కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో గతేడాది నవంబర్ 3న ఏగోలపు కావ్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు ప్రారంభించారు. కావ్య ప్రసవించిన తర్వాత అం దుబాటులో లేరనే కారణంతో తాత్కాలిక ఏఎన్‌ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్రను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు శనివారం ప్రకటించారు.
ఈ ఘట నపై పలుదఫాలుగా విచారణ జరిపిన అధికారులు కేవలం కిందిస్థాయి సిబ్బం దిని బలి చేశారని ఆరోపణలు వస్తున్నా యి.ప్రసవం చేసింది కొందరైతే... తాత్కాలిక సిబ్బందిపై ఎలా చర్యలు తీసుకుంటారనేది పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సోమవారం ఆస్పత్రి ఎదుట ఆం దోళనకు వైద్య సిబ్బంది సిద్ధం అవుతున్న ట్లు సమాచారం. కాగా, కావ్య మృతికి గల పూర్తి వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించకపోవడం గమనార్హం.
పలు దఫాలుగా అధికారుల విచారణ
కావ్య మృతిపై వచ్చిన మీడియా కథనాలకు.. ఓడిషా రాష్ట్రంలోని గ్లోబల్ హ్యు మాన్‌రైట్స్ కమ్యూనికేషన్ సంస్థ స్పం దిం చింది. వైద్యులకు బదులు నర్సింగ్ సి బ్బంది ఎలా ఆపరేషన్ నిర్వాహించారని, దీనిపై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెంటనే దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు, గత నెల 18న ఆస్పత్రిలో నలుగురు వైద్యుల బృందం ప్రత్యేక విచారణ చేపట్టారు. పెద్దాపరేషన్ చేశారని వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. గత నెల 25న డీఎంహెచ్‌వో కొమురం బాలు కూడా స్వయంగా మరోసారి విచారణ జరిపారు.
ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతోపాటు ఆస్పత్రిలో ప్రసవం చేసిన నర్సింగ్ సిబ్బంది, మృతురాలి భర్తతో మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే కరీంనగర్‌లో గత నెల 28న డీఎంహెచ్ వో ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపారు. చివరికి తాత్కాలిక ఏఎన్‌ఎం సువర్ణ, ఆశ వర్కర్ సుభద్ర ను ఉద్యోగులను విధుల నుంచి తొల గిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని డీఎంహెచ్‌వో కొమురం బాలు శని వారం ప్రకటించారు. నిబంధనల ప్రకార మే చర్యలు తీసుకున్నామని డీఎంహెచ్‌వో వెల్లడించారు. కాగా, తదుపరి వేటు ఎవరిపై అనేది సస్పెన్‌సగా ఉంది.
కావ్య మృతిపై చర్యలు షురూ..
Published Mon, Feb 3 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement