గోదావరిఖని, న్యూస్‌లైన్ : హైపవర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, బొగ్గు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమలో మరో 10 శాతం పెట్టుబడులను ఉపసంహరించడం మానుకోవాలని, డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్ పునరుద్ధరించాలని, రిటైర్‌డ కార్మికుల పెన్షన్ 40 శాతం పెంచాలని, హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని కోరారు.
తొమ్మిదో వేతన ఒప్పందాలలో అమలుకాని అంశాలను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, బోనస్ చట్టంను కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వై.యాకయ్య, బుర్ర తిరుపతి, మెండె శ్రీనివాస్, కె.గోవిందరాజులు, ఎస్.మల్లికార్జున్, జి.ఆనందం, వంగ రామన్న, ఎండీ గని, సతీశ్, ఆర్.రవి, సీహెచ్ ఉపేందర్, సంజీవ్, సమ్మయ్య, లక్ష్మీ, అంజలి, వనమ్మ, వెంకటేశ్‌బాబు, ఎస్‌కె గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ-2లో..
యైటింక్లయిన్‌కాలనీ : హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఆర్జీ-2 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్, ప్రైవేట్ కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గంట పాటు ఆందోళన చేపట్టిన అనంతరం జీఎం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుపతి, ఓదెలు సంతోష్, సమ్మయ్య, రవిగౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘హైపవర్’ సిఫార్సులు అమలు చేయాలి
Published Fri, Dec 13 2013 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement