high power
-
బంగారం లోంచి సువాసనలు..!
కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్ హూవర్ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు. అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు. పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు. ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు. ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్ పోలండ్ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
హైపవర్ పోలీసు టెక్నాలజీ మిషన్
లక్నో: పోలీసు శాఖకు క్షేత్రస్థాయిలోని అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భవిష్యత్తుల్లో రాబోయే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ పోలీసు టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం డీజీపీలు, ఐజీపీల 56వ సదస్సులో ముగింపు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పోలీసు సంబంధిత సంఘటనలు విశ్లేషించి, కేసు స్టడీలను అభివృద్ధి చేయాలని, వీటిని పోలీసులకు పాఠ్యాంశాలుగా మార్చాలని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యత నానాటికీ పెరిగిపోతోందని ఉద్ఘాటించారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం ‘కోవిన్’ పోర్టల్, గవర్నమెంట్ ఈ–మార్కెట్(జీఈఎం), ఆన్లైన్లో చెల్లింపుల కోసం యూపీఐ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. డీజీపీలు, ఐజీపీల సదస్సును హైబ్రిడ్(ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమాచార మార్పిడి సులభతరం అవుతుందన్నారు. ‘స్మార్ట్’ పోలీసింగ్ విధానాన్ని సమీక్షించాలి దేశవ్యాప్తంగా పోలీసు దళాలకు ఉపయోగపడే విధంగా ఇంటర్–ఆపరేబుల్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నరేంద్ర మోదీ కోరారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల దృక్పథంలో సానుకూల మార్పు రావడం అభినందనీయమని అన్నారు. కోవిడ్–19 తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రజల అవసరాల కోసం డ్రోన్ టెక్నాలజీ వాడుకోవాలని వెల్లడించారు. 2014లో ప్రవేశపెట్టిన ‘స్మార్ట్’ పోలీసింగ్ విధానాన్ని సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. పోలీసులను సాధారణంగా ఎదురయ్యే సవాళ్లకు ‘హ్యాకథాన్ల’ ద్వారా సాంకేతిక పరిష్కారాలు కనిపెట్టడానికి నిపుణులైన యువతను భాగస్వాములను చేయాలన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సిబ్బందికి ప్రధాని మోదీ ‘ప్రెసిడెంట్ పోలీసు మెడల్’ ప్రదానం చేశారు. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ఆయన విలువైన సూచనలు అందించారు. -
‘హైపవర్’ సిఫార్సులు అమలు చేయాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : హైపవర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, బొగ్గు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమలో మరో 10 శాతం పెట్టుబడులను ఉపసంహరించడం మానుకోవాలని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పునరుద్ధరించాలని, రిటైర్డ కార్మికుల పెన్షన్ 40 శాతం పెంచాలని, హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని కోరారు. తొమ్మిదో వేతన ఒప్పందాలలో అమలుకాని అంశాలను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, బోనస్ చట్టంను కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వై.యాకయ్య, బుర్ర తిరుపతి, మెండె శ్రీనివాస్, కె.గోవిందరాజులు, ఎస్.మల్లికార్జున్, జి.ఆనందం, వంగ రామన్న, ఎండీ గని, సతీశ్, ఆర్.రవి, సీహెచ్ ఉపేందర్, సంజీవ్, సమ్మయ్య, లక్ష్మీ, అంజలి, వనమ్మ, వెంకటేశ్‌బాబు, ఎస్కె గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ-2లో.. యైటింక్లయిన్‌కాలనీ : హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఆర్జీ-2 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్, ప్రైవేట్ కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గంట పాటు ఆందోళన చేపట్టిన అనంతరం జీఎం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుపతి, ఓదెలు సంతోష్, సమ్మయ్య, రవిగౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.