర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఆదివారం దీపావళి పర్వదినం కావడంతో దుకాణం నిర్వాహకుడు కొంతం వెంకటేశ్వర్లు దీపం వెలిగించి వెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగి సమీపంలో ఉన్న ఇళ్లవైపునకు వ్యాపించాయి. స్థానికులు ఆ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారులకు చేరవేయగా సరఫరా నిలిపివేశారు.
 
 అగ్నిమాపకయంత్రం మంటలు ఆర్పేలోపే దుకాణంలో ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. ఆయిల్, వాహనాలకు వినియోగించే టైర్లు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. వివిధ వాహనాలకు సంబంధించిన విడిభాగాలు, ఆయిల్, టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పండగ సంబరంలో పట్టణ ప్రజలంతా మునిగితేలుతుండగా ప్రమాదం వార్త దాశానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement