గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అందు లో 4,300 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని, అయితే మిగిలిన దానికోసం యుద్ధ ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవస రం ఉందని సింగరేణి సంస్థ డెరైక్టర్లు వివేకానం ద (ఫైనాన్స్, (పా)), బి.రమేష్‌కుమార్ (ఆపరేషన్స్), ఎ.మనోహర్‌రావు (ప్రాజెక్టు, ప్లానింగ్) అన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లోటుగా ఏర్పడిన విద్యుత్‌ను అందించేందుకు జైపూర్‌లో 1200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని, అయితే వీటి కోసం ఏటా 9 మిలియన్ టన్నుల బొగ్గును అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2015-16లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60.30 మిలి యన్ టన్నులు నిర్ణయించిన నేపథ్యంలో భూగ ర్భ గనులు, ఓపెన్‌కాస్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడిని కలిసి సంస్థ, గని, ఓపెన్‌కాస్టులో ఉన్న స్థితిగతులను వివరించేందుకు మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ త్వరలో నిర్దేశించిన ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం తన పెట్టుబడులను తానే సంపాదించుకుంటూ తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని తీసేందుకు ప్రణాళికలు రూపొందిం చిందన్నారు. భూగర్భ గనుల్లో ప్రతి కార్మికుడు తన ఎనిమిది గంటల సమయంలో కేవలం రెం డున్నర నుంచి మూడు గంటలు మాత్రమే పని చేస్తున్నారని, ఓపెన్‌కాస్టుల్లో యంత్రాలు రోజు లో 12 నుంచి 14 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.
ఇలా కాకుండా కార్మికులు, యంత్రాలను బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పని గంటలను పెంచడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతోపాటు ఎక్కువ బొగ్గు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి కార్మికుడికి తాము చేసే పని గురించి, సంస్థకు నిర్దేశించిన లక్ష్యాన్ని వివరిస్తూ కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా సహకారం అందించాలని కోరనున్న ట్లు తెలిపారు. మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీల్లో మైనింగ్, పర్సనల్, ఫైనాన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల నుంచి అధికారులు ఉంటార ని, వారు గనుల్లో, ప్రాజెక్టుల్లో బడ్జెట్ కు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు వివరా లు, రవాణా వివరాలు, ఓఎంఎస్, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి కార్మికులకు ఉద యం, మధ్యాహ్నం షిప్టుల ప్రారంభ సమయం లో వివరించి వారికి అవగాహన కల్పిస్తారన్నా రు.
త్వరలో రానున్న ప్రైవేట్ బ్లాకుల నుంచి వెలికితీసే బొగ్గు చౌకగా లభించడం, విదేశీ బొగ్గు దిగుమతి, సింగరేణి బొగ్గును సిమెంట్ కంపెనీలు వాడకపోవడం, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో సింగరేణిలో బొగ్గుకు డిమాండ్ తగ్గనున్నదని, ఈ క్రమంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని కార్మికులకు తెలుపనున్నారన్నారు. వచ్చే మా ర్చి 31 నాటికి ఈ ప్రక్రియ ప్రతి రోజు జరుగుతుందన్నారు.
కాగా, తొలుత అధికారులు, కార్మిక సంఘాల నాయకుల నుంచి సూచనలు తీసుకునేందుకు మొదటిసారిగా శనివారం గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మల్టీ డిపార్ట్‌మెంట్ కమిటీ సమాలోచన సమావేశాన్ని నిర్వహించి సలహాలు స్వీకరించారు. కార్పొరేట్ పర్సనల్ జీఎం సి.మల్లయ్యపంతులు, జీఎంలు సుగుణాకర్‌రెడ్డి, సుభానీ, వెంకట్రామయ్య, భాస్కర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, మేరుగు రవీందర్‌రెడ్డి, గోవర్దన్, ఆరెళ్లి పోషం, ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్య, హెచ్‌ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఉపాధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ఐఎన్‌టీయూసీ నాయకుడు డాలయ్య పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
Published Sun, Feb 8 2015 3:53 AM | Last Updated on Wed, Sep 5 2018 4:15 PM
Advertisement